breaking news
pretty
-
త్రిష తల్లిని చూశారా? ఈమె కంటే అందంగా ఉందిగా! (ఫొటోలు)
-
Valentine's Day : ప్రెటీ లుక్స్.. ఇవిగో టిప్స్!
అందంగా కనిపించాలని ఎవరు మాత్రం కోరుకోరు. అందులోనూ ప్రేమికులకు ఎంతో ఇష్టమైన ప్రేమికుల రోజు మరికొన్ని గంటల దూరంలో ఉంది. తన పార్ట్నర్తో రొమాంటిక్‌గా గడిపే క్షణాల్లో అందంగా మెరిసి పోవాలని అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా ఉంటుంది. అమ్మాయిలైతే ముందు నుంచే అలర్ట్‌గా ఉంటారు. కానీ అబ్బాయిలు మాత్రం జిడ్డు ముఖంతో ఎలా రా బాబూ అని తెగ హైరానా పడిపోతుంటారు. అవునా..? అందుకే ఇంటి చిట్కాలతో ఇన్స్టంట్ గ్లో వచ్చేలా చేసుకోవచ్చు. లవ్బర్డ్స్కోసం ఉపయోగపడే అలాంటి బ్యూటీ టిప్స్ ఒకసారి చెక్ చేద్దాం.అందం అనే దానికి నిర్వచనాలు చాలా ఉన్నాయి. కానీ మనం ఇష్టపడే వ్యక్తికి ఆకర్షణీయంగా కనిపించాలి. అలా ఉండాలంటే, మానిసిక ఆరోగ్యంతోపాటు, శారీరంగా కూడా కావాలి. అలా అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉన్నపుడు వచ్చే ఆత్మవిశ్వాసం, ఆత్మ స్థైర్యం వేరే లెవల్లో ఉంటుంది. దీనికి ప్రేయసి లేదా, ప్రియుడి చేయూత ఉంటే ఎలాంటి కష్టాన్నైనా అధిగమించే ధైర్యాన్నిస్తుంది. కొండంత బలాన్నిస్తుంది. దీనికి మించిన అందం ఏముంటుంది?అందకోసం బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఎక్కువగా డబ్బు ఖర్చు చేయాల్సిన పనీలేదు. మన ఇంట్లో ఉండే వాటితోనే అందాన్ని పెంచుకోవచ్చు. మనం రోజూ ఉపయోగించే వాటితోనే అందాన్ని మెరుగు పరచుకోవచ్చు.ఇదీ చదవండి: టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ, హీరో రాగ్ మయూర్‌తో వాలెంటైన్స్ డే స్పెషల్శనగ పిండిలో కాస్తంత పెరుగు, కొద్దిగా నిమ్మకాల కలిపి మంచి పేస్ట్‌లా తయారు చేసి ముఖానికి పట్టించి, బాగా ఆరిన తరువాత మృదువుగా మసాజ్ చేస్తూ కడిగేసుకోవాలి.నిమ్మరసం, తేనెతో కూడా ముఖంపై ఉండే మురికిని వదిలించుకోవచ్చు. ఫేస్ వాష్, సబ్బులకు బదులు నిమ్మరసం, తేనె కలిపి ఉపయోగించుకోవచ్చు. వీటిని ఉపయోగించడం వల్ల మృత కణాలు తొలిగిపోతాయి. ముఖం మెరిసిపోతుంది.బాదం, గంధం పొడి, వేపాకుల పేస్టు కలిపి రాస్తే.. ముఖంపై ఉండే మురికి పోయి స్కిన్ గ్లోయింగ్‌గా ఫ్రెష్‌గా కనిపిస్తుంది. ముఖ్యంగా అబ్బాయిలుకు ఇది ఉపయోగపడుతుంది.ఆరెంజ్ జ్యూస్‌లో కొద్దిగా ఆర్గానిక్ పసుపు కలిపి ముఖానికి మెడకు,మోచేతులకు చక్కగా అప్లయ్ చేసి ఆరిన తరువాత కడిగేసుకుంటే మంచి గ్లో వస్తుంది.చర్మానికి బొప్పాయి పండు చాలా చక్కగా పని చేస్తుంది. బొప్పాయి పండు పేస్ట్ రాస్తే చర్మం.. ఎక్స్ఫోలియేట్ అవుతుంది. మృదువుగా మారి మంచి గ్లో వస్తుంది. అలాగే నచ్చినట్టుగా మీసాలు, గడ్డాన్ని చక్కగా నీట్‌గా కట్ చేసుకోవాలి. హెయిర్ స్టైల్‌ను మెయింటైన్ చేయాలి. దీంతోపాటు చక్కటి పెర్ఫ్యూమ్ వాడితే మరీ మంచిది. ఇక అమ్మాయిలైతే ఆలు గడ్డ రసంలో రెండు చుక్కల ఆల్మండ్ ఆయిల్, శనగపిండి కలిపి మాస్క్‌లాగా వేసుకోవాలి. ఆరిన తరువాత శుభ్రంగా కడిగేసుకోవాలి. అలాగే కాఫీ ఫౌడర్‌లో కాస్తం టొమాటో రసం వేసి, ముఖానికి, మెడకు,మోచేతుల దాకా అప్లయ్ చేసి కాసేపు మసాజ్ చేసి శుభ్రంగా కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. టమాటా రసం, ఓట్స్ పొడి పాలు. ఈ స్క్రబ్‌లు ఉపయోగించినా చర్మం తాజాగా మెరుస్తుంది. ఇలా ప్యాక్ వేసుకున్నాక చేసిన రెండు ఐస్‌ముక్కలతో ముఖంపై మృదువగా మసాజ్ చేసుకోవాలి. ఆ తరువాత ముఖాన్ని శుభ్రంగా తుడిచేసుకుని రసాయను లేని మాయిశ్చరైజర్ అప్లయ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. మరిన్ని టిప్స్చర్మం ఆరోగ్యంగా . యవ్వనంగా కనిపించాలనుకుంటే ప్రతి రాత్రి 7-8 గంటలు నిద్రపోవాలి.తగినన్ని నీళ్లు తాగాలి. చర్మానికి విటమిన్లు, ఖనిజాలు ఎంత అవసరమో, నీళ్లు కూడా అంతే అవసరం. హైడ్రేటెడ్ గా ఉండటం వల్ల శరీరం నుండి అదనపు మలినాలు తొలగిపోయి, చర్మం కాంతివంతంగా ఉంటుంది. తాజాపండ్లు ఆకుకూరలు తీసుకోవాలి. ఒత్తిడికి దూరంగా ఉంటూ, క్రమంతప్పకుండా రోజుకు కనీసంఅరగంటసేపు ఏదో ఒక వ్యాయామం చేయాలి. ఇది అబ్బాయిలకు, అమ్మాయిలకు ఇద్దరికీ వర్తిస్తాయి. వీటన్నింటి కంటే ముందు మీ మనసులోని ఆనందం, మీ శరీరంలో ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్లే మీ ముఖానికి మరింత అందాన్ని తీసుకొస్తాయి. కనుక అందం గురించి పట్టించుకోకుండా, ఆనందంగా గడపండి. మీ బంధాన్ని దృఢం చేసుకోండి. మర్చిపోలేని జ్ఞాపకాలను పోగు చేసుకోండి. హ్యాపీ వాలైంటైన్స్ డే! -
అప్పుడు హాకీ.. ఇప్పుడు ఫుట్‌బాల్
దాదాపు పదేళ్ల కిత్రం బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ హాకీ టీమ్ కోచ్‌గా నటించిన చిత్రం ‘చక్ దే ఇండియా’. ఆ టీమ్‌లో సెంటర్ ఫార్వార్డ్ ప్లేయర్ ప్రీతీ సబర్వాల్ గా నటించారు సాగరిక ఘాట్జే. ఇంతకీ ఈమె ఎవరో తెలుసు కదా. ఫేమస్ క్రికెట్ ప్లేయర్ జహీర్ ఖాన్ సతీమణి. ఇప్పుడు సాగరిక గురించి ఎందుకంటే.. అప్పుడు హాకీ ప్లేయర్‌గా నటించిన ఆమె ఇప్పుడు ‘మాన్సూన్ ఫుట్‌బాల్’ చిత్రంలో ఫుట్‌బాల్ ప్లేయర్‌గా నటించనున్నారు. మిలింద్ ఉకే దర్శకత్వం వహించనున్నారు. జూన్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది. కొందరు హౌస్‌వైఫ్‌లు కలిసి ఓ ఫుట్‌బాల్ టీమ్‌గా ఏర్పడే కాన్సెప్ట్ ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది. -
అందంగా లేనని.. యువతి ఆత్మహత్య
ఖమ్మం: పదేళ్లుగా చర్మవ్యాధితో బాధపడుతున్న ఓ యువతి తనను ఎవరూ వివాహం చేసుకోరేమోననే బాధతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఖమ్మంలో జిల్లాలోని గార్ల మండలం మద్దివంచకు చెందిన మాచర్ల వెంకన్న పిల్లల చదువుల కోసమని కొంతకాలం కిందట కుటుంబంతో కలిసి పట్టణానికి వచ్చి గట్టయ్య సెంటర్లో నివాసం ఉంటున్నారు. వెంకన్న ఓ అపార్ట్మెంట్లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. భార్య పద్మ చిన్న చిన్న పనులు చేస్తుండగా శిరీష(18) స్థానిక ప్రయివేట్ కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతుండగా, కుమారుడు శ్రీకాంత్ ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. శిరీష పదేళ్లుగా చర్మవ్యాధితో బాధపడుతోంది. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా నయం కాకపోవడంతో తీవ్ర ఆవేదనకు లోనైంది. దీంతో ఆమె మనస్తాపానికి గురైంది. మంగళవారం సాయంత్రం ఎవరికీ చెప్పకుండా బయకటు వచ్చింది. రాత్రి అయినా శిరీష తిరిగి రాకపోయేసరికి కంగారుపడిన ఆమె సోదరుడు ఫోన్ చేయగా ఆమె ఫోన్ ఎత్తలేదు. 'అన్నయ్యా.. అమ్మను బాగా చూసుకో.. నాన్న జాగ్రత్త.. ఇక నేను ఎప్పటికీ మీకు కనపడను. మళ్లీ జన్మంటూ ఉంటే మీ కుటుంబంలోనే పుట్టాలని ఆ దేవున్ని కోరుకుంటా' అని సోదరుడికి మెసేజ్ పెట్టింది. దాంతో శిరీష సోదరుడు తిరిగి రమ్మని ఎక్కడ ఉన్నావని మెసేజ్‌లు పంపినా రిప్లయ్ లేదు. ఆ తర్వాత సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన ఆమె.. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు శిరీష మృతదేహాన్ని మార్చరికీ తరలించారు. అంతలో ఆమె కుటుంబ సభ్యులు వెతుక్కొంటూ రైల్వే ప్లాట్‌ఫాంపై తిరుగుతుండగా పోలీసులు ప్రశ్నించగా వారు విషయం తెలిపారు. దాంతో వారికి శిరీష మృతదేహాన్ని చూపించగా గుర్తించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.