breaking news
Ram Shankar naik
-
మీరు నిజమైన రైతులేనా!
సాక్షి, అమరావతి: రొయ్యల మేత ధరల పెంపును నిరసిస్తూ సోమవారం విజయవాడ సమీపంలోని పోరంకిలో గల మత్స్యశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా చేసేందుకు వచ్చిన రైతులను ఉద్దేశించి మత్స్యశాఖ కమిషనర్ రామ్‌శంకర్‌నాయక్ చేసిన అనుచిత వ్యాఖ్యలు రైతుల ఆగ్రహానికి కారణమయ్యాయి. అప్సడా చట్టానికి వ్యతిరేకంగా ఏకపక్షంగా పెంచిన రొయ్యల మేత ధరలను తక్షణమే ఉపసంహరింపజేయాలని కోరుతూ ఏపీ ఆక్వా రైతు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో రైతులు కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి, మేత కంపెనీలకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. అనంతరం మత్స్య శాఖ కమిషనర్ రామ్శంకర్నాయక్కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఫీడ్ తయారీలో వినియోగించే ముడి పదార్థాల ధరలు పెరిగాయని, అందువల్లే ఫీడ్ ధరలు పెంచాల్సి వస్తోందని చెప్పగా.. రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫీడ్ కంపెనీలు ముడి పదార్థాలను ప్రతినెలా కొనుగోలు చేయవని, అలాంటప్పుడు 45 రోజులకు ఒకసారి ఫీడ్ ధరలను సమీక్షిస్తూ ధరలు పెంచడంలో హేతుబద్ధత ఏమిటని ప్రశ్నించారు. ఈ సందర్భంలో రైతుల ప్రశ్నలకు బదులివ్వలేక ‘మీరు నిజమైన రైతులేనా?’ అని కమిషనర్ చేసిన వ్యాఖ్యలపై రైతులు తీవ్రంగా మండిపడ్డారు. రైతులను ఇలా అవమానపర్చడం దారుణమంటూ కమిషనర్ ఎదుటæ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఫీడ్ ధరలు తగ్గించాల్సిందే అనంతరం వారంతా మీడియాతో మాట్లాడుతూ.. ఫీడ్ ధరలు తగ్గించాల్సిందేనని కోరారు. ఫీడ్ ధరల పెంపును నియంత్రించడంతో పాటు కంపెనీల ధరల విధానాన్ని పారదర్శకంగా పర్యవేక్షించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. ఫీడ్ ధరలు, రొయ్యల ధరలను పర్యవేక్షించే కమిటీల్లో రైతుల పేరుతో ఫీడ్ కంపెనీల డీలర్లు, రొయ్యల ఎగుమతిదారుల బ్రోకర్లు ఎలా ఉంటారని రైతులు ప్రశ్నించారు. ఇలాంటి ప్రతినిధులు కమిటీల్లో ఉండటం వల్ల నిర్ణయాలు రైతుల ప్రయోజనాలకు కాకుండా ఫీడ్ కంపెనీలు, ఎగుమతిదారులకు అనుకూలంగా ఉండే అవకాశం ఉందన్నారు. రైతులే నిర్ణయ ప్రక్రియలో భాగస్వాములు కావాలని, ఫీడ్ ధరలు–రొయ్యల ధరలపై పారదర్శకమైన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో సమాఖ్య కన్వీనర్ దుగ్గినేని గోపీనాథ్, వివిధ జిల్లాల సమాఖ్య ప్రతినిధులు శ్రీనాథ్‌రెడ్డి, మేకా వెంకటేశ్వరరావు, పి.వెంకురెడ్డి, పమిడి సుబ్బానాయుడు, బత్తుల రమేష్‌రెడ్డి, ఎస్.అంజిబాబు, బి.భాస్కర్‌రెడ్డి, సతీష్ రాజు పాల్గొన్నారు. -
ఇదీ ఇంటర్ పరీక్షల టైమ్ టేబుల్
ప్రతిపాదించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ సర్కార్‌కు తెలిపినట్లు వెల్లడి సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాల్లోని ఇంటర్మీడియెట్ విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పరీక్షలు నిర్వహించేందుకు రూపొందించిన టైమ్ టేబుల్‌తో కూడిన ప్రతిపాదనను తెలంగాణ సర్కారుకు పంపినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి రామ్ శంకర్ నాయక్ గురువారం ‘సాక్షి’కి తెలిపారు. ప్రశ్న పత్రాలు ఉమ్మడిగానే ముద్రించేందుకు అవకాశం కల్పించాలని కోరినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఆమోదిస్తే ఈ కింది తేదీల ప్రకారం ఇంటర్ పరీక్షలు ఖరారు అవుతాయి. ఏకపక్షంగా షెడ్యూల్! ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణ విషయంలో ఏపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు దృష్టికి విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తీసుకెళ్లారు. గురువారం జగదీశ్‌రెడ్డి సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలియజేయకముందే.. గురువారం ఏపీ విద్యా మంత్రి ఇంటర్ పరీక్షల షెడ్యూలును ఏకపక్షంగా ప్రకటించారని సీఎంకు మంత్రి వివరించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో అదే షెడ్యూల్ ప్రకారం పరీక్షలను నిర్వహించాలా? వద్దా? తేదీల్లో మార్పులు చేయాలా? అనే అంశాలు వారి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. దీంతోపాటు ఇంటర్మీడియెట్ పరీక్షల ప్రశ్నపత్రాలు వేర్వేరుగానే ఉండాలన్న ప్రధాన అంశంపైనా చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఈ భేటీ నేపథ్యంలో ఇంటర్ పరీక్షల వ్యవహారం, నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై శుక్రవారం కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తేదీలు సబ్జెక్టు మార్చి 11 ఇంటర్ ఫస్టియర్, ద్వితీయ భాష (తెలుగు తదితర) మార్చి 12 సెకండ్ ఇయర్, ద్వితీయ భాష (తెలుగు తదితర) మార్చి 13 ఇంటర్-1 ఇంగ్లీష్ మార్చి 14 ఇంటర్-2 ఇంగ్లీష్ మార్చి 16 గణితం-1ఎ, బోటనీ-1, సివిక్స్-1 మార్చి 17 గణితం-2ఎ, బోటనీ-2, సివిక్స్-2 మార్చి 18 జువాలజీ-1, హిస్టరీ-1 మార్చి 19 గణితం-2బి, జువాలజీ-2, హిస్టరీ-2 మార్చి 20 ఫిజిక్స్-1, ఎకనమిక్స్-1 మార్చి 23 ఫిజిక్స్-2, ఎకనమిక్స్-2 మార్చి 24 కెమిస్ట్రీ-1, కామర్స్-1, సోషియాలజీ-1 మార్చి 25 కెమిస్ట్రీ-2, కామర్స్-2, సోషియాలజీ-2 మార్చి 26 జువాలజీ-1, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-1, హోమ్ సైన్స్-1 మార్చి 27 జువాలజీ-2, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-2, హోమ్ సైన్స్-2 మార్చి 30 జాగ్రఫీ-1, మోడ్రన్ లాంగ్వేజ్ పేపరు-1 మార్చి 31 జాగ్రఫీ-2, మోడ్రన్ లాంగ్వేజ్ పేపరు-2 -
తత్కాల్లో ఇంటర్ పరీక్ష ఫీజు కట్టే అవకాశం
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తత్కాల్ కింద పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి రామశంకర్‌నాయక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28 నుంచి డిసెంబర్ 10 వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. హాజరు మినహాయింపు కోరుకునే ఆర్ట్స్ విద్యార్థులు దానికి సంబంధించిన ఫీజు కూడా కట్టొచ్చని సూచించారు. తత్కాల్ ఫీజు రూ.500, హాజరు మినహాయింపు ఫీజు రూ.500, పరీక్ష ఫీజు రూ.290, ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫీజు రూ.580గా నిర్ణయించారు.


