breaking news
pollution certificate
-
పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుంటే నో పెట్రోల్!
పర్యావరణ పరిరక్షణ, పెరుగుతున్న వాహన కాలుష్య నివారణే లక్ష్యంగా ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో చెల్లుబాటు అయ్యే ‘పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్’(పీయూసీ) లేని ఏ వాహనానికీ పెట్రోల్ లేదా డీజిల్ విక్రయించకూడదని రాష్ట్ర రవాణా యంత్రాంగం (ఎస్టీఏ) స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.చమురు సంస్థలకు కీలక ఆదేశాలుఈ నిబంధనను తక్షణమే అమలు చేయాలని కోరుతూ ఇండియన్ ఆయిల్ (IOCL), భారత్ పెట్రోలియం (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం (HPCL) వంటి ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు రిలయన్స్, షెల్ వంటి ప్రైవేట్ చమురు సంస్థలకు కూడా రవాణా శాఖ లేఖలు రాసింది. ప్రతి ఫ్యుయల్ స్టేషన్ వద్ద వాహనదారుడి పీయూసీ సర్టిఫికేట్‌ను సిబ్బంది భౌతికంగా లేదా డిజిటల్ రూపంలో తనిఖీ చేసిన తర్వాతే ఇంధనం పోయాల్సి ఉంటుంది.అవగాహన కార్యక్రమాలుఈ కొత్త నిబంధనపై వాహనదారులకు, పెట్రోల్ బంక్ సిబ్బందికి తగినంత అవగాహన కల్పించాలని చమురు సంస్థలను కోరింది. ఒకవేళ సర్టిఫికేట్ లేని వాహనాలకు ఇంధనం సరఫరా చేస్తే సంబంధిత డీలర్లపై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఎస్టీఏ హెచ్చరించింది.చట్టపరమైన నిబంధనలు ఇవే..మోటారు వాహనాల చట్టం, 1988లోని సెక్షన్ 190(2), సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్, 1989లోని రూల్ 115 ప్రకారం.. ప్రతి వాహనం నిర్దేశిత ఉద్గార ప్రమాణాలకు లోబడి ఉండాలి. పీయూసీ లేకుండా వాహనం నడపడం చట్టరీత్యా నేరమని, దీనివల్ల పర్యావరణం దెబ్బతినడమే కాకుండా ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోందని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు.ఢిల్లీ బాటలోనే ఒడిశాదేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం తీవ్రమైన స్థాయికి చేరడంతో అక్కడ ఇప్పటికే ‘నో పీయూసీ - నో ఫ్యూయల్’ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఢిల్లీలో ప్రస్తుతం గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ-4) అమల్లో ఉంది. అదే బాటలో ఒడిశా ప్రభుత్వం కూడా ముందుస్తు జాగ్రత్తగా ఈ చర్యలు చేపట్టింది.ఇదీ చదవండి: పన్ను చెల్లింపుదారుల సోషల్ మీడియా, ఈమెయిల్స్‌పై నిఘా -
పొల్యూషన్ సర్టిఫికెట్ తప్పనిసరి కాదు..
వాహనాలకు థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ పొందేందుకు కాలుష్య నియంత్రణ (PUC) సర్టిఫికెట్ ఇకపై తప్పనిసరి కాదు. ఈ మేరకు దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. వాహనాలకు థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ కోసం కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ తప్పనిసరి అన్న 2017 ఆగస్టు 10 నాటి ఆర్డర్ ద్వారా విధించిన షరతును సుప్రీంకోర్టు తొలగించింది.జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ దాఖలు చేసిన అప్పీల్‌పై జస్టిస్ ఏఎస్ ఓకా, ఏజీ మసిహ్‌లతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. 2017 ఆర్డర్‌కు సంబంధించి ఉన్న ఇబ్బందులను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా లేవనెత్తారు. ప్రమాద బాధితులు నేరుగా వాహన యజమానుల నుంచి నష్టపరిహారం కోరుతున్నారని, కానీ థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ లేకపోవడంతో వాహన యజమానులు పరిహారాన్ని చెల్లించలేకపోతున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.వాహన బీమా పాలసీ పునరుద్ధరణ కోసం పీయూసీ సర్టిఫికేట్ తప్పనిసరి అని మోటారు వాహనాల చట్టం, 1988 కానీ దాని కింద రూపొందించిన మరే ఇతర చట్టం కానీ నిబంధనలు విధించలేదని కోర్టు స్పష్టం చేసింది. అయితే కాలుష్యాన్ని నియంత్రించేందుకు వాహనాలు ఎప్పటికప్పుడు పీయూసీ సర్టిఫికెట్లను కలిగి ఉండేలా ఈ షరతు విధించామని, దీనికి మరింత సమర్థవంతమైన పరిష్కారం అవసరమని కోర్టు నొక్కి చెప్పింది. కాగా ఢిల్లీ-ఎన్సీఆర్లో వాహనాలను ట్రాక్ చేయడానికి రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని ఉపయోగించాలని కోర్టు సూచించింది.థర్డ్-పార్టీ వాహన బీమా కోసం పీయూసీ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేస్తూ 2017లో ఇచ్చిన ఉత్తర్వులను పునఃసమీక్షించాలనే ఉద్దేశాన్ని సుప్రీంకోర్టు గతంలోనే వ్యక్తం చేసింది. థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ విస్మరిస్తున్న వాహనదారులు 55% మంది ఉన్నారని, దీంతో ప్రమాద క్లెయిమ్‌లు పరిహారం పొందడం కష్టంగా మారిందని సొలిసిటర్ జనరల్ పేర్కొన్నారు. థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ కవరేజీని కొనసాగిస్తూనే వాహనం పీయూసీ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా బ్యాలెన్స్డ్ విధానం అవసరమని కోర్టు అంగీకరించింది. -
వాహనదారులకు అలర్ట్.. ఆ సర్టిఫికెట్ లేకపోతే నో పెట్రోల్, డీజిల్
వాహనాదారులకు ఢిల్లీ ప్రభుత్వం షాకిచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య నియంత్రణ కోసం ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్ కీలక నిరయం తీసుకుంది. బంకుల్లో పెట్రోల్, డీజిల్ కావాలంటే తప్పనిసరిగా పొల్యూషన్ సర్టిఫికెట్(పీయూసీ) ఉండాలనే నిబంధన విధించింది. వివరాల ప్రకారం.. ఢిల్లీలో ప్రతీ శీతాకాలం గాలి కాలుష్య తీవ్రత బాగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కాలుష్య నియంత్రణ కోసం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం.. పీయూసీ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేసింది. పీయూసీ సర్టిఫికెట్ లేకుండా బంకుల్లో పెట్రోల్, డీజిల్‌ను పోయరని స్పష్టం చేసింది. అక్టోబర్ 25 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్‌రాయ్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి గోపాల్‌రాయ్ మాట్లాడుతూ సెప్టెంబర్ 29న పర్యావరణం, రవాణా, ట్రాఫిక్ అధికారులతో సమావేశం సందర్భంగా కాలుష్య నియంత్రణకు ప్రణాళిక, విధివిధానాలను చర్చించినట్టు తెలిపారు. కాగా, పీయూసీ సర్టిఫికెట్‌కు సంబంధించిన నోటిఫికేషన్ తర్వలోనే విడుదలవుతుందని వెల్లడించారు. అంతేకాకుండా అక్టోబర్ 6వ తేదీ నుంచి యాంటీ డస్ట్ క్యాంపెయిన్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. అక్కడ నిర్మాణ స్థలాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి కాలుష్యాన్ని అరికట్టనున్నట్లు స్పష్టం చేశారు. దీంతో, కాలుష్య నియంత్రణ కొంత మేరకు సాధ్యమవనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. Vehicle owners will not be provided fuel at petrol pumps in Delhi without showing a valid pollution under control certificate from October 25, Environment Minister Gopal Rai said @AapKaGopalRai #Petrol #Environment https://t.co/yz1zlIw4Sz — The Telegraph (@ttindia) October 1, 2022 -
పొల్యూషన్ సర్టిఫికెట్ ఉంటేనే పెట్రోలు
సాక్షి, న్యూఢిల్లీ: మీ వాహనానికి పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) సర్టిఫికెట్ లేనట్లయితే పెట్రోలు పంపు నిర్వాహకులు మీ వాహనంలో ఇంధనం నింపడానికి నిరాకరించే రోజులు త్వరలో రానున్నాయి. బంకు పెట్రోలు పోయించుకోవాలంటే వాహనానికి పీయూసీ సర్టిఫికెట్ తప్పక ఉండాలనే ప్రతిపాదనకు లెప్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ ఆమోదం తెలిపారు. ప్రపంచ నగరాలతో పోలిస్తే ఢిల్లీలో వాయుకాలుష్యం అత్యధికంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక పేర్కొన్న సంగతి తెల్సిందే. దీంతో ఢిల్లీలో కాలుష్య స్థాయిని నియంత్రించేందుకు సిఫారసులు చేసిన ఉన్నత స్థాయి కమిటీ పీయూసీ సర్టిఫికెట్ కలిగిన వాహనంలోనే పెట్రోలు నింపాలన్న నియమం విధించాలని సిఫారసు చేసింది. ఈ నియమాన్ని ఎప్పటి నుంచి అమల్లోకి తేవాలన్నదానిపై అధికారులు ఇంకా నిర్ణయం తీసుకోనప్పటికీ నవంబర్ నెలలో దీనిని అమలు చేయవచ్చని అంటున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసేలోగా నగరంలో తగినన్ని పెట్రోలు పంపులలో పీయూసీ సరిఫికెట్ జారీ చేసే సదుపాయం ఉండేలా చూడాలని అధికారులు యోచిస్తున్నారు. నగరంలోని 80 శాతం పెట్రోలు పంపులలో వాహనాల కాలుష్య స్థాయిని పరీక్షించి పీయూసీ సర్టిఫికెట్ జారీచేసే సదుపాయం ఇప్పటికే అందుబాటులో ఉంది. మిగతా 20 శాతం పెట్రోలు పంపులలో కూడా ఈ సదుపాయం లభించేలా చూడాలని అధికారులు భావిస్తున్నారు. అయితే రద్దీగా సమయాల్లో బంకుల వద్ద పీయూసీ సర్టిఫికెట్లు చూసిన తరువాతే వాహనాలలో పెట్రోలు నింపడం సమస్య కావచ్చని, ఇది కస్టమర్లకు, సిబ్బందికి మధ్య వాదనలకు, ఘర్షణలకు దారితీయవచ్చని యజమానులు అంటున్నారు. పెట్రోలు అత్యవసర సరుకులలో ఒకటని, పీయూసీ లేదన్న కారణంతో పెట్రోలు నింపడానికి నిరాకరించ లేమని ఢిల్లీ పెట్రోలు డీలర్స్ అసోసియేషన్‌కు చెందిన అనురాగ్ నారాయణ్ అంటున్నారు. దీనికన్నా నగరంలో చెక్ పాయింట్లు ఏర్పాటుచేసి తనిఖీలు జరిపి పీయూసీ లేనివాహనం నడిపేవారికి చలాన్లు విధించినట్లయితే మేలని ఆయన సూచించారు. -
పెట్రోలు కావాలా.. సర్టిఫికెట్ చూపించండి!!
మీ వాహనానికి పెట్రోలు గానీ, డీజిల్ గానీ పోయించాలనుకుంటున్నారా? అయితే ఇక మీదట పొల్యూషన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా చూపించాల్సిందే. మీ వాహనం నుంచి వెలువడుతున్న ఉద్గారాలు పరిమితిలోనే ఉన్నాయని ధ్రువీకరించే 'పొల్యూషన్ అండర్ కంట్రోల్' సర్టిఫికెట్ తీసుకొస్తేనే ఇంధనం నింపాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. దేశ రాజధాని నగరంలో కాలుష్యం స్థాయి విపరీతంగా పెరిగిపోవడంతో ఈ నిబంధనను అమలుచేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే శ్రీవాత్సవ నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి మరో రెండు నెలల వరకు సమయం పట్టేలా ఉంది. ఈలోపు ముందు విస్తృతంగా ప్రచారం చేసి, ప్రజల్లో అవగాహన పెంచి అప్పుడు అమలుచేయాలని ఢిల్లీ సర్కారు భావిస్తోంది. ఇందుకోసం ముందుగానే అన్ని పెట్రోలు బంకుల వద్ద కూడా కాలుష్య తనిఖీ వాహనాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. అప్పటివరకు పొల్యూషన్ సర్టిఫికెట్ తీసుకోనివాళ్లు ఆ వాహనం వద్ద తనిఖీ చేయించుకోవచ్చు. ఆ తర్వాత మాత్రమే వాళ్లకు పెట్రోలు లేదా డీజిల్ పోస్తారు.


