తత్కాల్‌లో ఇంటర్ పరీక్ష ఫీజు కట్టే అవకాశం | Inter exam fee can be paid under Tatkal : Inter board | Sakshi
Sakshi News home page

తత్కాల్‌లో ఇంటర్ పరీక్ష ఫీజు కట్టే అవకాశం

Nov 22 2013 5:33 AM | Updated on Sep 2 2017 12:52 AM

ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తత్కాల్ కింద పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి రామశంకర్‌నాయక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తత్కాల్ కింద పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి రామశంకర్‌నాయక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28 నుంచి డిసెంబర్ 10 వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. హాజరు మినహాయింపు కోరుకునే ఆర్ట్స్ విద్యార్థులు దానికి సంబంధించిన ఫీజు కూడా కట్టొచ్చని సూచించారు. తత్కాల్ ఫీజు రూ.500, హాజరు మినహాయింపు ఫీజు రూ.500, పరీక్ష ఫీజు రూ.290, ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫీజు రూ.580గా నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement