breaking news
posting on social media
-
హోరెత్తుతున్న సోషల్ మీడియా
సాక్షి, అమరావతి : సోషల్ మీడియా ఎన్నికల వేడిని మరింత పెంచుతోంది. అభ్యర్థుల ఆరోపణ, ప్రత్యారోపణలకు ఇది వేదికైంది. ప్రతీ అభ్యర్థి సోషల్‌మీడియా నిర్వహణకు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకుని, శరవేగంతో పోస్టింగ్‌లు వచ్చేలా జాగ్రత్త పడుతున్నారు. దెబ్బకు దెబ్బ అన్నట్టుగా క్షణాల్లో పోస్టింగులు పెడుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వారం రోజుల్లోనే దీని వేగం మూడింతలు పెరిగిందని ఇటీవల ఓ సర్వే సంస్థ పేర్కొంది. 2014 ఎన్నికలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. మరో ఐదు రోజుల్లో ఈ స్పీడ్ నాలుగు రెట్లు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అభ్యర్థుల ప్రత్యక్ష ప్రసారాలను కూడా సోషల్ మీడియా ద్వారానే ఇస్తున్నారు. -
మార్ఫింగ్ ఫోటోలతో యువతులకు వేధింపులు
శ్రీనగర్, నొయిడా: తమ మాట వినటం లేదనే ఆగ్రహంతో మార్ఫింగ్ చేసిన ఫొటోలతో యువతులను వేధించటం మొదలుపెట్టారు. వాటిని భరించలేక బాధిత యువతులు పోలీసులను ఆశ్రయించారు. శ్రీనగర్, నొయిడాలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలివీ.. జమ్మూకశ్మీర్‌లో అనంతనాగ్ జిల్లా హిత్మూరా పట్టణానికి చెందిన అబ్రార్ అహ్మద్ స్థానిక యువతిని ప్రేమించాడు. వేరే కారణాలతో కొంతకాలం క్రితం వారిద్దరూ విడిపోయారు. అయితే, ఇది ఇష్టంలేని యువకుడు అహ్మద్ ఫేస్బుక్, వాట్సప్‌లలో ఉంచిన బాధితురాలి ఫొటోలను సేకరించాడు. ఫొటోషాప్ ద్వారా మార్ఫింగ్ చేసి యువతి చేతుల్లో మద్యం బాటిల్‌తోపాటు పిస్టల్‌ను ఉంచి యువతి మిత్రులకు పంపాడు. ఈ విషయం తెలిసిన బాధితురాలు ఈనెల 7వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు అతనిపై 354-డి, 506 ఆర్పీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరో ఘటనలో...గ్రేటర్ నొయిడా బీటా-1 సెక్టార్‌కు చెందిన ఓ యువతి ఈమెయిల్ అకౌంట్ ఇటీవల హ్యాక్ అయింది. అందులో ఉన్న బాధితురాలి ఫొటోలను గుర్తు తెలియని వ్యక్తి కాపీ చేసుకుని, మార్ఫింగ్ చేశాడు. అశ్లీలకరంగా వాటిని మార్చివేయటంతోపాటు ఓ అసభ్యవీడియోలో కూడా ఆమె ఫొటోతో మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో అప్లోడ్ చేశాడు. విషయం తెలిసిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్‌సెల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలికి బాగా సన్నిహితులైన వారే ఈ చర్యకు ఒడిగట్టి ఉంటారని అనుమానిస్తున్నారు.