breaking news
PNB Housing
-
పేద వర్గాల కోసం పీఎన్బీ సరికొత్త హోమ్ లోన్ స్కీమ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అల్పాదాయ, మధ్య తరగతి వర్గాల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఉన్నతి హోమ్ లోన్ స్కీమ్ ద్వారా ఆకర్షణీయమైన వడ్డీ రేట్లకు గృహ రుణాలు అందిస్తున్నట్లు పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ ఎండీ హర్దయాళ్ ప్రసాద్ తెలిపారు. దీని కింద రూ.35 లక్షల దాకా లేదా ప్రాపర్టీ విలువలో 90 శాతం దాకా (ఉద్యోగులకు), స్వయం ఉపాధి పొందుతున్న వారికి 80 శాతం దాకా రుణం అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. టియర్-1 నగరాల్లో కనిష్టంగా రూ.8 లక్షలు, టియర్-2 నగరాల్లో రూ.6 లక్షల మేర రుణం పొందవచ్చన్నారు. ఇక నగర పరిధిలో 225 చ.అ. లేదా 40 చ.గ.ల్లో ఇంటి నిర్మాణానికి కూడా ఉన్నతి స్కీమ్ ద్వారా లోన్ పొందవచ్చని ప్రసాద్ వివరించారు. ఇంటి వద్దే బీమా పాలసీలు, సర్వీసులు అందించేందుకు పలు బీమా దిగ్గజాలతో కూడా భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఆయన చెప్పారు. చదవండి: చౌక వడ్డీకే హోమ్ లోన్ ఇస్తున్న బ్యాంకులు ఇవే! -
నేడు పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స లిస్టింగ్
రేపు వరుణ్ బేవరేజేస్ న్యూఢిల్లీ: పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స, వరుణ్ బేవరేజేస్ కంపెనీలు ఈ వారంలోనే స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) ప్రమోట్ చేస్తున్న పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స నేడు(సోమవారం), పెప్సికో అతి పెద్ద ప్రాంఛైజీ వరుణ్ బేవరేజేస్ కంపెనీ రేపు(మంగళవారం) స్టాక్ ఎక్సేంజ్ల్లో లిస్ట్ కానున్నాయి. రూ.750-775 ఇష్యూ ధరతో గత నెల 25-27 మధ్యన ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు వచ్చిన పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స కంపెనీ రూ.3,000 కోట్లు సమీకరించింది. ఈ ఐపీఓ 30 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్అయింది. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ (క్విబ్స్)కు కేటాయించిన వాటా 37 రెట్లు, సంస్థాగేతర ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా 86 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా 1.35 రెట్లు చొప్పున సబ్స్క్రైబ్ అయ్యాయి. రూ.440-445 ఇష్యూ ధరతో గత నెల 26-28 మధ్యన ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు వచ్చిన వరుణ్ బేవరేజేస్ కంపెనీ రూ.1,112.5 కోట్లు సమీకరించింది. ఈ ఐపీఓ 1.86 రెట్లు ఓవర్ సబ్స్క్రై బ్అయింది. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్(క్విబ్స్)కు కేటాయించిన వాటా 5 రెట్లు, సంస్థాగేతర ఇన్వెస్టర్లకు కేటయించిన వాటా 42%, రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా 79% చొప్పున సబ్స్క్రైబ్ అయ్యాయి. కాగా ఈ ఏడాది ఇప్పటివరకూ దాదాపు 22 కంపెనీలు స్టాక్ ఎక్సేంజ్ల్లో లిస్టయ్యాయి.