breaking news
rajarajeshwari temple
-
వేములవాడలో శ్రావణ శోభ..
-
రాజన్న సన్నిధిలో చిన్నారి కిడ్నాప్
వేములవాడ: కరీంనగర్ జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వ స్వామి సన్నిధిలో చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. ఆలయ ఆవరణలో నిద్రిస్తున్న నాలుగు నెలల బాలుని గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం తెల్లవారుజామున అపహరించుకుపోయారు. నల్గొండ జిల్లా రాజ్యంపేట మండలం బొందుగుల గ్రామానికి చెందిన కొమ్ము కల్పన(23) తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలతో కలిసి రాజన్న దర్శనార్థం సోమవారం సాయంత్రం వచ్చారు. స్వామి దర్శనార్థం ఆలయం ఆవరణలో నిద్రిస్తుండగా నాలుగు నెలల బాలుని ఎవరో కిడ్నాప్ చేశారు. ఈ విషయమై కల్పన వేములవాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొమ్ము యేసేబు ప్రసాద్‌తో 2012లో తన పెళ్లి అయిందని, కుటుంబ గొవడవల కారణంగా తన ఇద్దరు పిల్లలతో పుట్టింటిలో ఉంటున్నానని కల్పన ఫిర్యాదులో పేర్కొంది. తన తల్లిదండ్రులు మల్లయ్య, మచ్చుపెల్లిలక్ష్మితో పాటు తన ఇద్దరు పిల్లలను తీసుకుని రాజన్నస్వామి మొక్కు తీర్చుకునేందుకు వచ్చానని చెప్పింది. ఈ నేపధ్యంలో బాబును ఎవరో కిడ్నాప్ చేశారని పేర్కొంది. పోలీసులు సీసీ కెమెరా ఫుటేజిని పరిశీలించారు, కేసు నమోదు చేసుకుని దర్యార్తు చేస్తున్నారు. ఆమె భర్తే బాలున్ని కిడ్నాప్ చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. -
‘వేములవాడ’ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి తరహాలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సోమవారం వేములవాడ దేవస్థాన ప్రాంతీయ అభివృద్ధి కమిటీ సీఈవోగా నియమితుడైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పురుషోత్తంరెడ్డి, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ సీఎంను మర్యాద పూర్వకంగా కలిశారు. వేములవాడ దేవస్థానం అభివృద్ధి కోసం రూ.100 కోట్లు కేటాయించినందుకు ఈ సందర్భంగా కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, త్వరలో శృంగేరీ పీఠాధిపతి ఆశీస్సులతో దేవస్థాన అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నారు.