4 ప్రాజెక్ట్‌లు.. 40 ఫ్లాట్లు!
• ఫిబ్రవరిలో పలు ప్రాజెక్ట్‌లు ప్రారంభం
• రామ్ డెవలపర్స్ ఎండీ రాము
సాక్షి, హైదరాబాద్: చిన్న చిన్న ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో శరవేగంగా కదులుతున్న రామ్ డెవలపర్స్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనూ నగరంలో పలు ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టనుంది. పద్మారావ్ నగర్, బేగంపేట, ఎల్బీనగర్, నాగోల్‌లో ఈ ప్రాజెక్ట్‌లు రానున్నాయి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లు, కొత్త ప్రాజెక్ట్‌ల వివరాలను రామ్ డెవలపర్స్ ఎండీ రాము ‘సాక్షి రియల్టీ’తో పంచుకున్నారు.
⇔ పంజగుట్టలో శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్తో కలసి వెయ్యి గజాల్లో హిదర్ క్రెస్ట్ ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఐదంతస్తుల్లో 15 ఫ్లాట్లొస్తాయి. 1,200-1,975 చ.అ. మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి. ధర చ.అ.కు రూ.7,500. వచ్చే డిసెంబర్ నాటికి ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తాం.
⇔ చిక్కడపల్లిలో 500 గజాల్లో మై ఫెయిర్ అవెన్యూస్‌ను నిర్మిస్తున్నాం. ఐదంతస్తుల్లో మొత్తం 10 ఫ్లాట్లొస్తున్నాయి. 1,195- 1,470 చ.అ.ల్లో ఫ్లాట్లుంటాయి.ధర చ.అ.కు రూ.5,000. మూడు నెలల్లో పూర్తి చేస్తాం.
⇔ బేగంపేటలో 725 గజాల్లో రివర్స్టోన్ హ్యాబిటేట్‌ను నిర్మిస్తున్నాం. నాలుగంతస్తుల్లో 12 ఫ్లాట్లుంటాయి. 1,940-1,980 చ.అ. ఫ్లాట్లుంటాయి. ధర చ.అ.కు రూ.5,500. డిసెంబర్ 2017కు ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తాం.
⇔ వచ్చే ఏడాది జనవరిలో ఎల్బీనగర్లో 850 గజాల్లో రామ్ అవెన్స్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నాం. ఐదంతస్తుల్లో 15 ఫ్లాట్లుంటాయి. 1,180-1,800 చ.అ.ల్లో ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి. ధర చ.అ.కు రూ.3,500.
⇔ నాగోల్‌లో 500 గజాల్లో మరో ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నాం. ఇందులో నాలుగంతస్తుల్లో 8 ఫ్లాట్లుంటాయి. 1,175-1,500 చ.అ. మధ్య ఫ్లాట్లుంటాయి. ధర చ.అ.కు రూ.3,200
⇔ పద్మారావ్‌నగర్‌లో 475 గజాల్లో రామ్ రెసిడెన్సీ రానుంది. నాలుగంతస్తుల్లో 8 ఫ్లాట్లుంటాయి. ధర చ.అ.కు రూ.6,000.
⇔ బేగంపేటలో 700 గజాల్లో రామ్ ఎన్క్లేవ్ ప్రాజెక్ట్‌ను చేయనున్నాం. ఇందులో నాలుగంతస్తుల్లో 8 ఫ్లాట్లుంటాయి. ఏడాదిన్నరలో ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తాం.