breaking news
regulerisation
-
జీవో 16పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి,హైదరాబాద్ : జీవో 16పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. క్రమబద్దీకరణ (రెగ్యూలరైజ్) ద్వారా ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న వారి తొలగింపునకు ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ జారీ చేసిన జీవోను హైకోర్టు రద్దు చేసింది. సెక్షన్ 10ఏ ప్రకారం తీసుకొచ్చిన జీవో 16ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.విద్య, వైద్య శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెగ్యూలరైజ్ చేసింది. 2016లో కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ జీవో 16ను సవాల్ చేస్తూ నిరుద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజేషన్ జీవోను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై జస్టిస్ సుజోయ్‌పాల్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.ఈ సందర్భంగా.. సుప్రీం కోర్టు తీర్పుకు, రాజ్యాంగంలోని 14, 16, 21 ఆర్టికల్‌కు ప్రభుత్వ నిర్ణయం విరుద్ధమన్న పిటిషనర్ల వాదనపై జస్టిస్ సుజోయ్ పాల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. అనంతరం, క్రమబద్దీకరణ ద్వారా ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న వారి తొలగింపునకు ఆదేశాలు ఇవ్వలేమని తెలిపింది.దీంతో పాటు మిగిలిన ఖాళీలను చట్టప్రకారం భర్తీ చేయాలని సర్కార్‌కు ఆదేశించింది. పూర్తి వివరాలను ఆర్డర్ కాపీలో పేర్కొంటోమని వెల్లడించింది. ఇప్పటికే క్రమబద్ధీకరణ అయిన ఉద్యోగులకు తొలగించొద్దన్న హైకోర్టు.. ఇకముందు భర్తీ చేసే ఉద్యోగాలన్నీ చట్టప్రకారం చేయాలని ఆదేశించింది. ఇప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ కాకుండా నోటిఫికేషన్ల ద్వారా చేయాలని కోర్టు తీర్పును వెలువరించింది. -
మూత'బడు'లు
మూసివేత దిశగా 100కు పైగా పాఠశాలలు 1:30 ప్రకారం 155, 1:20 ప్రకారం అయితే 105 స్కూళ్లు .. 78 సక్సెస్ పాఠశాలలపైనా వేటు కొంపముంచుతున్న రేషనలైజేషన్ డీఎస్సీపైనా తీవ్ర ప్రభావం విద్యాశాఖలో రేషనలైజేషన్ సంక్షోభం నెల కొంది. తాజా బదిలీలు, రేషనలైజేషన్‌కు సంబంధించి జీవో నం.11 లేదా సవరించిన కొత్త మార్గదర్శకాల ప్రకారం కూడా సర్కారు పాఠశాలలపై తీవ్ర ప్రభావం పడనుంది. నిజామాబాద్ అర్బన్ : విద్యాశాఖలో రేషనలైజేషన్ సంక్షోభం నెలకొంది. తాజా బదిలీలు, రేషనలైజేషన్‌కు సంబంధించి జీవో నం.11 లేదా సవరించిన కొత్త మార్గదర్శకాల ప్రకారమైనా సర్కారు పాఠశాలలపై తీవ్ర ప్రభావం పడనుంది. జిల్లాలో 100కు పాఠశాలలు మూసివేసే ప్రమాదం ఏర్పడింది. ఈ ప్రక్రియను అమలు చేస్తే విద్యాశాఖనే సందిగ్ధంలో పడే అవకాశం ఉంది. తాజా మార్గదర్శకాలపై పాఠశాల డెరైక్టర్ ఆదేశాల కోసం విద్యాశాఖ ఎదురుచూస్తుండగా జీవో నం. 11ను అమలు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. దీంతో సర్కారు పాఠశాలల మనుగడకు ముప్పు ఏర్పడనుంది. 100కు పైగా పాఠశాలలు మూత.. తాజా ఉత్తర్వులు లేదా సవరించిన మార్గదర్శకాల ప్రకారం 100కు పైగా పాఠశాలలకు ముప్పు వాటిల్లనుండడంతో విద్యాశాఖ అధికారులే విస్మయం చెందుతున్నారు. జిల్లాలో 463 ఉన్నత పాఠశాలలు, 576 ప్రాథమిక పాఠశాలు, 263 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో 2.65 లక్షల మంది విద్యనభ్యసిస్తున్నారు. తాజాగా టీచర్ల బదిలీలు, రేషనలైజేషన్‌కు సంబంధించి ప్రభుత్వం జీవోనం.11ను విడుదల చేసింది. దీని ప్రకారం 1:30 ప్రకారం అరుుతే 155 పాఠశాలలు, ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ మేరకు 1:20 ప్రకారం అరుుతే 105 పాఠశాలలు మూసివేసే అవకాశం ఉంది. అంతేకాక 1:30 ప్రకారం రేషనలైజేషన్ చేపడితే 1175 టీచర్ పోస్టులు బదలాయించాల్సి వస్తుంది. ఇందులో 68 మంది టీచర్లను మాత్రమే బదలాయించే అవకాశం ఉంది. మిగితా 1107 టీచర్ పోస్టులు ఎక్కువగా మిగిలిపోతున్నాయి. ఈ పోస్టులను ఎక్కడ భర్తీ చేయాలనే దానిపై సందిగ్ధత నెలకొంది. ఈ సమయంలో మిగిలిన వారిని సైతం ఆయా పాఠశాలల్లో వరుస క్రమంగా కేటాయిస్తే పాఠశాలలకు అదనంగా ఉపాధ్యాయులను కేటాయించినట్టవుతుంది. ఈ విధానాన్నే విద్యాశాఖ కొనసాగించే అవకాశం ఉంది. 1:20 ప్రకారం రేషనలైజేషన్ చేపడితే 750 పోస్టులు మిగిలిపోతున్నాయి. వీరిని సైతం ఇదే విధంగా కేటాయించే అవకాశం ఉంది. 78 సక్సెస్ పాఠశాలలకు ఎసరు... రేషనలైజేషన్ ప్రక్రియలో భాగంగా ఇంగ్లిష్ మీడియం బోధిస్తే సక్సెస్ పాఠశాలలు మూసివేసే ప్రమాదం ఏర్పడింది. జీవో నం.11 ప్రకారం 50 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న సక్సెస్ పాఠశాలలను మూసివేయాలని ఆదేశాలు అందాయి. జిల్లాలో 188 సక్సెస్ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 50 మంది విద్యార్థుల కన్న తక్కువ ఉన్న పాఠశాలలు 78 ఉన్నాయి. వీటిని మూసివేసే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ సమీప పాఠశాలలకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో సక్సెస్ పాఠశాలలో విలీనం చేయనున్నారు. లేదంటే ఉన్నత పాఠశాలల్లోనే కొనసాగించనున్నారు. ఈ పాఠశాలల్లో ఉన్న టీచర్లను సైతం బదలాయిస్తారు. డీఎస్సీపై తీవ్ర ప్రభావం... రేషనలైజేషన్ ప్రక్రియ డీఎస్సీపై తీవ్ర ప్రభావం చూపనుంది. రేషనలైజేషన్‌లో సుమారు వెయ్యి పోస్టులు ఎక్కువగా మిగిలిపోనున్న నేపథ్యంలో ఆ ఉపాధ్యాయులతో ఖాళీలు భర్తీ చేస్తారు. ఇది డీఎస్సీపై ప్రభావం చూపుతుంది. 1:30 ప్రకారం 1107, 1:20 ప్రకారం 750 పోస్టులు మిగిలిపోనున్నాయి. దీంతో జిల్లాలో అసలు పోస్టులు ఖాళీలు లేకుండా పోతున్నాయి. డీఎస్సీ నిర్వహణకు జిల్లాలో 1150 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు జిల్లా అధికారులు పాఠశాల డెరైక్టర్‌కు నివేదించారు. రేషనలైజేషన్ చేస్తే ఈ పోస్టులు సైతం మిగిలేలా లేవు. మరి దీనిపై విద్యాశాఖ ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి. పాఠశాలల మూసివేత మానుకోవాలి రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను ఒక్కటి కూడా మూసివేయొద్దు. టీచర్ల పోస్టులు బదలాయించినా 1:20 ప్రకారం రేషనలైజేషన్ చేపట్టాలి. ప్రభుత్వ పాఠశాలల మనుగడను కాపాడాలి. - కమలాకర్‌రావు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ప్రాథమిక పాఠశాలలను మెరుగుపర్చాలి రేషనలైజేషన్‌లో భాగంగా ప్రాథమిక పాఠశాలలకు తీవ్ర అన్యాయం జరుగనుంది. వందలాది పాఠశలలు మూసివేసే ప్రక్రియ వెంటనే విరమించుకోవాలి. పాఠశాలలను మెరుగుపర్చాలి. పేద, మధ్యతరగతి విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలి. - మాడవేడి వినోద్‌కుమార్, బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు