breaking news
prise
-
పుష్కర భక్తుల జేబులకు 'పార్కింగ్' చిల్లు
అమరావతి (పట్నంబజారు) : అక్రమాలకు కాదేదీ అనర్హం అన్నట్లుంది అధికార పార్టీ నేతల తీరు. ప్రశాంత వాతావరణంలో పుష్కర స్నానాలు చేసేందుకు వస్తున్న భక్తులను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాపిస్తున్నారు. పార్కింగ్ ప్రదేశాల్లో యథేచ్ఛగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. గుంటూరు నుంచి అమరావతికి వచ్చే దారిలో ఏర్పాటు చేసిన పుష్కరనగర్ వద్ద పార్కింగ్‌లకు స్థలాన్ని కేటాయించారు. ద్విచక్ర వాహనాలు, వృద్ధులు, వికలాంగులున్న వాహనాలను మాత్రం లోపలికి అనుమతించాలని జిల్లా ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయి. ఇవన్నీ పట్టని పార్కింగ్ నిర్వాహకులు ఇష్టానుసారంగా వాహనాలను పార్కింగ్‌లో పెట్టాల్సిందేనంటూ... దందా చేస్తున్నారు. రశీదుల్లో ఒక రేటు ఉంటే..అదనంగా తీసుకుంటున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. ద్విచక్ర వాహనానికి రూ 20, కారు, జీపు, ఆటోలకు రూ.50, బస్సులు, లారీలకు రూ.100 వసూలు చేస్తున్నారు. ఈ వ్యవహారం గురించి పోలీసు ఉన్నతాధికారులకు తెలిసినప్పటీకీ పట్టించుకోవడం లేదనే విమర్శలొస్తున్నాయి.lఅధికారి పార్టీకి చెందిన జెడ్పీటీసీ బంధువు పార్కింగ్ నిర్వహిస్తుండటంతోనే నోరు మెదపడం లేదని సమాచారం. పార్కింగ్ ప్రదేశాల్లో వాహనాలు నిలిపేందుకు నిర్వాహకులకు పోలీసులు సహకరించటంపై అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పుష్కర నగర్ నుంచి ఉచిత బస్సుల్లో అమరావతి చేరుకున్నప్పటీకీ కిలోమీటకు పైగా నడవాల్సి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పార్కింగ్ దందాను అరికట్టాలని భక్తులు కోరుతున్నారు. -
మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు
-
మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు మరోసారి పెరిగాయి. లీటరు పెట్రోలు ధర 64 పైసలు పెంచుతున్నట్లు ఆయిల్ కంపెనీలు సోమవారం ప్రకటించాయి. కాగా, డీజిల్ ధర మాత్రం రూ. 1.35 తగ్గింది. పెంచిన ధరలు ఈరోజు అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి. రెండు వారాల కిందటే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో తాజా పెంపు నిర్ణయం వినియోగ దారులకు మరింత భారం కానుంది. అంతర్జాతీయ మార్కెట్ లో ముడిచమురు ధరలు అందుబాటులోనే ఉన్నప్పటికీ భారత్‌లో మాత్రం పెట్రోల్ రేటు పెరిగిపోతుండం గమనార్హం. ధరల పెంపు నిర్ణయం పూర్తి నిర్ణయాన్ని చమురు కంపెనీలకే కట్టబెట్టిన నేపథ్యంలో గత అక్టోబర్ నుంచి ఇంధన ధరల్లో పెరుగుదల, తరుగుదలలు గణనీయంగా చోటుచేసుకోవడం తెలిసిందే. గడిచిన మే 15న పెట్రోల్ పై రూ. 3.13, డీజిల్ పై రూ. 2.71 పెంపు విధించారు.