breaking news
prajwala ngo
-
మహిళా చైతన్యానికి ‘ప్రజ్వల’
చందంపేట (దేవరకొండ) : అవినీతి.. అరాచకా లు.. చిన్నపిల్లలపై లైంగిక దాడులు ఇవన్నీ ప్రస్తు త సమాజంలో మనం నిత్యం చూస్తున్న సత్యాలు. వాటికి వ్యతిరేకంగా పోరాడుతూ ఒకటి కాదు రెం డుకాదు దేశ వ్యాప్తంగా 20 వేల మందిని కాపాడింది డాక్టర్ సునీతా రామకృష్ణన్. ఈమె ప్రజ్వల అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి సేవా కార్య క్రమాలను చేపడుతూ ఆడ పిల్లల అమ్మకాలు, బ్రూణహత్యలు, వెట్టిచాకిరి, పిల్లల అక్రమ రవా ణాను అడ్డుకుంటోంది. జిల్లాలో ముమ్మరంగా కార్యక్రమాలు గత 22 ఏళ్లుగా రాష్ట్రంలో ఆడ పిల్లలను కాపాడుతూ వారికి మనోధైర్యాన్ని ఇస్తున్న ఆమె సేవలు ఇప్పుడు నల్లగొండ జిల్లాలో ముమ్మరంగా సాగుతున్నాయి. ఆమె ఏర్పాటు చేసిన ప్రజ్వల సంస్థ ఆధ్వర్యంలో నేరడుగొమ్ము మండలంలోని పలు గ్రామాల్లో మూడు రోజుల పాటు అవగాహన సదస్సులు నిర్వహించారు. అలాగే మారుమూల చం దంపేట మండలంలో కూడా ఆ సంస్థ ఆధ్వర్యం లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. 1996లో ఏర్పాటు 1996లో డాక్టర్ సునీతా రామకృష్ణన్ ప్రారంభించి న ఈ సంస్థ అప్పటి నుంచి ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. దాతల సహకారంతో సొంత కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ఆమె గురించి ‘సాక్షి’ దినపత్రిలో పలుమార్లు కథనాలు రావడంతో పలువురు పాఠకులు స్పందిస్తూ హైదరాబాద్‌లోని తుక్కుగూడలో ప్రజ్వల సంస్థ కార్యాలయాని కి ఆర్థిక సహకారం అందించారు. బ్రూణ హత్యలు, పిల్లల అమ్మకాలు, పిల్లల అక్రమ రవాణాల నివారణపై అవగాహన కల్పిస్తోంది. సేవలు విస్తృతం చేస్తాం ఆడ పిల్లల రక్షణ, భ్రూణ హత్యలు, శిశు విక్రయాలు తదితర అంశాలపై ప్రజ్వ ల ఆధ్వర్యంలో 22 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా. మోసపోయిన బాలికలకు ఉచి త శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. షెల్టర్ హోం, ఎమర్జెన్సీ షెల్టర్ హోం ద్వారా ఆశ్రయం కల్పి స్తున్నాం. సేవలను విస్తృతం చేస్తాం.\ – డాక్టర్ సునీతా రామకృష్ణన్ -
సునీత పోరాటం ఫలించింది!!
ప్రజ్వల స్వచ్ఛంద సంస్థను స్థాపించి.. రేపిస్టుల ఘాతుకాలపై అలుపెరుగని పోరాటం చేసిన.. హైదరాబాద్‌కు చెందిన సునీతా కృష్ణన్ కృషి ఎట్టకేలకు ఫలించింది. అత్యాచారం చేయడమే కాక.. ఆ వీడియోను ఇంటర్నెట్లో ప్రచారం చేస్తున్న దుర్మార్గుడిని సీబీఐ వర్గాలు తమ కస్టడీలోకి తీసుకున్నాయి. ఒడిషాలోని భువనేశ్వర్‌కు చెందిన సబ్రత్ సాహు ఓ ప్రాపర్టీ డీలర్. అతడు చేసిన ఘాతుకాలపై ప్రజ్వల సంస్థ తరఫున సునీతా కృష్ణన్ రాసిన లేఖను సుమోటోగా విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు అతడిని అరెస్టు చేయాల్సిందిగా సీబీఐని ఆదేశించింది. స్వయంగా సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు ఈ కేసును విచారణకు స్వీకరించి, చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. సునీతా కృష్ణన్ కేవలం లేఖ రాసి ఊరుకోకుండా దాంతోపాటు నిందితులు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలోను, వాట్సప్లోను అప్లోడ్ చేసిన అసభ్య వీడియో క్లిప్పింగులున్న పెన్ డ్రైవ్‌ను కూడా పంపారు. ఈ క్లిప్పింగులను సీబీఐకి పంపాల్సిందిగా కేంద్ర హోంశాఖకు సుప్రీం కోర్టు సూచించింది. వీటిలోని ఓ క్లిప్పింగులో సబ్రత్ సాహు ఓ మహిళపై లైంగిక దాడి చేస్తుండగా, మరో వ్యక్తి దాన్ని చిత్రీకరిస్తున్నట్లు కూడా ఉంది. సాహును మంగళవారం నాడు భువనేశ్వర్‌లో అరెస్టుచేశారు. సాహు అరెస్టు పట్ల సునీతా కృష్ణన్ హర్షం వ్యక్తం చేశారు. అయితే.. ఇతర కేసుల్లో మరో ఆరుగురిని కూడా గుర్తించారని, వారిని ఇంకా అరెస్టు చేయాల్సి ఉందని ఆమె చెప్పారు. ఇప్పటికైనా చర్యలు మొదలైనందుకు సంతోషంగా ఉందని, కానీ సమాజంలో అన్ని వర్గాలు ఇకనైనా ముందుకొచ్చి ఇలాంటి అన్యాయాలపై పోరాడాలని అన్నారు.