breaking news
Port Louis
-
మారిషస్ దేశాధ్యక్షుడు రాజీనామా
పోర్ట్ లూయిస్ : మారిషస్ దేశాధ్యక్షుడు కైలాష్ పుర్యాగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను జాతీయ అసెంబ్లీ స్పీకర్‌కు పంపినట్లు శనివారం ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. 2012లో దేశాధ్యక్షుడిగా కైలాష్ పుర్యాగ్ బాధ్యతలు స్వీకారించారు. అయితే ఈ ఏడాది దేశాధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని కైలాష్ నిర్ణయించారు. మరో ఐదు నెలల పాటు పదవిలో కొనసాగాలని మారిషస్ యంత్రాంగం విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో కైలాష్ శనివారం రాజీనామా చేశారు. -
మారిషస్‌లో యూఎస్ ఎంబసీ మూసివేత
మారిషస్‌లోని యూఎస్ రాయబార కార్యాలయాన్ని వారం రోజులపాటు మూసివేస్తున్నట్లు ఆ కార్యాలయ ఉన్నతాధికారులు బుధవారం వెల్లడించారు. ప్రపంచంలోని పలుదేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలను అల్ ఖైదా తీవ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారని సమాచారం మేరకు ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విదేశాల్లోని యూఎస్ వాసులు, రాయబార కార్యాలయ సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఆఫ్రికాతోపాటు వివిధ దేశాల రాయబార కార్యాలయాలను మూసివేయాలని అమెరికా ప్రభుత్వం ఆ ఆదేశాలు జారీ చేసింది. పలుదేశాల్లోని యూఎస్ రాయబార కార్యాలయాలపై దాడి చేయాలని తీవ్రవాద సంస్థ అల్‌ఖైదా వివిధ దేశాల్లోని తమ శాఖలను ఆదేశించినట్లు నిఘా వర్గాల సమాచారం మేరకు ఒబామా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఈజిప్టు, యెమెన్, సౌదీ అరేబియా, కువైట్, మెడగాస్కర్, బురుండి దేశాలతోపాటు మరో 19 దేశాల్లోని యూఎస్ రాయబార కార్యాలయాలను ఇప్పటికే మూసివేసిన సంగతి తెలిసిందే.