breaking news
Prakasham ZP Chairman
-
ప్రకాశం జడ్పీ ఛైర్మన్‌పై అనర్హత వేటు
-
ప్రకాశం జడ్పీ ఛైర్మన్‌పై అనర్హత వేటు
ప్రకాశం జిల్లా పరిషత్ ఛైర్మన్ ఈదర హరిబాబు జడ్పీటీసీ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ అక్కడి జిల్లా కలెక్టర్ విజయకుమార్ నిర్ణయం తీసుకున్నారు. విప్ ధిక్కరించిన కేసులో ఆయనపై అనర్హత వేటు వేశారు. దాంతో ఆయన జడ్పీటీసీ సభ్యత్వంతో పాటు.. ఛైర్మన్ పదవి కూడా పోయినట్లు అవుతుంది. గతనెల 13వ తేదీన జరిగిన జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి వైఎస్ఆర్ సీపీ వ్యూహాత్మకంగా ఇచ్చిన మద్దతుతో చైర్మన్ గా ఈదర హరిబాబు గెలిచిన విషయం తెలిసిందే. అయితే, ఆ సమయంలో అసలు తెలుగుదేశం పార్టీ తనకు విప్ ఇవ్వనే లేదని, అలాంటప్పుడు దాన్ని ధిక్కరించే ప్రశ్న ఎక్కడినుంచి వస్తుందని హరిబాబు అంటున్నారు. ఇంతకుముందే ప్రిసైడింగ్ అధికారి తనకు షోకాజ్ నోటీసు ఇవ్వగా దానికి ఆయన సమాధానం కూడా ఇచ్చారు. అయినా కూడా ఇప్పుడు ఆయన సభ్యత్వం రద్దు కావడం గమనార్హం. -
ప్రకాశం జెడ్పీ చైర్మన్ ఎన్నికపై ఈసీకి హైకోర్టు ఆదేశం
స్వేచ్ఛాయుతంగా నిర్వహించండి సాక్షి, హైదరాబాద్: ప్రకాశం జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిమిత్తం ఈ నెల 13న జరగనున్న జెడ్పీ ప్రత్యేక సమావేశం.. శాంతియుత, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ఎన్నికల సంఘం గురువారం జారీ చేసిన సర్క్యులర్‌ను తూచా తప్పకుండా అమలు చేయాలని ఎన్నికల అధికారులకు హైకోర్టు స్పష్టం చేసింది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం ఈ నెల 13న జరిగే జిల్లా పరిషత్ ప్రత్యేక సమావేశాన్ని పరిశీలించేందుకు ప్రత్యేక పరిశీలకుడిని నియమించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని, తమ పార్టీ సభ్యులకు రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ సభ్యుడు నూకసాని బాలాజీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ విచారించారు.