breaking news
researcers
-
గడ్డకట్టే చలిలో వేడి వేడి పూరీ, ఛోలే...ఎక్కడ?
అంటార్కిటికా(Antarctica) లోని భారత పరిశోధనా కేంద్రంలో ఉత్తర భారత దేశంలో బాగా ప్రాచుర్యం పొందిన ఒక ప్రసిద్ధ వంటకాన్ని వడ్డించడం విశేషంగా నిలిచింది. అంటార్కిటికాలోని భారత పరిశోధనా కేంద్రంలో పనిచేస్తున్న ఒక వైద్యుడు, దక్షిణ ధృవం వద్ద తన జీవితం గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచు కున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట సందడిగామారింది.అంటార్కిటికాలోని ఘనీభవించిన ప్రకృతి దృశ్యాలే కాదు, ఇంట్లో వడ్డించినట్టుగా వేడి వేడి పూరీ చోలే కూరను బ్రేక్‌ఫాస్ట్‌గా వడ్డిస్తుందట. View this post on Instagram A post shared by Rahul Jain (@doctorrahuljain)"> డా. రాహుల్ జైన్ తన ఇన్‌స్టాలో షేర్ చేసిన వీడియోలో మైత్రి సెంటర్లో పూరీలు ఛోలే కర్రీని చూపించారు. ఒక వ్యక్తి తాజా పూరీలు తయారు చేస్తున్నట్లు కనిపించింది. "బయటేమో30 డిగ్రీల సెల్సియస్, చల్లగాలులు మరి లోపల వైబ్స్? వేడి వేడి పూరీ, ఛోలే విత్ చాయ్.. నోస్టాల్జియా. ఘనీభవించిన రోజును రుచికరమైన జ్ఞాపకంగా మార్చినందుకు మా మాస్టర్ చెఫ్‌కు ధన్యవాదాలు. రుచిని మించింది మంచి ఆహారం..ఈ వెచ్చదనం మన సొంత ఇల్లు లాంటిది"అంటూ రాసుకొచ్చారు. దీనిపై నెటిజన్లు కూడా ఆనందంగా స్పందించారు.ఆ మంచు ప్రదేశంలో వేడి వేడి పూరీ ఛోలే సూపర్ అని కొందరు, అంటార్కిటికాలోని చోలే పూరి నా ఆత్మను నా శరీరాన్ని విడిచిపెట్టడానికి అనుమతిస్తుంది. మీరు దానితో ఒక కప్పు గరం..గరం.. అద్రక్ చాయ్ తాగారా సార్?" అని మరొకరు,"జీవితంలో ఏదో ఒక సమయంలో అంటార్కిటికాలోఛోలే పూరి తినేలాగా ఏదో ఒకటి చేయాలి" అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. "ఇది 'విద్యాపరమైన నైపుణ్యం' మాత్రమే భరించగల ధనవంతుల స్థాయి’ అని మరో కామెంట్ కూడా వచ్చింది.భారతదేశం అంటార్కిటికాలో "మైత్రి","భారతి" అనే రెండు పరిశోధనా కేంద్రాలున్నాయి. ఇక్కడ పరిశోధకులు, సిబ్బందికి సాంప్రదాయ భారతీయ వంటకాలు అందిస్తారు. పూరీలోకి కూరగా మసాలా శనగలు (ఛోలే) కూరను వడ్డిస్తారు. -
ఇన్ఫోసిస్ ప్రైజ్.. 40 ఏళ్లకు తగ్గించిన వయో పరిమితి
ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ ప్రతి ఏటా అందించే ‘ఇన్ఫోసిస్ ప్రైజ్’కు సంబంధించి కొత్త మార్గదర్శకాన్ని ప్రకటించింది. ఇన్ఫోఫిస్ ప్రైజ్ కోసం నామినేషన్ల వయోపరిమితిని 40 ఏళ్లలోపు కుదించినట్లు ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ బుధవారం వెల్లడించింది. మరింత మంది యువ ప్రతిభావంతులను పరిశోధనలో పాల్గొనేలా ప్రోత్సహించేందుకు ఇన్ఫోసిస్ ప్రైజ్ కోసం నామినేషన్ల వయోపరిమితిని 40 ఏళ్లలోపు తగ్గించినట్లు తెలిపింది. వారిలోని అసాధారణ ప్రతిభను కనిపెట్టి, వారి సేవలను సత్కరించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్లు పేర్కొంది.అంతేగాక ఇప్పటివరకు సోషల్ సైన్సెస్ కేటగిరిలో భాగమైన ఎకానమిక్స్ కోసం ప్రత్యేక బహుమతి అందిచనున్నట్లు తెలిపింది. దీంతో బహుమతులు అందజేసే వర్గాల సంఖ్య ఏడుకు చేరుకుంది. కాగా ఫౌండేషన్ తరపున ఇప్పటి వరకు 92 మంది పరిశోధకులకు అవార్డులు ప్రదానం చేశారు.కాగా ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ఇంజినీర్లు సంబంధిత రంగాల్లో విశేష కృషి చేసినందుకుగాను పత్రి ఏటా ‘ఇన్ఫోసిస్ ప్రైజ్’ను అందిస్తోంది. ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, హ్యుమానిటీస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్య వంటి ఆరు విభాగాల్లో కృషి చేసిన వారికి ఈ బహుమతిని ప్రదానం చేస్తారు. ప్రతి కేటగిరి నుంచి గెలుపొందిన విజేతలకు ఒక బంగారు పతకంతోపాటు, ప్రశంస పత్రం, లక్ష డాలర్లు( భారత కరెన్సీ ప్రకారం రూ. 83 లక్షల 50 వేలు), దానికి సమానమైన ప్రైజ్ పర్స్ అందిస్తారు.ఇదిలా ఉండగాప్రొఫెసర్ అరవింద్, ప్రొఫెసర్ కౌశిక్ బసు, ప్రొఫెసర్ శ్రీనివాస్ కులకర్ణితో కూడిన జ్యూరీ ఇప్పటికే ‘ఇన్ఫోసిస్ ప్రైజ్ 2024’ కోసం నామినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ ఏడాది నవంబర్‌లో విజేతలను ప్రకటించే అవకాశం ఉంది. అవార్డు ప్రదానోత్సవం జనవరిలో జగనుంది.మానవాళికి మేలు చేసే అత్యుత్తమ పరిశోధనలను గుర్తించడం, దేశంలోని యువ పరిశోధకులకు, ఔత్సాహిక శాస్త్రవేత్తలకు ఆదర్శంగా నిలవడమే ఇన్ఫోసిస్ ప్రైజ్ ప్రాథమిక లక్ష్యం. కాగా విదేశాలకు చెందిన విజేతలు బహుమతిని గెలుచుకునే సమయంలో తమకు నచ్చిన ఇండియన్ ఇన్స్టిట్యూట్లలో తగిన సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. దేశంలో గరిష్టంగా రెండు పర్యటనలలో 30 రోజులు గడవాల్సిందిగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ కోరుతుంది. -
మెదడు పని పసిగట్టే యాప్
లండన్: ఉదయాన్నే నిద్రలేచినప్పుడు ఈ రోజు మన పనితీరు ఏ విధంగా ఉండబోతుందని ఎవరైనా అడిగితే.. చెప్పడం కష్టమే. ఈవిషయాన్ని చెప్పగలిగే అధునాతన యాప్‌ను అభివృద్ధి చేశారు లండన్ పరిశోధకులు. దీనికి చేయాల్సిందల్లా యాప్ నుంచి మనకు వచ్చిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడమే. ఎప్పుడు నిద్రలేచారు.. ఆందోళనగా ఉన్నారా.. ఈ రోజు ఎలా ఫీలవుతున్నారు.. వంటి ప్రశ్నలు ఉంటాయి. వీటికీ సమాధానాలు ఇస్తే చాలు. ఆ రోజు మన మెదడు పనితీరు ఎలా ఉండబోతుందో ఒక స్కోర్ వస్తుంది. దీని ఆధారంగా కార్యక్రమాలు ప్లాన్ చేసుకోవచ్చంటున్నారు పరిశోధకులు.