breaking news
ranadip huda
-
ఆస్కార్ జాబితాలో ‘ఎంఎస్ ధోని’
ఐష్ నటించిన సరబ్జిత్ సినిమా కూడా.. లాస్ ఏంజెలిస్: భారత వన్డే జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘ఎంఎస్ ధోని ది అన్ టోల్డ్ స్టోరీ’ చలనచిత్రం ప్రఖ్యాత ఆస్కార్ అవార్డు అర్హత చిత్రాల సుదీర్ఘ జాబితాలో చోటు దక్కించుకుంది. ఆ చిత్రంతోపాటు ఐశ్వర్యారాయ్ బచ్చన్ రణదీప్ హుడా ప్రధాన పాత్రల్లో నటించిన సరబ్జిత్ సినిమా కూడా ఆస్కార్ అర్హత దక్కించుకున్న 336 ఫీచర్ సినిమాల జాబితాలో స్థానం దక్కించుకుంది. ఈ రెండూ జీవిత చరిత్రల ఆధారంగా తెరకెక్కిన చిత్రాలే కావడం గమనార్హం. ఆస్కార్ అర్హత సాధించిన జాబితాలోని ఫీచర్ సినిమాల వివరాలను బుధవారం ‘ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ విడుదల చేసిందని ఎంటర్టైన్ మెంట్ వీక్లీ పేర్కొంది. 2016 ఏడాదికిగానూ అకాడమీ అవార్డుల జాబితాలో ఉన్న ఈ సినిమాల్లో.. లాస్ ఏంజెలిస్‌లో జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు కనీసం వారంపాటు ప్రదర్శితమైన వాటినే పరిగణనలోకి తీసుకుంటారు. 35 ఎంఎం లేదా 70 ఎంఎం సినిమా లేదా అర్హత కలిగిన డిజిటల్ ఫార్మాట్లో కనీసం 40 నిమిషాల నిడివికి మించ కుండా ఉండాలి. ఆస్కార్ అర్హ త జాబితాలో క్వీన్ ఆఫ్ కత్వే, లాలా లాండ్, మూన్ లైట్, మాంచెస్టర్ బై ది సీ, సైలెన్స్, అరైవల్, హాక్షా రిడ్జ్, డెడ్‌పూల్, సూసైడ్ స్క్వాడ్, కెప్టెన్అమెరికా, సివిల్ వార్, ఎక్స్‌మెన్ లాంటి చిత్రాలు ఉన్నాయి. -
మెల్బోర్న్లో షిర్డీ సాయి ఆలయం
నిర్మించేందుకు సిద్ధమైన ఎన్ఆర్ఐలు సాక్షి, హైదరాబాద్: ఆస్ట్రేలియా మెల్బోర్న్ నగరంలో షిర్డీ సాయిబాబా ఆలయాన్ని భారీస్థాయిలో నిర్మించేందుకు తెలంగాణ ప్రవాసులు, ప్రవాసాంధ్రులు నడుం బిగించారు. ఈ నిర్మాణ కార్యక్రమానికి ఓంసాయి సంస్థాన్ ఆధ్వర్యంలో మెల్బోర్న్లో మంగళవారం ఫండ్ రైజింగ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. బాలీవుడ్ స్టార్ రణదీప్ హుడా ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లిబరల్ పార్టీ ట్రెజరర్‌గా పని చేస్తున్న రాంపాల్రెడ్డి ముత్యాల, ఓం సాయి ట్రస్ట్ ప్రెసిడెంట్ అనిల్ కొలనుకొండతోపాటు తెలంగాణ కమ్యూనిటీ గ్లోబల్ అంబాసిడర్ పట్కూరి బసంత్‌రెడ్డి, ప్రముఖ కవి అంద్శైఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్నా రుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.