breaking news
Penchal Das
-
Theppa Samudram: కంటతడి పెట్టిస్తున్న పెంచల్ దాస్ పాట
చైతన్య రావు, అర్జున్ అంబటి హీరోలుగా, కిశోరి దాత్రక్ హీరోయిన్ గా రవిశంకర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం తెప్ప సముద్రం. సతీష్ రాపోలు దర్శకత్వంలో బేబీ వైష్ణవి సమర్పణలో శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నీరుకంటి మంజులా రాఘవేందర్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి పి. ఆర్ సంగీత దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందు రాబోతుంది. ఈ చిత్రం నుంచి పెంచల్ దాస్ రాసి, పాడిన "నా నల్లా కలువా పువ్వా" సాంగ్ విడుదల చేశారు మేకర్స్. కొంతమంది మృగాల చేతిలో అమ్మాయిలు ఎలా బలైపోతున్నారో వారికోసం కుటుంబం పడుతున్న బాధలు, రోదనలు ఈపాటలో మనసుని కదిలించేలా చూపించారు. సాంగ్ ఆద్యంతం చాలా ఎమోషనల్ గా సాగింది. -
హృదయాలను హత్తుకుంటున్న పెంచలదాస్ కొత్త పాట
జబర్దస్త్ ఫేం సతీష్ బత్తుల దర్శకత్వంలో శివ కుమార్, హుమయ్ చంద్, అక్షత శ్రీధర్, అర్చన హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చత్రం ‘ఆకాశవాణి విశాఖపట్టణ కేంద్రం’. మిథున ఎంటర్టైన్మెట్స్ ప్రై.లి సమర్పణలో సైన్స్ స్టూడియోస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎం.ఎం. అర్జున్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థ్రిల్లింగ్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ , హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదల చేస్తున్నారు. కార్తీక్ కొడకండ్ల సంగీతం అందించిన ఈ సినిమా నుంచి రెండో పాటని శనివారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘మా కలల పంటగా..పుడితివే కొడుకుగా’అంటూ ఈ సాంగ్ ని ప్రముఖ గాయకుడు, రచయిత పెంచలదాస్ రాసి... ఆలపించారు. ఈ సందర్భంగా నిర్మాత ఎం.ఎం.అర్జున్, దర్శకుడు సతీష్ మాట్లాడుతూ .. ‘ఈ సినిమా కథ యూనివర్సల్ పాయింట్ కావటంతో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నాం.పెంచలదాస్ రాసి, పాడిన పాటకి మంచి ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నాం.గతంలో ఆయన పాడిన అరవింద సమేత, కృష్ణార్జున యుద్ధం చిత్రాల సాంగ్ కి ఎంత మంచి పేరు వచ్చిందో... ఈ సాంగ్ కి అంతే స్థాయిలో పేరు రావడం ఖాయం’ అని అన్నారు.