breaking news
PRC pendings
-
AP: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్
సాక్షి, విజయవాడ: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం మరో గుడ్న్యూస్ చెప్పింది. స్పెషల్ పే పెంచుతూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 11వ పీఆర్సీ సిఫార్సులు అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను విడుదల చేసింది. కాగా, ప్రభుత్వం నిర్ణయంతో 1,2 కేటగిరీలు మినహా అన్ని కేటగిరి ఉద్యోగులకు ప్రయోజనం కలుగనుంది. ఇది కూడా చదవండి: టీ షర్ట్ మీద చే గువేరా.. గుండెల్లో చంద్రబాబు.. ఎవరతను? -
పీఆర్సీ బకాయిలను విడుదల చేయాలి
పెద్దశంకరంపేట: విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఎస్టీయూ ఆధ్వర్యంలో ఈ నెల 27న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎస్టీయు రాష్ట్ర కౌన్సిలర్ బి.శ్రీనివాస్ కోరారు. మంగళవారం పేటలో ఎస్టీయూ చలో హైదరాబాద్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పీఆర్సీ బకాయిలను చెల్లించాలని, డీఎస్సీ నిర్వహించాలని, విద్యకు బడ్జెట్లో 30 శాతం నిధులు కెటాయించడంతో పాటు సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో ఎస్టీయు మండల అధ్యక్షులు లింగారెడ్డి, ప్ర«ధానకార్యదర్శి రాధాక్రిష్ణ, కుమార్, శంకర్, నారాయణ, సిద్దిరాములు, సంగారెడ్డి, విఠల్నాయక్ తదితరులున్నారు.