breaking news
Pushkarams
-
కృష్ణా పుష్కరాలకు ట్రాఫిక్ మళ్లింపు
ఏలూరు (మెట్రో): కృష్ణా పుష్కరాల నేపథ్యంలో ఈనెల 12వ తేదీ నుంచి ట్రాఫిక్ మళ్లింపు చర్యలు తీసుకుంటున్నట్టు ఏలూరు రేంజ్ డీఐజీ పీవీ రామకృష్ణ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో డీఐజీ మాట్లాడారు. చెన్నై నుంచి విశాఖ వెళ్లే వాహనాలు, విశాఖ నుంచి చెన్నై వెళ్లే వాహనాల దారి మళ్లించేందుకు మార్గాలను అన్వేషిస్తున్నామన్నారు. త్వరలోనే ట్రైల్ రన్ వేసి మార్గాలను ప్రకటిస్తామని చెప్పారు. ట్రాఫిక్ మళ్లింపు విషయంలో ప్రజలు సహకరించాలని కోరారు. పుష్కర యాత్రికుల వాహనాలను నిర్దేశించిన పార్కింగ్ స్థలాల వరకు మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. ఘాట్ ప్రాంతంలో ప్రత్యేకంగా లోపలికి, బయటకు వేర్వేరు మార్గాలకు ఏర్పాట్లుచేశామన్నారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. -
రాజమండ్రిలో 'శ్రీవారి నమూనా' ఆలయం
రాజమండ్రి: గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రిలో తిరుమలలోని శ్రీవేంకటేశ్వరుని నమూనా దేవాలయం ఏర్పాటు చేస్తున్నట్లు టీటీడీ కార్యనిర్వహాణాధికారి డి.సాంబశివరావు వెల్లడించారు. అందుకోసం రూ. 2 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. శనివారం రాజమండ్రి వచ్చిన సాంబశివరావు విలేకర్లతో మాట్లాడారు. ఈ నమూనా దేవాలయానికి రోజూ 7 నుంచి 10 వేల మంది దర్శించుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నమూనా దేవాలయం కోసం 500 మంది టీటీడీ సిబ్బంది విధులు నిర్వర్తిస్తారని పేర్కొన్నారు. తిరుమలలో జరిగే విధంగానే స్వామివారికి పూజలు నిర్వహిస్తామని సాంబశివరావు తెలిపారు.