breaking news
prisoner killed
-
ఖైదీ ఆత్మహత్య
హైదరాబాద్: మానసిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చంచల్‌గూడ జైలు ఖైదీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహబూబ్‌నగర్ జిల్లా యాంకీ గ్రామానికి చెందిన కుమ్మరి సత్యం (38) కూలిపనులకోసం భార్యతో కలసి కొన్నేళ్లక్రితం మహారాష్ట్రలోని పుణెకు వలస వెళ్లాడు. ఇంటిగొడవల కారణంగా భార్యను హత్య చేసిన కేసులో పుణె కోర్టు 2017లో అతడికి జీవితఖైదు విధించింది. అప్పట్నుంచి చంచల్‌గూడ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. కొంతకాలంగా అతడి మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో జైలు అధికారులు ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలో వైద్యం చేయిస్తున్నారు. ఈ నెల 9న అతడిని ఆస్పత్రిలో చేర్పించగా శుక్రవారం ఉదయం 12.30 గంటల సమయంలో బాత్రూమ్లో ఉన్న ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. సిబ్బంది నుంచి ఈ సమాచారం అందుకున్న ఆస్పత్రి ఆర్ఎంఓ మోహన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. పంచనామా తర్వాత మృతదేహాన్ని జైలు అధికారులకు అప్పగిస్తామని ఎస్సై మహేందర్ చెప్పారు. -
నర్సీపట్నం సబ్‌జైలులో ఖైదీ మృతి
నర్సీపట్నం: విశాఖ జిల్లా నర్సీపట్నం సబ్‌జైలులో శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ గుండెపోటుతో మృతిచెందాడు. కష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన పందిరి సత్యనారాయణ రోడ్డు ప్రమాదం కేసులో నర్సీపట్నం జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఆయనకు సోమవారం ఉదయం గుండెనొప్పి రావడంతో జైలు సిబ్బంది ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అనంతరం తీసుకువచ్చారు. తిరిగి రాత్రి గుండెనొప్పి రావటంతో వెంటనే స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఆయన అర్థరాత్రి సమయంలో మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.