breaking news
people dies
-
అఫ్గాన్‌లో ఆకస్మిక వరదలు.. 300 మందికి పైగా మృతి
ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్ ఉత్తరప్రాంతంలో శుక్రవారం రాత్రి ఆకస్మికంగా కురిసిన భారీ వర్షాలు, వరదలతో 300 మందికి పైగా ప్రజలు మృతి చెందినట్లు ఐరాస ఆహారం విభాగం తెలిపింది. వెయ్యి వరకు నివాసాలు ధ్వంసం కాగా వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారని పేర్కొంది. బాధితులకు ఆహారం అందజేస్తున్నట్లు శనివారం తెలిపింది. బఘ్లాన్, బాదాక్షాన్, ఘోర్, హెరాట్, టఖార్ ప్రావిన్స్‌ల్లో ఎక్కువ నష్టం సంభవించినట్లు తాలిబన్ ప్రభుత్వం తెలిపింది. బఘ్లాన్‌లో 131 మంది, టఖార్లో 20 మంది మరణించారని వెల్లడించింది. డజన్ల కొద్దీ గల్లంతయ్యారని కూడా తెలిపింది. బఘ్లాన్‌లో వరదల్లో చిక్కుకుపోయిన వారిని వైమానిక దళం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోందని తెలిపింది. 100 మందికి పైగా క్షతగాత్రులను సైనిక ఆస్పత్రులకు తరలించినట్లు రక్షణ శాఖ వివరించింది. -
కాటేసిన కరెంట్
సాక్షి, కరీంనగర్ : పర్యవేక్షణాధికారుల తప్పిదం ఓ హెల్పర్‌కు ప్రాణసంకటంగా మారింది. డబుల్బెడ్రూం కాలనీలో ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ సరఫరా చేయడంతో అదృష్టవశాత్తు ప్రాణాలతో బతికి బయటపడ్డ సంఘటన గురువారం సిరిసిల్ల పట్టణంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక సెస్ పరిధిలోని సిరిసిల్ల టౌన్–2కు కిష్టయ్య హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. మధ్యాహ్నం స్థానిక శాంతినగర్‌లో కొత్తగా నిర్మిస్తున్న డబుల్బెడ్రూం కాలనీలొ ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు చేయాలని ఉన్నతాధికారులు, పర్యవేక్షణాధికారులు ఆదేశించారు. ముందస్తు రక్షణ చర్యలు లేకుండానే అధికారులు కిష్టయ్యను పనులకు పంపించినట్లు సిబ్బంది తెలిపారు. కిష్టయ్య ట్రాన్స్ఫార్మర్పై పని చేస్తుండగా హఠాత్తుగా కరెంటు సరఫరా కావడంతో షాక్‌కు గురై కిందపడిపోయాడు. వెంటనే స్థానికులు ఏరియాస్పత్రికి తరలించగా..చికిత్స చేస్తున్నారు. ఏలాంటి రక్షణ చర్యలు చేపట్టకుండా హెల్పర్‌ను పనులకు పంపించడంపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సెస్ ప్రాతినిధ్య సభ్యుడు, తదితరులు డిమాండ్ చేశారు. కిష్టయ్యకు ప్రాణహాని జరిగితే బాధ్యులెవరని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యుదాఘాతంతో మహిళ మృతి ధర్మపురి: స్నానం కోసమని బాత్రూంలోకి వెళ్లగా మీటరువైరుకు ప్రమాదవశాత్తు చేయి తగలడంతో విద్యుదాఘాతానికి గురై మహిళ మృతి చెందిన సంఘటన కోస్నూర్‌పల్లెలో విషాదం నింపింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని జైనా గ్రామానికి చెందిన బోర్లకుంట లక్ష్మి(55) గురువారం స్నానం చేయడానికి బాత్రూమ్కు వెళ్లింది. స్నానం చేసే ప్రయత్నంలో బాత్రూమ్లో ఉన్న మీటరు వైరు చేతికి తగిలి ఎర్త్ రాగా విద్యుదాఘాతానికి గురైంది. గమనించిన కుటుంబ సభ్యులు ధర్మపురికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలికి భర్త రాజలింగం ఇద్దరు కుమారులు, కూతురు ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై వహీద్ తెలిపారు. బాధితురాలిది నిరుపేద కుటుంబమని, ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. ఎల్లారెడ్డిపేటలో వృద్ధుడు.. ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేటకు చెందిన ఓలాద్రి పద్మారెడ్డి (68) బుధవారం రాత్రి విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. ఈ సంఘటన గ్రామంలో విషాదం నింపింది. గురువారం సంఘటన స్థలాన్ని ఎస్సై ప్రవీణ్‌కుమార్ పరిశీలించారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం..రాత్రి ఇంట్లో లైట్ వెలగడం లేదని ఓల్డర్‌ను పట్టుకొని బల్బును పరిశీలిస్తుండగా షాక్‌కు గురయ్యాడు. షాక్‌తో కిందపడ్డ పద్మారెడ్డిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఇంట్లో చిన్న బల్బును సరిచేస్తున్న క్రమంలో నిండుప్రాణం పోవడంపై కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడి భార్య హేమలత అనారోగ్యంతో పదేళ్ల క్రితం మృతిచెందింది. సంఘటన స్థలాన్ని తోట ఆగయ్య, చీటి లక్ష్మణ్‌రావు, హసన్ సందర్శించి కుటుంబసభ్యులను పరామర్శించారు. కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. మానాలలో వలస కూలీ.. చందుర్తి (వేములవాడ): విద్యుదాఘాతంతో వలస కూలీ మృతి చెందిన సంఘటన రుద్రంగి మండలం మానాల గ్రామంలో గురువారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని మరవల్ కడ్‌విట్ గ్రామానికి చెందిన దినేష్‌సంతుసకుమ్(22) విద్యుత్ సబ్‌స్టేషన్‌లో కెపాసిటర్ల ఇన్‌స్టాలేషన్స్ పని చేసేందుకు మానాలకు వచ్చాడు. ఇన్స్టాలేషన్ గ్రూపునకు వంట చేసే పనిలో నిమగ్నమైన దినేష్‌సంతుసకుమ్‌కు పక్కనే ఉన్న విద్యుత్ వైరు తగిలి షాక్‌కు గురయ్యాడు. గమనించిన సదరు సిబ్బంది వెంటనే విద్యుత్ వైరు తొలగించారు. ప్రాజెక్టు అధికారి శ్రీనివాస్ వైద్యం కోసం బాధితుడిని కోరుట్ల పట్టణానికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. ప్రాజెక్టు అధికారి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
మృత్యుఘోష
♦ డెంగీ, విషజ్వరాలతో ప్రాణాలు కోల్పోతున్న చిన్నారులు ♦ 9 రోజుల్లో 8 మంది మృతి...వందలాది మంది ఆస్పత్రుల పాలు ♦ డెంగీ కాదంటూ అధికారుల బుకాయింపు ♦ సీజనల్ వ్యాధులతో ఇప్పటి వరకూ 34 మంది మతి ♦ నష్టనివారణ చర్యల్లో ప్రభుత్వం ఘోర వైఫల్యం సాక్షిప్రతినిధి, అనంతపురం : అనంతపురంలోని వినాయక్‌నగర్‌కు చెందిన మహ్మద్ ఇద్రిస్(12), మహ్మద్‌లతీఫ్ జునైద్(9) అనే చిన్నారులు ఈ నెల 15న మృతిచెందారు. వీరికి 15రోజుల కిందట జ్వరం వచ్చింది. స్థానికంగా ఓ ఆర్ఎంపీ వద్ద చికిత్స చేయించారు. అయినా తగ్గకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు డెంగీ సోకిందని నిర్ధారించి బెంగళూరుకు సిఫార్సు చేశారు. బెంగళూరులోని రెయిన్బో ఆస్పత్రి వైద్యులు కూడా రక్తకణాల సంఖ్య తగ్గిందని నిర్ధారించారు. ప్లేట్లెట్లు ఎక్కించారు. అయినప్పటికీ పరిస్థితి విషమించి చిన్నారులు చనిపోయారు. ప్లేట్లెట్లు ఎక్కించారంటే డెంగీ అనేది స్పష్టంగా తెలుస్తోంది. కానీ అధికారులు అదేమీ కాదంటూ బుకాయిస్తున్నారు. వీరిద్దరే కాదు.. గత తొమ్మిది రోజుల్లో డెంగీ, విషజ్వరాలు, డయేరియాతో జిల్లా వ్యాప్తంగా ఎనిమిది మంది మత్యువాతపడ్డారు. వీరిలో ఏడుగురు చిన్నారులే. ఈ సీజన్లో ఇప్పటిదాకా 34మంది ప్రాణాలు కోల్పోయారు. జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో రోజూ ఎక్కడో ఒకచోట మత్యుఘోష వినిపిస్తూనే ఉంది. అధికారులు మాత్రం నష్టనివారణ చర్యలకు ఉపక్రమించడం లేదు. ప్రభుత్వ ఆస్పత్రులలో నాణ్యమైన చికిత్సను అందించడం లేదు. పైగా డెంగీ కాకుండా హైఫీవర్, నిమోనియాతో చనిపోయారంటూ తప్పదాటు వైఖరి అవలంబిస్తున్నారు. జ్వరంతో చిన్నారులు చనిపోతే వైద్య, ఆరోగ్య శాఖకు తెలిపిన తర్వాతే ఆ సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలపాలని ప్రభుత్వ వైద్యశాలలతో పాటు ప్రైవేటు క్లినిక్‌లకు అధికారులు మౌఖికంగా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అనంతపురం సర్వజనాస్పత్రి వైద్యులకు కూడా ఈ ఆదేశాలు అందినట్లు తెలిసింది. డెంగీ దోమకాటుతో వస్తుంది. డెంగీ అని నిర్ధారిస్తే పారిశుద్ధ్యలోపం తెరపైకి వస్తుంది. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. దీనివల్లే డెంగీతో మతి కేసులను నిర్ధారించడం లేదు. స్పష్టంగా తెలుస్తున్నా.. డెంగీ సోకితే రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య 20వేల కంటే తగ్గి, రక్తస్రావ లక్షణాలు కనిపిస్తాయి. రక్తంలోని ప్లాస్మా బయటకు లీకయ్యే ప్రమాదముంది. అలా జరిగితే రక్తం చిక్కబడి బీపీ తగ్గుతుంది. రక్తకణాలు లక్షకన్నా తగ్గి ప్యాక్డ్ సెల్వాల్యూమ్(పీసీవీ) ఉండాల్సిన దానికంటే 20శాతం పెరిగితే రక్తస్రావం లేకున్నా డెంగీగా భావించాల్సి ఉంటుంది. అనంతపురానికి చెందిన ఇద్దరు చిన్నారులకు ప్లేట్లెట్లు తగ్గిపోయాయి. మూడు రక్తపరీక్షలు నిర్వహించగా.. ఒకటి డెంగీ పాజిటివ్ అని వచ్చింది. అయినప్పటికీ ‘అనంత’ అధికారులు డెంగీగా నిర్ధారించలేదు. ప్రైవేటు క్లినిక్‌లు కూడా డెంగీతో మతి చెందారని సర్టిఫికెట్లు ఇస్తే ఆస్పత్రిపై ప్రభావితం చూపుతుందన్న ఉద్దేశంతో వేరే కారణాలు రాస్తున్నట్లు సమాచారం. హిందూపురం ఆస్పత్రిలో ఈ నెల 20న చిన్నారి నవిత (4) ప్లేట్లెట్లు తగ్గిపోయి డెంగీ లక్షణాలతో చనిపోయినా వైద్యులు మాత్రం ‘హైఫీవర్ విత్ ఫిట్స్’ అని రాశారు. బాధ్యత నుంచి తప్పించుకుంటూ.. అనంతపురం సర్వజనాస్పత్రిలో 148మంది జ్వరంతో చికిత్స పొందుతున్నారు. వీరిలో 20మందికి డెంగీ ఉంది. వీరిలో 11మంది చిన్నపిల్లలే. అనంతపురంలోని ఆదర్శనగర్‌కు చెందిన ప్రభు అనే చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలుకు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. హిందూపురం జిల్లా ఆస్పత్రిలో 53మంది జ్వరాలతో చికిత్స పొందుతుండగా.. వీరిలో ఇద్దరు డెంగీ బాధితులు ఉన్నారు. అనంతపురంలోని ప్రైవేటు క్లినిక్‌లలో కూడా డెంగీతో పలువురు చికిత్స పొందుతున్నారు. సర్వజనాస్పత్రి సామర్థ్యం 350 పడకలు. కానీ వెయ్యిమందికిపైగా చికిత్స తీసుకుంటున్నారు. ఇక్కడ ల్యాబ్‌లో రక్తపరీక్షలు చేసేందుకు సిబ్బంది కొరత వేధిస్తోంది. వైద్యులు, వైద్య సిబ్బంది కొరత కూడా రోగుల పాలిట శాపంగా మారింది. డెంగీ మరణాలు లేవు: డాక్టర్ వెంకటరమణ, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి ఇప్పటి వరకూ ఒక్కరూ డెంగీతో చనిపోలేదు. డెంగీతో చనిపోయినా హైఫీవర్‌తో అని సర్టిఫికెట్లు ఇవ్వాలంటూ మేం ఎలాంటి ఆదేశాలూ జారీచేయలేదు. డెంగీతో చనిపోతే ఆ విషయాన్నే నిర్ధారిస్తాం. డెంగీ బాధితుల కోసం ప్రత్యేకవార్డులు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నాం. ఇటీవల చనిపోయిన చిన్నారుల వివరాలు పేరు చనిపోయిన తేదీ చిరునామా మతికి కారణం మహ్మద్ ఇద్రిస్(12) 15–9–2016 వినాయక్‌నగర్, అనంతపురం డెంగీ మహ్మద్‌లతీఫ్(9) 15–9–2016 వినాయక్‌నగర్, అనంతపురం డెంగీ నవిత (4) 20–9–2016 కెరసానిపల్లి, మడకశిర తీవ్ర జ్వరం యక్షిత(3) 21–9–2016 పాపసానిపల్లి, మడకశిర తీవ్రజ్వరం వెంకటలక్ష్మి(6నెలలు) 21–9–2016 పాతకల్లూరు, గార్లదిన్నె డయేరియా శ్రీజ(15) 22–9–2016 ధర్మవరం టౌన్ డెంగీ నందకిషోర్(3) 22–9–2016 చెన్నంపల్లి, బీకేసముద్రం తీవ్ర జ్వరం ఆదిలక్ష్మి(35) 23–9–2016 కుసుమవారిపల్లి, ఓడీచెరువు తీవ్ర జ్వరం ––––––––––––––––––––––––––––––––––––––