breaking news
record rate
-
కొనసాగుతున్న వెండి వెలుగులు
న్యూఢిల్లీ: వెండి రికార్డు ర్యాలీ కొనసాగుతోంది. అంతర్జాతీయ సంకేతాలకు అనుగుణంగా సోమవారం వెండి కేజీ ధర మరో రూ. 1,000 పెరిగి కొత్త గరిష్ట స్థాయి రూ. 1,08,100ని తాకిందని ఆలిండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. ఇతర ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలరు బలహీనపడటం, అంతర్జాతీయంగా భౌగోళికరాజకీయ ఉద్రిక్తతలు పెరగడం, ఎలక్ట్రిక్ వాహనాలు.. సౌర విద్యుత్ పరిశ్రమల నుంచి డిమాండ్ పెరగడం తదితర అంశాలు ఇందుకు కారణమని ట్రేడర్లు తెలిపారు. వెండి అంతర్జాతీయంగా 13 ఏళ్ల గరిష్టం, దేశీయంగా లైఫ్‌టైమ్ గరిష్టాలను తాకినట్లు మెహతా ఈక్విటీస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కలాంత్రి తెలిపారు. యూరప్‌లో ద్రవ్యోల్బణం నెమ్మదించడం, వాణిజ్య వివాదాలు సమసిపోవడంపై ఆశావహ భావం నెలకొనడం లాంటి అంశాలతో వెండి ధర కన్సాలిడేషన్ శ్రేణి నుంచి బైటపడిందని, ఔన్సు (31.1 గ్రాములు) రేటు 36 డాలర్లను అధిగమించిందని పేర్కొన్నారు. మరోవైపు, న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ. 280 మేర తగ్గి రూ. 97,780కి (పన్నులు సహా) పరిమితమైంది. అలాగే 99.5 శాతం స్వచ్ఛ త గల బంగారం ధర రూ. 250 క్షీణించి రూ. 97,350కి తగ్గింది. అమెరికా, చైనా మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారం కోసం ఇరు దేశాల మధ్య సానుకూల సంప్రదింపులు జరిగే అవకాశం ఉందని ఇన్వెస్టర్లలో ఆశాభావం నెలకొన్న నేపథ్యంలో బంగారంలాంటి సురక్షితమైన పెట్టుబడి సాధనాలకు డిమాండ్ కాస్త నెమ్మదించవచ్చని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ చెప్పారు. -
పసిడి.. పరుగో పరుగు!
న్యూయార్క్/న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా పసిడి పరుగు కొనసాగుతోంది. నైమెక్స్ ఫ్యూచర్స్ మార్కెట్లో చురుగ్గా ట్రేడవుతున్న డిసెంబర్ కాంట్రాక్ట్ ఔన్స్ (31.1గ్రా) ధర క్రితం ముగింపుతో పోలి్చతే సోమవారం 12 డాలర్లు పెరిగి సరికొత్త రికార్డు 2,659.7 డాలర్లను తాకింది. ఈ వార్త రాస్తున్న రాత్రి 9 గంటల సమయంలో దాదాపు అదే స్థాయిలో ట్రేడవుతోంది. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫండ్ రేటు కోతతో మార్కెట్లో ద్రవ్య లభ్యత పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, పలు దేశాల్లో కొనసాగుతున్న ద్రవ్యోల్బణం భయాలు పసిడి పరుగుకు కారణం. ఇక దేశీయంగా కూడా పసిడి ధర పటిష్టంగానే కొనసాగుతున్నప్పటికీ, కస్టమ్స్ సుంకాల తగ్గింపు, రూపాయి బలోపేత ధోరణి పసిడి పరుగును కొంత నిలువరిస్తున్నాయి. న్యూఢిల్లీలో 10 గ్రాముల ధర రూ. 600 ఎగసి రూ. 76,950కి చేరింది. దేశీయ ఫ్యూచర్స్ ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల ధర రూ.255 పెరిగి రూ.74,295కు చేరింది. -
రికార్డు దిశగా బంగారం ధర.. ఇవీ కారణాలు..
సాక్షి, విశాఖపట్నం: పసిడి ధర పరుగులు తీస్తోంది. సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎగబాకుతోంది. కొన్నాళ్లుగా ధర పెరగడమే తప్ప తగ్గడంలేదు. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో నెలన్నర క్రితం డిసెంబర్ 5న 24 కేరెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,350 ఉంది. ప్రస్తుతం రూ.58,770కు చేరింది. అంటే 45 రోజుల్లో రూ.మూడున్నర వేలు పెరిగింది. ఇక 22 కేరెట్ల పుత్తడి రూ.54,040కి చేరుకుంది. నగల దుకాణాల్లో ఆభరణాలపై తరుగు, మజూరీ పేరిట 10 నుంచి 23 శాతం వరకు కొనుగోలుదారుడి నుంచి అదనంగా వసూలు చేస్తారు. ఈ లెక్కన సగటున 15 శాతం వీటికి చెల్లిస్తే పది గ్రాముల బంగారు నగకు రూ.68 వేలు అవుతోంది. దీనికి జీఎస్టీ అదనం. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో బంగారాన్ని తులం (11.66 గ్రాములు) లెక్కల్లో కొనుగోలు చేస్తారు. ఆ లెక్కన చూస్తే తులం ముడి బంగారం ధర రూ.68,625 అవుతుంది. అదే తులం ఆభరణాల ధర రూ.79 వేల వరకు ఉంటుంది. బంగారాన్ని ఆభరణాలకే కాకుండా ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీలోనూ వినియోగిస్తారు. ప్రస్తుతం కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ కూడా ఊపందుకుంది. మరోవైపు రష్యా–ఉక్రెయిన్ దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ఆరి్థక మాంద్యం కూడా తోడైంది. అంతర్జాతీయంగా డాలర్‌తో రూపాయి మారకం విలువ తగ్గడం, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల ప్రభావం, షేర్ మార్కెట్లో అనిశ్చితి వంటివి పసిడి ధర ఎగబాకడానికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆల్‌టైం హై దిశగా.. 2020 ఆగస్టులో 24 కేరెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.59,300కు చేరుకుంది. పుత్తడి చరిత్రలో అదే ఆల్‌టైం రికార్డు. ఇప్పుడు మళ్లీ ఆ రికార్డును దాటుకొని సరికొత్త రికార్డు దిశగా బంగారం పరుగులు తీస్తోంది. ప్రస్తుతం ధర పెరుగుతున్న వేగం, అంతర్జాతీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని రానున్న రోజుల్లో మరింత పెరుగుతుందని వర్తకులు అంచనా వేస్తున్నారు. తగ్గుతున్న కొనుగోళ్లు బంగారం ధర పెరుగుదల ఆభరణాల కొనుగోళ్లపై ప్రభావం చూపుతోంది. కొన్నాళ్లుగా పసిడి ధర పెరుగుతుండడం వల్ల అమ్మకాలు పడిపోయాయని ది బెజవాడ జ్యూయలరీ అండ్ బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.శ్రీహరి సత్యనారాయణ ‘సాక్షి’తో చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఔన్స్ (30 గ్రాములు) ధర 1910 నుంచి 1931 డాలర్లకు పెరిగిందన్నారు. చదవండి: దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్‌లో సగం సీట్లు ఖాళీ ఇది 1870 డాలర్లకు దిగివస్తే బంగారం ధర తగ్గే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆర్థిక మాంద్యం, డాలరుతో రూపాయి మారకం విలువ తగ్గడం వంటివి బంగారం ధర పెరగడానికి దోహదపడుతున్నాయని విశాఖ గోల్డ్ అండ్ సిల్వర్ మర్చంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మారోజు శ్రీనివాసరావు చెప్పారు. పెళ్లిళ్ల సీజను వేళ పెను భారం.. ఈనెల 25 తర్వాత నుంచి పెళ్లిళ్ల సీజను ప్రారంభమవుతుంది. పెళ్లింట బంగారం కొనుగోలు తప్పనిసరి. పేద, మధ్య తరగతి వారు కనీసం 40 – 50 గ్రాములైనా కొనాలి. ఈ స్వల్ప మొత్తానికే రూ.3 లక్షల వరకు ఖర్చు చేయాలి. ఇలా ఆకాశాన్నంటుతున్న పసిడి ధర తమకు పెనుభారం అవుతుందని మధ్య తరగతి వారు చెబుతున్నారు. -
పట్టుగూళ్లకు రికార్డు స్థాయి ధరలు
పట్టుగూళ్లకు రికార్డు స్థాయి ధరలు చేబ్రోలు మార్కెట్లో కిలో రూ.452 గొల్లప్రోలు (పిఠాపురం) : ధర పలికింది. సీబీ(కోలార్చిన) రకం కిలో గూళ్లుపట్టుగూళ్లకు రికార్డు స్థాయి ధరలు పలుకుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సీజ¯ŒSలో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. చేబ్రోలు పట్టుగూళ్ల మార్కెట్లో రెండు రోజులుగా రికార్డు ధరలకు గూళ్ల అమ్మకాలు జరిగాయి. పట్టు రైతుల రద్దీతో మార్కెట్ కళకళలాడుతోంది. మార్కెట్లో నిర్వహించిన బహిరంగ వేలంలో అత్యధికంగా రాజఒమ్మంగి మండలం కిండ్రకాలనీకి చెందిన గుమ్మిడి బెన్నమ్మకు చెందిన బైవోల్టి¯ŒS రకం గూళ్లకు కిలో రూ.452 రికార్డు రూ.330 వరకు ధర పలికాయి. బైవోల్టి¯ŒS కిలో సరాసరి రూ.390 నుంచి రూ.452 పలకడం ఈఏడాదిలో ఇదే మొదటిసారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రోజుకు రెండు నుంచి నాలుగు టన్నుల గూళ్ల విక్రయాలు జరుగుతున్నట్టు మార్కెటింగ్ ఆఫీసర్ ఎ¯ŒS.సుదర్శనరావు తెలిపారు. రాయలసీమ, పశ్చిమగోదావరిజిల్లా ప్రాంతాల్లో దిగుబడులు తగ్గడంతో స్థానికంగా మంచి ధరలు లభిస్తున్నాయన్నారు. శిల్క్కు మంచి డిమాండ్ ఉండడంతో రీలర్లు సైతం పాటలో(కొనుగోలులో) చురుగ్గా పాల్గొంటున్నారు.