breaking news
puramdeswari
-
అవకాశవాదులకు బైబై.. సొంత కార్యకర్తలకు జైజై
భారతీయ జనతా పార్టీ తెలుగువ రాష్ట్రాల శాఖలకు నూతన అధ్యక్షులను నియమించే విషయంలో పలు అంశాలను ప్రాతిపదికగా తీసుకుని స్వచ్ఛమైన సొంత పార్టీ కార్యకర్తలకు మాత్రమే పట్టంగట్టింది. ఈ విషయంలో పైరవీలు రికమండేషన్లకు తావు లేకుండా నికార్సైన బిజెపి కార్యకర్తలకు పార్టీ పగ్గాలు అప్పగించింది. తెలంగాణకు ఎన్ రామచంద్రరావుని అధ్యక్షునిగా నియమించగా ఆంధ్ర ప్రదేశ్కు పివిఎన్ మాధవ్ ను సారధిగా నియమించారు. ఈ నియామకం విషయంలో పార్టీ ఢిల్లీ పెద్దలు పలు అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. ప్రస్తుతం బిజెపి అధ్యక్షురాలుగా ఉన్న పురందేశ్వరి అవకాశవాదాన్ని కేంద్రంలోని బిజెపి పెద్దలు క్షమించే ఉద్దేశంలో లేకపోబట్టి ఆవిన్ను పక్కకు తప్పించారు. వాస్తవానికి ఆవిడ టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు కుమార్తె అయినప్పటికీ కాంగ్రెస్ తరపున రెండుసార్లు ఎంపీగా కేంద్రంలో మంత్రిగా పనిచేశారు 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ లో ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంతో ఆమె గత్యంతరం లేని పరిస్థితుల్లో బిజెపిలో చేరారు. ఇక్కడ ఆమె బిజెపిలో చేరినప్పటికీ ఆమె మనసు ఆలోచనలు అన్నీ కూడా ఆమె సామాజిక వర్గం వ్యాపార వర్గంతోబాటు ముఖ్యంగా తెలుగుదేశం అనుకూలంగానే ఉంటూ వచ్చారు తప్ప బీజేపీకి ఆమె ఏనాడు ఉపయోగపడలేదు. బిజెపి పేరు చెప్పుకొని ఆమె తన సొంత పరపతిని పెంచుకొని రాజకీయంగా ఎదిగారు తప్ప పార్టీని ఆమె ఎదగనివ్వలేదు. ఏదైతేనేం మొత్తానికి మొన్నటి ఎన్నికల్లో ఆమె రాజమండ్రి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. మొదటినుంచి అవకాశవాద రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న పురందేశ్వరిని తప్పించాలని హార్డ్ కోర్ బిజెపి కార్యకర్తలు కోరుతూ వస్తున్నారు. పురందేశ్వరి ఎంత సేపు తన కుటుంబ పార్టీ ఆయన చంద్రబాబుకు తెలుగుదేశానికి ప్రయోజనం కలిగించే నిర్ణయాలే తీసుకున్నారు తప్ప బిజెపి బలోపేతానికి వీసమెత్తు కృషి కూడా చేయలేదు. ఆమె వైఖరిని మొదటి నుంచి గమనిస్తూ వస్తున్న ఢిల్లీ పెద్దలు ఇప్పుడు ఏకంగా ఆమెను పక్కకు తప్పించి జన్మతః బిజెపి కార్యకర్త ఆయన మాధవ్ కు ఆ బాధ్యతలు అప్పగించారు.విశాఖనగరానికి చెందిన పోకల వంశీ నాగేంద్ర మాధవ్ ఆయన 2017లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. ఆ టర్మ్ పదవి ముగిసాక 2023లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి జరిగిన ఉత్తరాంధ్ర పట్టభధ్రుల నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయాడు. వాస్తవానికి మాధవ తండ్రి పీవీ చలపతిరావు సీనియర్ బిజెపి నాయకుడు. అద్వానీ వాజ్పేయి వంటి దిగ్గజాలతో కలిసి నడిచిన వాడు. చలపతిరావు అంటే మోడీ ఇతర బిజెపి పెద్ద నాయకులకు కూడా అపారమైన గౌరవం. నికార్సైన చలపతిరావు కుటుంబానికి న్యాయం చేయాలి అనే భావనతో ఉన్న ఢిల్లీ పెద్దలు ఆయన కుమారుడు మాధవ్ కు ఇప్పుడు బిజెపి రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించింది. ఈ నియామకం తెలుగుదేశంతోపాటు అవకాశవాద రాజకీయాలు నేరిపే పురందేశ్వరికి షాకింగ్ అని చెప్పాలి.పార్టీ ఆలోచనలు పార్టీ గీత దాటి అడుగు వేయని నిబద్ధత కలిగిన మాధవ్ ఏ విషయంలోనూ తెలుగుదేశానికి తలవంచకుండా పార్టీ బలోపేతానికి శక్తివంతం లేకుండా కృషి చేస్తారు అని బిజెపి కార్యకర్తలు నమ్ముతున్నారు. అన్నిటికి మించి చంద్రబాబు బంధువు అయిన పురందేశ్వరి కబ్జా నుంచి బిజెపిని విడిపించడం అతి పెద్ద అడుగు అని పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు. బిజెపిని చంద్రబాబు కాళ్ళ వద్ద తాకట్టు పెట్టి తన వ్యక్తిగత ప్రయోజనాలు పరపతి పెంచుకున్న పురందేశ్వరికి ఈ నిర్ణయం చేదుగానే ఉంటుంది కానీ నిజమైన బిజెపి కార్యకర్తలకు మాధవ నియామకం తీపి కబురు అని చెప్పాలి.-సిమ్మాదిరప్పన్న -
‘చంద్రబాబు కోసమే పురంధేశ్వరి పనిచేస్తోంది’
అమరావతి: చంద్రబాబు కోసమే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పని చేస్తోందని విమర్శించారు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. టీడీపీ ప్రభుత్వంలో ఉచిత ఇసుక పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు సజ్జల. తమ వారికి లబ్ధి చేకూరేలా రెండుసార్లు ఇసుక పాలసీని మార్చారని, టీడీపీ నాయకులు ఇసుక ద్వారా అక్రమాలకు పాల్పడ్డారని సజ్జల ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన రూ. వేల కోట్లు పక్కదారి పట్టాయన్నారు.పురంధేశ్వరి ఫిర్యాదు చేస్తే చంద్రబాబుపై కేసు ఎందుకు పెడతారని ఎద్దేవా చేసిన సజ్జల.. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టే సీఐడీ కేసు నమోదు చేసిందని స్పష్టం చేశారు. కాంగ్రెస్కు షర్మిల మద్దతివ్వడం ఆమె పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయం కావొచ్చని సజ్జల అభిప్రాయపడ్డారు. పక్కరాష్ట్ర విషయాల గురించి సీఎం జగన్ పెద్దగా పట్టించుకోరని తెలిపిన సజ్జల.. వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ ఇబ్బంది పెట్టిందన్న విషయం అందరికీ తెలుసన్నారు. సోనియా దగ్గరికి వెళ్లినప్పుడు జగన్తో పాటు షర్మిలమ్మ కూడా వచ్చిందని, అయినా విధానపరమైన నిర్ణయంలో భాగంగా కాంగ్రెస్ మద్దతిచ్చి ఉండొచ్చన్నారు. -
పోలవరం: కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారు
సాక్షి, విజయవాడ : ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు ఒక వరమని, పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అడుపడుతోందని కావాలనే కొందరు దుష్ర్పచారం చేస్తున్నారని ఏపీ బీజేపీ నేతలు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టును తాము సందర్శించామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఆ పార్టీ నాయకురాలు పురందేశ్వరి తెలిపారు. పాతరేట్లకే ప్రాజెక్టు పనులు చేయించింది కేంద్రమంత్రి గడ్కరీయేనని వారు అన్నారు. వచ్చే వేసవికాలం నాటికి పోలవరం పూర్తి చేయడమే బీజేపీ లక్ష్యమని వారు ఆదివారం విలేకరులతో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును బాధ్యతగా తీసుకుంది కాబట్టి సమీక్షించాల్సిన బాధ్యత తమపైన ఉందని అన్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో ఇంకా చెల్లించని బిల్లులు లేవని ఆర్టీఐ ద్వారా తెలుసుకున్నట్టు చెప్పారు. పోలవరానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తోందని కన్నా తెలిపారు. నూటికి నూరుశాతం కేంద్రం నిధులతో ఈ ప్రాజెక్టును కడుతున్నారని తెలిపారు. దాదాపు రూ.16వేల కోట్ల ప్రాజెక్టు వ్యయాన్ని నూరుశాతం కేంద్రమే భరిస్తోందని తెలిపారు. పోలవరం బాధ్యత తమది అని గడ్కరీ చెప్పారని అన్నారు. చంద్రబాబుకి నిజం చెప్పడం రాదని, తమకు అబద్ధం చెప్పడం రాదని అన్నారు. -
బీజేపీ బలోపేతానికి కృషి : పురందేశ్వరి
అనంతపురం: ఆంద్రప్రదేశ్ లో బీజేపీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా కృషి చేయాలని కేంద్ర మాజీ మంత్రి, ఆ పార్టీ నేత పురందేశ్వరి అన్నారు. సోమవారం హిందూపూరంలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పార్థసారథి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణు వర్థన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ( హిందూపురం)