చరిత్రపై పూర్తి అవగాహన లేనిదే ఎవరూ మంచి పాలకులు కాలేరని, సమర్థంగా పాలన కొనసాగించలేరని కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ మెహర్షి అభిప్రాయపడ్డారు.
సాక్షి,న్యూఢిల్లీ: చరిత్రపై పూర్తి అవగాహన లేనిదే ఎవరూ మంచి పాలకులు కాలేరని, సమర్థంగా పాలన కొనసాగించలేరని కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ మెహర్షి అభిప్రాయపడ్డారు. ఐఆర్‌ఎస్ అధికారిణి పూనమ్ దలాల్ దహియా రచించిన ‘యాన్సియెంట్ అండ్ మెడీవియల్ ఇండియా’ పుస్తకాన్ని ఆయన శనివారం ఆవిష్కరించారు.
సివిల్ సర్వీసులు, ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీసు పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధుల కోసం ప్రత్యేకంగా ఈ పుస్తకాన్ని రచించారు. సివిల్స్ ఆశావహులు చరిత్రపై పూర్తి అవగాహన పెంచుకోవాలని మెహర్షి చెప్పారు. అలాంటి వారికి ఈ పుస్తకం సరైన మార్గదర్శకత్వాన్ని అందిస్తుందని అన్నారు. సివిల్స్ పరీక్షలకు ఈ పుస్తకం ఒక కీలక సాధనంగా పనిచేస్తుందని రచయిత దహియా తెలిపారు.