breaking news
ravimohan
-
నటుడు జయం రవి పిటిషన్ కొట్టివేత
ఇటీవల తరచూ వార్తల్లో ఉంటున్న నటుడు రవిమోహన్ (జయం రవి). ఈయన భార్యతో వివాహ రద్దు కేసు కోర్టులో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో గాయని కనిష్కతో ప్రేమాయణం అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. వాటిని నిజం చేసే విధంగా నటుడు రవిమోహన్ గాయనీ కనిష్కతో ఆలయాలకు, ఇతర కార్యక్రమాలకు కలిసి తిరుగుతున్నారు. ఇప్పుడు కూడా ఈయన గాయని కనిష్కతో కలిసి సంగీత కచేరిలో భాగంగా శ్రీలంకకు వెళ్లారు. అక్కడ మంత్రులతో కలిసి తీయించుకున్న ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. ఇదిలా ఉంటే రవిమోహన్ తన సంస్థకు రెండు చిత్రాలు చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నారని, అందుకు గానూ ఆయనకు రూ.6 కోట్లు అడ్వాన్స్ ఇచ్చినట్లు, అయితే ఆయన తమ సంస్థకు చిత్రాలు చేయకుండా వేరే సంస్థలకు చేస్తున్నారని, అడ్వాన్స్ తిరిగి చెల్లించమని కోరినా , ఇవ్వడం లేదని బాబీ టచ్ గోల్ల్ యూనివర్సల్ సంస్థ చైన్నె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో నటుడు రవిమోహన్ కూడా తాను కేటాయించిన కాల్షీట్స్ను వాడుకోకుండా వృథా చేసినందుకు గానూ ఆ సంస్థే తనకు నష్ట పరిహారంగా రూ.9 కోట్లు చెల్లించాలని కోరుతూ చైన్నె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుపై ఇటీవల విచారణ జరిగింది. కాగా తాజాగా న్యాయస్ధానంలో మరోసారి విచారణ జరిగింది. ఈ కేసు పరిష్కారం కోసం ఒక మధ్యవర్తిని ఏర్పాటు చేయాలని ఆదేశిస్తూ, నటుడు రవిమోహన్ పిటిషన్‌ను కొట్టి వేసింది. అంతే కాకుండా నటుడు రవిమోహన్ రూ.5.9 కోట్లకు సంబంధించిన పత్రాలను 4 వారాలలోగా కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. -
ఇల్లు తుడిచిన హీరో.. ఎవరో తెలుసా?
సండే వచ్చిందంటే ఎవరైనా సరే విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు. లేదా జాలీగా ఎక్కడికైనా వెళ్లి రావాలనుకుంటారు. కుదిరితే పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేసుకుంటారు. కానీ ఇక్కడ కనిపిస్తున్న హీరో మాత్రం తన ఇల్లు తుడిచే పనిలో పడ్డాడు. తమిళ హీరో రవి మోహన్ (Ravi Mohan) ఇంటిని శుభ్రం చేస్తున్న వీడియోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో యాడ్ చేశాడు. శుభ్రంగా ఒకటికి రెండుసార్లు ఫ్లోర్ తుడుస్తున్నాడు. 'సొంతంగా ఇంటిని శుభ్రం చేసుకోవడమే ఈరోజు నా పని. జయం సినిమాతో హిట్అదేంటోకానీ ఈ పని చేస్తుంటే నాకు సంతోషంగా అనిపిస్తోంది' అని రాసుకొచ్చాడు. ఇది చూసిన అభిమానులు మీరు గ్రేట్ అని కామెంట్లు చేస్తున్నారు. రవి మోహన్.. బావ బావమరిది, పల్నాటి పౌరుషం వంటి తెలుగు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు. జయం (తెలుగు జయం రీమక్) అనే తమిళ సినిమాతో హీరోగా మారాడు. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో ఈయన పేరు జయం రవిగా స్థిరపడిపోయింది. తమిళంలో హీరోగా..దాస్, ఇదయ తిరుదన్, దీపావళి, పెరణ్మనై, ఎంగేయుమ్ కాదల్, ఆది భగవాన్, రోమియో జూలియట్, మిరుథన్, బోగన్, టిక్ టిక్ టిక్, భూమి, పొన్నియన్ సెల్వన్, బ్రదర్, భూలోహం, కాదలిక్క నేరమిళ్లై వంటి పలు సినిమాలు చేశాడు. ప్రస్తుతం అతడి చేతిలో కరాటే బాబు, పరాశక్తి, జీని, తని ఒరువన్ చిత్రాలున్నాయి.విడాకులు?ఇదిలా ఉంటే రవి.. నిర్మాత సుజాత విజయకుమార్ కూతురు ఆర్తిని 2009లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఆరవ్, అయాన్ అని ఇద్దరు కుమారులు సంతానం. రవి- ఆర్తి గతేడాది విడిపోయారు. విడాకులకు సైతం దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు కొన్నేళ్లుగా జయం రవిగా స్థిరపడిపోయిన ఆయన.. తనను రవి అని మాత్రమే పిలవాలని కోరాడు.చదవండి: నన్ను పెళ్లి చేసుకుంటావా? స్నేహితురాలికి ప్రపోజ్ చేసిన దర్శకుడు -
లిఫ్ట్ ఇచ్చి... ఉంగరాలు లాక్కొన్నాడు
చైతన్యపురి: బైక్‌పై లిఫ్టు ఇచ్చిన గుర్తుతెలియని దుండగుడు ఉంగరాలు లాక్కొని పరారయిన సంఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. బాదితులు తెలిపిన వివరాల ప్రకారం బాలాపూర్‌కు చెందిన రవిమోహన్ (58) శుక్రవారం రాత్రి కొత్తపేట కమర్షియల్ ట్యాక్స్ కాలనీలోని తోడల్లుడు ఇంటి వెళుతున్నాడు. ఆటో కోసం కొత్తపేట చౌరస్తాలో నిలబడి ఉండగా బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి లిఫ్ట్ ఇస్తా రమ్మని రవిమోహన్‌ను వాహనంపై ఎక్కించుకున్నాడు. నాగోల్ వెళ్లేదరిలో బైక్ ఆపి తన పర్సు పోయిందని అన్నాడు. దీంతో ర విమోహన్తో వాదనకు దిగి బలవంతంగా చేతికి ఉన్న పన్నెండు గ్రాముల రెండు బంగారు ఉంగరాలను లాక్కొని బైక్‌పై పరారయ్యాడు. బాదితుడు పోలీసులకు పిర్యాదు చేశాడు.