breaking news
Rajiv meharsi
-
కొత్త కాగ్‌గా రాజీవ్ మహర్షి ప్రమాణం
న్యూఢిల్లీ: నూతన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌గా కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి రాజీవ్ మహర్షి సోమ వారం బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రపతి భవన్లో సోమవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇతర ప్రముఖులు హాజరయ్యారు. 2020, ఆగస్టు 7 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. మహర్షి 1978 బ్యాచ్, రాజస్తాన్ కేడర్‌కి చెందిన ఐఏఎస్ అధికారి. గత నెలలో హోం శాఖ కార్యదర్శిగా తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎంఏ, బీఏ డిగ్రీలు అందుకున్నారు. గ్లాస్గోలోని యూనివర్సిటీ ఆఫ్ స్ట్రాత్‌క్లైడ్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. కేంద్రం, రాజస్తాన్ ప్రభుత్వంలో వివిధ పదవుల్లో తన విధులను నిర్వర్తించారు. -
చరిత్రపై అవగాహనతోనే మంచి పాలన: రాజీవ్ మెహర్షి
సాక్షి,న్యూఢిల్లీ: చరిత్రపై పూర్తి అవగాహన లేనిదే ఎవరూ మంచి పాలకులు కాలేరని, సమర్థంగా పాలన కొనసాగించలేరని కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ మెహర్షి అభిప్రాయపడ్డారు. ఐఆర్ఎస్ అధికారిణి పూనమ్ దలాల్ దహియా రచించిన ‘యాన్సియెంట్ అండ్ మెడీవియల్ ఇండియా’ పుస్తకాన్ని ఆయన శనివారం ఆవిష్కరించారు. సివిల్ సర్వీసులు, ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీసు పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధుల కోసం ప్రత్యేకంగా ఈ పుస్తకాన్ని రచించారు. సివిల్స్ ఆశావహులు చరిత్రపై పూర్తి అవగాహన పెంచుకోవాలని మెహర్షి చెప్పారు. అలాంటి వారికి ఈ పుస్తకం సరైన మార్గదర్శకత్వాన్ని అందిస్తుందని అన్నారు. సివిల్స్ పరీక్షలకు ఈ పుస్తకం ఒక కీలక సాధనంగా పనిచేస్తుందని రచయిత దహియా తెలిపారు.