breaking news
pistals
-
స్మగ్లర్ అరెస్ట్.. 100పైగా పిస్టళ్ల స్వాధీనం
న్యూఢిల్లీ: అక్రమంగా ఆయుధాలను తరలిస్తున్న ఓ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 10 పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఉత్తర్ ప్రదేశ్లోని మాథురా ప్రాంతానికి చెందిన రమజాన్గా గుర్తించారు. మధ్యప్రదేశ్లోని బార్వానీ జిల్లా ఉమర్తి గ్రామం నుంచి తెచ్చి అక్రమంగా ఆయుధాలను సరఫరా చేస్తున్నట్లుగా పోలీసులు తెలుసుకున్నారు. పక్కా పథకం ప్రకారం నిందితుడిని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద నున్న డీఎన్డీ ఫ్లైఓవర్ వద్ద పట్టుకున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పీఎస్ కుష్వా తెలిపారు. రమజాన్పై కేసు నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు. యూపీ, హర్యానాతో పాటు పలు ప్రాంతాల్లో మొత్తం 97 సెమీ ఆటోమాటిక్ పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
కలకలం.. బ్యాగు నిండా తుపాకులు
కోల్కతా: రైల్వే స్టేషన్లో ఉన్న ఓ బ్యాగును తనిఖీ చేసిన పోలీసులు షాక్ తిన్నారు. బ్యాగు నిండా తుపాకులు కనిపించడంతో వాటిని స్వాధీనం చేసుకొని విచారణ జరుపుతున్నారు. హౌరా రైల్వే స్టేషన్లో శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు రోజువారి తనిఖీలు నిర్వర్తిస్తుండగా.. ఓ బ్యాగును గుర్తించారు. అనుమానంతో దానిని ఓపెన్ చూసి చూడగా.. 18 తుపాకులు ఉన్నాయి. ఈ బ్యాగును అక్కడకు ఎవరు తీసుకొచ్చారు, ఏదైనా ఉగ్రవాదుల కుట్ర ఉందా అనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. రైల్వే స్టేషన్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.