breaking news
Product launch
-
ఐఫోన్ 16 వచ్చేసింది..
క్యుపర్టినో, అమెరికా: టెక్ దిగ్గజం యాపిల్ తాజాగా కృత్రిమ మేథ ఆధారిత ఐఫోన్ 16 స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించింది. వీటిలో 4 మోడల్స్ (ఐఫోన్ 16, ప్లస్, ప్రో, ప్రో మ్యాక్స్) ఉన్నాయి. ఐఫోన్ 16 ధర 799 డాలర్ల(సుమారు రూ.69000) నుంచి,16 ప్లస్ ధర 899 డాలర్ల(రూ.76000) నుంచి ప్రారంభమవుతుంది. ఐఫోన్16లో ఐఫోన్ 15 కన్నా 30 శాతం వేగంగా పనిచేసే, 30 శాతం తక్కువ శక్తిని ఉపయోగించే 6–కోర్ ఏ18 ప్రాసెసర్ ఉంటుంది. ఈ ఫోన్ల సైజు 6.1 అంగుళాల నుంచి 6.9 అంగుళాల వరకు ఉంటుంది. భారీ జనరేటివ్ మోడల్స్‌ను ఉపయోగించేందుకు అనువుగా ఐఫోన్ 16 కోసం సరికొత్త ఏ18 చిప్‌ను తయారు చేశారు. గ్లోటైమ్ పేరిట నిర్వహించిన ఉత్పత్తుల ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న యాపిల్ సీఈవో టిమ్ కుక్, కొత్త తరం ఐఫోన్లను యాపిల్ ఇంటెలిజెన్స్‌తో రూపొందించినట్లు చెప్పారు. ప్రత్యేకంగా రూపొందించిన సర్వర్లపై యాపిల్ ఇంటెలిజెన్స్ పని చేస్తుందని పేర్కొన్నారు. కస్టమైజ్ చేసుకోతగిన యాక్షన్ బటన్, కెమెరా కంట్రోల్ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఐఫోన్ 16లో 48 ఫ్యూజన్ కెమెరా ఉంటుంది. కొత్తగా యాపిల్ వాచ్ సిరీస్ 10ని కూడా కంపెనీ ఆవిష్కరించింది. వీటి ధర 399 డాలర్ల నుంచి ఉంటుంది. సెప్టెంబర్ 20 నుంచి ఇవి లభ్యమవుతాయి. -
హోండా సిటీ.. డీజిల్ వేరియంట్
న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన హోండా కంపెనీ సిటీ మోడల్లో ఫోర్త్ జనరేషన్ వేరియంట్లను సోమవారం ఆవిష్కరించింది. తొలిసారిగా సిటీ మోడల్లో డీజిల్ వేరియంట్‌ను అందిస్తోంది. జనవరి నుంచి ఈ ఫోర్త్ జనరేషన్ సిటీ మోడల్ (పెట్రోల్, డీజిల్ వేరియంట్ల) విక్రయాలు ప్రారంభిస్తామని కంపెనీ ప్రెసిడెంట్ అండ్ సీఈవో హిరొనొరి కనయమ చెప్పారు. ఈ కొత్త మోడల్‌కు ముందస్తు బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభించామని పేర్కొన్నారు. ధర వివరాలను ఆయన వెల్లడించనప్పటికీ, ఈ కారు ధరలు రూ.7.50-రూ.11.50 లక్షల రేంజ్లో ఉంటాయనేది పరిశ్రమవర్గాల అంచనా. ఈ కారు హ్యుందాయ్ వెర్నా, రేనాల్ట్ స్కేలా, నిస్సాన్ సన్నీ, మారుతీ సుజుకి ఎస్ఎక్స్4, ఫోక్స్‌వ్యాగన్ వెంటో, ఫోర్డ్ ఫియస్టా, షెవర్లే సెయిల్, ఫియట్ లినియా, స్కోడా రాపిడ్‌లతో పోటీ పడాల్సి ఉంటుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. వచ్చే ఏడాది మొదట్లో మల్టీ పర్పస్ వెహికల్, మొబిలియోను అందుబాటులోకి తెస్తామని, మరో 3 కొత్త మోడళ్లను మార్కెట్లోకి తెస్తామని కనయమ పేర్కొన్నారు. 1998లో హోండా సిటీ కారును కంపెనీ తొలిసారి భారత్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇప్పటిదాకా 4.3 లక్షల కార్లను విక్రయించింది. హోండా మోడళ్లలో అత్యధికంగా అమ్ముడయ్యే కారు ఇదే. ప్రస్తుతం హోండా సిటీ పెట్రోల్ వేరియంట్లోనే లభిస్తోంది. ఇక కొత్త హోండా సిటీ పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌లోనూ లభ్యమవుతాయి. టచ్‌స్క్రీన్ ఇంటర్ఫేస్, బ్లూటూత్ టెలిఫోనీ, రియర్ వ్యూ కెమెరా, కీలెస్ స్టార్ట్, సన్‌రూఫ్ వంటి ప్రత్యేకతలున్నాయి.