breaking news
retro style clothing
-
Fashion: రెట్రో స్టైల్.. నాటి మహారాణీ చీరకట్టు హుందాతనం.. మళ్లీ ఇలా
నాటి మహారాణీ చీరకట్టు హుందాతనం.. తారామణిని చుట్టేసిన అందం.. నేడు అదే కళ తిరిగొచ్చి మన ఇంటి యువరాణులను ఆకట్టుకుంటున్నది. వేడుకలలో వైవిధ్యంగా వెలిగిపోతున్నది. రెట్రో స్టైల్ పాతదే అయినా మనల్ని ఎప్పుడూ కొత్తగా ఆకట్టుకుంటుంది. అందుకే డిజైనర్లు యాభై ఏళ్ల క్రితం నాటి స్టైల్‌కి కొత్త హంగులు అద్దుతుంటారు. కట్టూ బొట్టు, ఆభరణాల అలంకరణలోనూ అదే ప్రత్యేకతను చాటుతున్నారు. రాబోయే వేడుకలకు అలనాటి కళ సిద్ధం అంటూ పట్టు, డిజైనర్ శారీన్ను కొంగొత్తగా రూపుకడుతున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. చదవండి: Shirley Setia: బ్లూ సారీలో ధగధగ మెరిసిపోతున్న హీరోయిన్! చీర ధర ఎంతంటే Wrap Drape Dress: ర్యాప్.. డ్రేప్.. టాప్ టు బాటమ్ ఒకే రంగుతో! -
కాలం మీ... వస్త్రగతం
గతం గతః మళ్లీ వెళ్లి బళ్లో కూర్చోలేం. బారు జళ్లో స్నేహితురాలిచ్చిన చామంతిని తురుముకోలేం. పెళ్లి కూడా అంతే! ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లి... ‘నచ్చలేదు నాన్నా’ అని అలిగి, మూతి ముడుచుకోలేం. గతించినది ఏదీ తిరిగి రాదు. అంతేనా? మిగిలిందిక జ్ఞాపకాలేనా? భూతకాలపు రూపకాలేనా? లేదు లేదు, అమ్మాయిలూ... నిరాశపడే పనే లేదు! జారిపోయిన కాలం హస్తగతం కాకపోవచ్చు కానీ... ‘వస్త్రగతం’ అయి తీరుతుంది. రెట్రో స్టెయిల్స్, రెట్రో ఫ్యాషన్లు... మిమ్మల్ని (మీ చుట్టూ ఉన్నవాళ్లని కూడా)... పాత అనుభూతులలోకి మోసుకెళతాయి! రెట్రో అంటే... పరుగులు తీసే కాలం... ఒక్కక్షణం ఆగి, తలతిప్పి చూసే ఫ్యాషన్! మరి మీరెప్పుడు... కాలాన్ని మీవైపు తిప్పించుకోబోతున్నారు? కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. కొత్త లుక్‌తో మెరిసిపోవడం ఎలా?! అందరిలో అట్రాక్టివ్‌గా కనిపించేదెలా? అవే జీన్స్, అవే చుడీదార్లు, అవే లంగా ఓణీలు... కొత్తేమీ లేదా?! అని ప్రశ్నించే నేటి తరం అమ్మాయిలకు పాత లుక్‌ను కొత్తగా పరిచయం చేసే ట్రెండ్ రెట్రో! ఇందుకు బాలీవుడ్ నుంచి హాలీవుడ్ రేంజ్లోనూ కసరత్తులు జరుగుతున్నాయి. కాలేజీ నుంచి కాన్స్ వరకు రెట్రో లుక్ ఇప్పుడు అంతటా హల్చల్ చేస్తోంది. నిన్నా మొన్న ‘అబ్బో పాత చింతకాయ పచ్చడి’ అనే ముఖం ముడిచే అమ్మాయిలే ‘ఓహ్ ఓల్డ్ ఈజ్ న్యూ యార్!’ అని ఎగిరి గంతేసే ఇయర్ మన ముందుంది. తలకట్టు నుంచి పాదాల వరకు... పాత సినిమాలను కొత్తగా తీస్తున్నట్టే ఫ్యాషన్‌ను పాత నుంచి కొత్తగా మార్చుకుంటున్నారు నేటితరం. 60ల కాలంలో పట్టులాంటి మృదువైన జుట్టును భుజాల మీదుగా వదిలేస్తేనే అందం అనుకునే అమ్మాయిలు ఇక నుంచి రంగురంగుల ప్రింట్లు ఉన్న క్లాత్‌ను రిబ్బన్‌లా వాడచ్చు. ఒకప్పుడు అశాఫరేఖ్, సైరాభాను, హేమమాలిని, శ్రీదేవి హెయిర్ స్టైల్స్‌నే కాదు డ్రెస్స్టైల్స్నూ ఇప్పుడు ఐశ్వర్యారాయ్, నేహాదుపియా, విద్యాబాలన్, దీపికాపదుకొనే, ప్రియాంకాచోప్రా సోనమ్‌కపూర్... వంటి తారాగణమంతా వరుసగా అనుకరించడానికి ఆసక్తి చూపుతున్నారు. యాక్షన్ రీప్లే, ఓమ్శాంతి ఓమ్.. వంటి సినిమాల్లోనే కాదు రాబోతున్న లూటెరా, గుండే, బాంబే వెల్వెట్, ఒన్స్ అపాన్ ఎ టైమ్ ముంబాయ్ దోబారా.. సినిమాల్లోనూ తారలు ‘పాత లుక్’లో కొత్తగా మెరిసిపోతున్నారు. బెల్‌బాటమ్స్ టు షార్ట్ కుర్తీలు 70-80 దశకంలో వదులుగా ఉండే బెల్‌బాటమ్ ప్యాంట్స్ హల్చల్ చేశాయి. అవే ఇప్పుడూ మార్కెట్లో కనువిందు చేయడానికి సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే విద్యాబాలన్, నేహాధూపియా వంటి తారలు బెల్‌బాటమ్స్ ధరించి పెద్ద పెద్ద ఈవెంట్లలో సందడి చేస్తున్నారు. అలాగే దేహానికి అతుక్కుపోయేలాంటి షార్ట్ కుర్తీలు, ప్యాంట్లూ వచ్చేశాయి. వాటిలో లెగ్గింగ్స్‌ను ప్రధానంగా చెప్పుకోవచ్చు. మేకప్ టు యాక్ససరీస్! కళ్లకు దట్టమైన కాటుక, కంటి చివరల నుంచి పొడవుగా సాగే ఐ లైనర్లు, పెద్ద పెద్ద ఫ్రేమ్ ఉన్న కళ్లద్దాలు, హెయిర్ బ్యాండ్స్, ఆభరణాలూ పాత తరాన్ని అనుకరిస్తున్న లిస్ట్‌లో ఉన్నాయి. ‘సాధారణంగా ఏ ఫ్యాషన్ అయినా 10ఏళ్లకోసారి ఏదో రూపంలో కనిపిస్తుంది. డిజైనర్లు కూడా అందుబాటు ధరల్లో ఫ్యాషన్‌ని సృష్టించాలని తపిస్తారు. అలాంటప్పుడే రెట్రో ఊపిరి పోసుకుంటుంది. రెట్రోలో సింథటిక్ ఫ్యాబ్రిక్, షిఫాన్ వినియోగిస్తారు. ప్రస్తుతం అమ్మాయిలు చుడీదార్స్కు బదులు పలాజోస్ (లూజ్ప్యాంట్స్) వేసుకుంటున్నారు. అలాగే బైట్ ఎల్లోస్, బ్రైట్ గ్రీన్, ఎక్కువ రెడ్, అత్యంత తక్కువ వైట్ వాడుతూ ఎక్కువగా బ్లాక్‌తో మిక్స్ అండ్ మ్యాచ్ వేస్తున్నారు. హెయిర్ ముడికడుతూ, బన్స్టైల్లో వేస్తున్నారు. - అయేషా, లఖోటియా ఫ్యాషన్ డిజైనర్ మీరూ రెట్రో లుక్‌లో కొత్తగా మెరిసిపోవాలనుందా? అయితే, మీ వార్డ్‌రోబ్‌లో ఈ తరహా డ్రెస్సులు ఉండేలా జాగ్రత్తపడితే చాలు విత్ యాక్ససరీస్‌తో సహా! పువ్వుల ప్రింట్లు, లేస్‌లు, కుచ్చులు, పోల్కా డాట్స్, గళ్లు, రిబ్బన్లు, హెడ్ బ్యాండ్స్ (హిప్పీ స్టైల్), గౌన్లు, అక్కడక్కడా చిరుగులు ఉండి బాగా వెలిసిపోయినట్టుగా ఉండే జీన్స్, లూజు ప్యాం్టట్స్. డ్రెస్సుల మీదకు ఆభరణాలుగా పొడవైన సన్నని చైన్ దానికి పెద్ద ఆకర్షణీయమైన లాకెట్. అమ్మలు, అమ్మమ్మల కాలం నాటి స్కార్ఫ్ (పువ్వుల ప్రింట్లు, ఎంబ్రాయిడరీ, పోల్కా డాట్స్ ఉన్న క్లాత్‌ని స్కార్ఫ్‌లా మెడకు చుట్టేసుకోవచ్చు. పాతకాలం నాటి మోడల్ టోపీ, కళ్లద్దాలు.. ఉంటే చూసుకుంటే చాటు రెట్రో స్టైల్‌ను ఫాలో అయిపోవచ్చు.