breaking news
R Sundarrajan
-
ఛాన్స్ ఇవ్వమని అడిగితే ఆయన ఎంతో అవమానించాడు: దర్శకుడు
నట్టి, శిల్ప మంజునాథ్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం వెబ్. మొటై రాజేంద్రన్ ముఖ్య పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని వేలన్ ప్రొడక్షన్స్ పతాకంపై వీఎం.మునివేలన్ నిర్మిస్తున్నారు. హరూన్ దర్శకత్వం వహిస్తున్నారు. వెబ్.. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా బుధవారం ఉదయం స్థానిక ప్రసాద్ ల్యాబ్‌లో ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇందులో నటుడు, నిర్మాత కె.రాజన్, దర్శకుడు ఆర్వీ.ఉదయకుమార్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్వీ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ.. పలు హిందీ, తమిళ చిత్రాల కెమెరామెన్‌గా పనిచేసిన నట్టి ఆ తర్వాత నటుడిగా అవతారం ఎత్తారన్నారు. అందుకే మంచి కంటెంట్ కలిగిన కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటిస్తున్నారన్నారు. ఈ వెబ్ చిత్రం అలాంటి విభిన్న కంటెంట్‌తో కూడిన కథా చిత్రమని దర్శకుడు ఈ వేదికపై చెప్పారన్నారు. ఆయన ఎంతో అనుభవం కలిగిన దర్శకుడిగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ఆడియో, ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుందన్నారు. ఇప్పుడు దర్శకుడిగా ఎలాంటి అనుభవం లేకపోయినా చిత్రాలు చేయవచ్చు అని, తమ కాలంలో తమను ఒక గ్రూపు సినిమాల్లోకి రాకుండా అడ్డుకున్నారని చెప్పారు. అలాంటి వారిలో ఆర్ సుందర్ రాజన్ ఒకరని.. తాను కథలు రాసుకొని ఆయన వద్దకు వెళ్లి అవకాశం కల్పించాల్సిందిగా కోరానన్నారు. అందుకు ఆయన మేమంతా కథలను రాసుకుని సినిమాలు చేసే టైప్ కాదని.. షూటింగ్ స్పాట్లోనే కథలు రాసి తెరకెక్కిస్తామని పరిహాసం చేశారన్నారు. అలా ఎన్నో అవమానాలు భరించి ఈ స్థాయికి వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ వెబ్ చిత్రం మంచి విజయాన్ని సాధించి నిర్మాతకు లాభాలు తెచ్చి పెట్టాలన్నారు. అలా కాకపోయినా పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తే ఆయన మళ్లీ ఇంకో సినిమా చేస్తారని అన్నారు. చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన స్పై -
నిర్మాతకు పొగరు ఉండాలి
తమిళసినిమా: నిర్మాత అనే వాడికి పొగరు ఉండాలని సీనియర్ దర్శక నటుడు ఆర్.సుందరరాజన్ అన్నారు. వి.హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేష్ కామాక్షి నిర్మిస్తున్న చిత్రం కంగారు. వివాదస్పద చిత్రాల దర్శకుడిగా పేరొందిన సామి దర్శకత్వం వహిస్తూ, నవ నటుడు అర్జునా, ప్రియాంక, కోమల్ శర్మ నాయికా నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర ఆడియో ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం సాయంత్రం నగరంలోని ఆర్కేవీ స్టూడియోలో జరిగింది. చిత్ర దర్శకుడు సామి మాట్లాడుతూ నాలుగేళ్ల తరువాత తాను దర్శకత్వం వహిస్తున్న చిత్రం కంగారు అని తెలిపారు. తన గత చిత్రాలు వేరే విధంగా ఉండడానికి తాను మాత్రమే కారణం కాదన్నారు. ఒక చిత్రం ఎలా ఉండాలన్నది ఒక వ్యక్తి నిర్ణయించలేదన్నారు. దర్శకుడు, నిర్మాత, కథానాయకుడు ఇలా అందరూ కలసి నిర్ణయం తీసుకుంటారన్నారు. అయితే చిత్రం విజయం సాధిస్తే అందరూ భాగం పంచుకుంటారన్నారు. అపజయాలకు దర్శకుడిని మాత్రమే బాధ్యుడిని చేస్తారని, ఇదెక్కడి న్యాయం అని ఆవేదన వ్యక్తం చేశారు. కంగారు చిత్రం విషయానికొస్తే తన శిష్యుడు సాయి ప్రసాద్ చెప్పిన కథతో తెరకెక్కించిన చిత్రం అని చెప్పారు. తమిళ సినిమాలు గుర్తుండిపోయే చిత్రంగా ఉంటుందన్నారు. వైరముత్తు రాసిన ఐదు పాటలు ఆణిముత్యాల్లా ఉంటాయని ఈ చిత్రాన్ని కలైపులి ఎస్.థాను విడుదల చేయనున్నారని వెల్లడించారు. ఏమిటి దుస్థితి : చిత్ర నిర్మాత సురేష్ కామాక్షి మాట్లాడుతూ ఈ కంగారు చిత్రాన్ని చాలాకాలం మోసుకుంటూ వస్తున్నానన్నారు. ఇది తనకు చాలా నేర్పిందన్నారు. ఇతర వృత్తుల్లో యాజమాన్యం కార్మికులను కట్టడి చేస్తుంటే సినిమాలో మాత్రం కార్మికులు నిర్మాతలను కట్టడి చేస్తున్న దుస్థితి నెలకొందన్నారు. ఆయన వ్యాఖ్యలకు స్పందించిన దర్శక, నటుడు ఆర్.సుందరరాజన్ మాట్లాడుతూ, ఒకసారి సంగీత దర్శకుడు ఇళయరాజా ఏడు పాటలు కంపోజ్ చేసి అవన్నీ ఒకే చిత్రానికి అందిస్తానన్నారు. కొందరు నిర్మాతలు నాలుగైదు పాటలు చాలంటే, అలాగైతే తన పాటలు ఇవ్వనని చెప్పారు. ఒక సంగీత దర్శకుడికే అంత పొగరు ఉంటే రచయితగా తనకెంత పొగరుండాలని ఆయన పాటలు విందాం అనుకుని విన్నానన్నారు. ఆ తరువాత ఆ పాటలన్నీ తానే తీసుకుని వైదేహి కాత్తిరుందాల్ చిత్రంకు వాడుకున్నానన్నారు. ప్రతిభ పొగరంటే అలా ఉంటుందన్నారు. అలాగే నిర్మాతలకు పొగరు, ఐక్యతా భావం ఉండాలన్నారు. లేకుంటే ఎవరూ విలువనివ్వరని చెప్పారు.