వెల్లువెత్తిన నిరసన
                  
	 నల్లగొండటౌన్, న్యూస్‌లైన్: పెద్దవూర మండలం ఏనెమీదితండాలో ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న ఆశ్రమంలోని 12 మంది విద్యార్థినులపై లైంగికదాడికి పాల్పడిన ట్యూటర్ హరీష్‌తోపాటు ఆశ్రమ వార్డెన్ శ్రీనివాస్‌ను శనివారం సాయంత్రం అరెస్టు చేసినట్లు  నల్లగొండ ఎస్పీ ప్రభాకర్‌రావు వెల్లడించారు. జిల్లా పోలీస్ కేంద్రకార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిన్నటి వరకు 11 మంది విద్యార్థినులపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చాయని, శనివారం మరొక విద్యార్థిని కూడా ఫిర్యాదు చేసిం దని చెప్పారు. విద్యార్థినులతో పాటు వారి  తల్లిదండ్రులను విచారణ చేశామని, 12మంది ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఇద్దరిపై12 కేసులు చేశామని వెల్లడించారు.
	
	 నిందితుడు హరీష్‌పై  నిర్భయతో పాటు మరో రెండు సెక్షన్లు, వార్డెన్ శ్రీనివాస్‌పై మరో సెక్షన్ కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ తెలి పారు. విద్యార్థినులకు  విద్యాబుద్ధులు చెప్పాల్సిన హరీష్ వారిని ప్రలోభపెట్టి లోబర్చుకున్నట్లు విచారణలో బాధితులు వెల్లడించారన్నారు. బాధితులందరికి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో మహిళా డాక్టర్ల చేత  వైద్యపరీక్షలు నిర్వహించామని, త్వరలో రిపోర్టు రానుందన్నారు.  బాధిత విద్యార్థినులకు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రవేశం కల్పించి విద్యాభ్యాసం సక్రమంగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. చట్టప్రకారం వారికి రావాల్సిన పరిహారం అందేలా చూడనున్నామన్నారు. జిల్లాలో ఆ సంస్థ నిర్వహిస్తున్న మరో రెండు ఆశ్రమాలపై కూడా ఫిర్యాదులు అందుతున్నాయని, వాటిపై కూడా విచారణ జరిపి నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందించనున్నామన్నారు. ఎస్పీ వెంట మిర్యాలగూడ డీఎస్పీ సుభాష్‌చంద్రబోష్ ఉన్నారు.