breaking news
peddapadu
-
దళితులపై చింతమనేని కక్ష సాధింపు
-
పెద్దపాడులో దారుణ హత్య
- వివాహేతర సంబంధమే కారణమా? కల్లూరు/గూడూరు రూరల్: కల్లూరు మండలం పెద్దపాడు గ్రామానికి చెందిన గాండ్ల దేవేంద్ర (37)ను బండరాళ్లతో తలపై మోది గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల ప్రాంతంలో జరిగింది. అయితే సోమవారం ఉదయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఉదయం పొలం పనులకు వెళ్లిన వారు.. వేపచెట్టుకింద రక్తపు మడుగులో ఉన్న వ్యక్తిని చూసి గ్రామ పెద్దకు తెలియజేశారు. గ్రామ పెద్ద.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కర్నూలు తాలూకా సీఐ నాగరాజుయాదవ్, కె.నాగలాపురం ఎస్ఐ మల్లికార్జున ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడు పెద్దపాడు గ్రామవాసి గాండ్ల దేవేంద్రగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు. డాగ్ స్క్వాడ్‌తో గాలింపు చర్యలు చేపట్టారు. భార్య జయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. హతునికి ఒక కుమారుడు, కుమార్తె ఉంది. కుమారుడు యశ్వంత్ పదో తరగతి చదివాడు. కుమార్తె మౌనిక ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. వివాహేతర సంబంధమే ఊపిరితీసిందా? గాండ్ల దేవేంద్ర.. కర్నూలు బళ్లారి చౌరస్తాలోని మారుతి రైస్ మిల్లులో సూపర్వైజర్గా పని చేస్తున్న సమయంలో బిల్డింగులకు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే హత్య జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక ప్రమాదంలో కాలికి గాయాలు కావడంతో స్టీల్ రాడ్ వేయించుకున్న దేవేంద్ర ఎక్కువ దూరం నడవలేడు. ఈ పరిస్థితిలో గ్రామ శివారులోకి ఎలా వెళ్లగలిగాడనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. పక్కా ప్రణాళికతో ఫూట్‌గా మద్యం తాగించి ప్లాట్లకు వేసిన రెండు నంబర్ రాళ్లతో తలపై బాది హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. పోలీసుల దర్యాప్తులో పూర్తి వివరాలు వెలుగుచేసే అవకాశం ఉంది. -
రైతులే బలి
సాక్షి, కర్నూలు: కొత్త మార్కెట్‌యార్డు నిర్మాణం రైతులకు శాపంగా మారుతోంది. ప్రజా ప్రయోజనాలను అధికారులు పూర్తిగా విస్మరిస్తున్నారు. నాయకుల ఆదేశాలే వీరికి వేదవాక్కుగా మారుతున్నాయి. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేని విధంగా సమస్య పరిష్కారానికి అవకాశం ఉన్నా.. ఆ దిశగా ప్రయత్నించకపోవడం విమర్శలకు తావిస్తోంది. కర్నూలు నగరంలో ఆర్టీసీ బస్టాండ్ ఎదుటనున్న మార్కెట్ యార్డును రద్దీతో పాటు పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకొని నగర శివారులోకి మార్పు చేయాలని నిర్ణయించారు. ఇందుకు ప్రభుత్వం అనుమతివ్వడంతో పనులు ఊపందుకున్నాయి. ఈ నెల 5వ తేదీన భూమి పూజకు రంగం సిద్ధమవుతోంది. ఉల్చాల రోడ్డులోని పెద్దపాడు గ్రామం వద్ద 113 ఎకరాల విస్తీర్ణంలో కొత్త యార్డు నిర్మాణానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలోని భూముల ధర రూ.కోట్లలో ఉండగా.. ప్రస్తుతం అతి తక్కువ ధరతో సేకరణకు ప్రయత్నాలు కొనసాగుతుండటాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. వాస్తవానికి లక్ష్మీపురం గ్రామంలోని సర్వే నంబర్.1లో 100 ఎకరాల సీలింగ్ భూమి మార్కెట్ యార్డు నిర్మాణానికి అనుకూలమని గతంలో అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. కానీ, ప్రజాప్రతినిధుల జోక్యంతో నిర్మాణం పెద్దపాడు ప్రాంతానికి మారింది. ఈ మేరకు అధికారులు కొత్త యార్డు నిర్మాణంలో భాగంగా భూ సేకరణకు ఉపక్రమిస్తున్నారు. కోడుమూరు నియోజకవర్గం మునగాలపాడు పరిధిలోకి వచ్చే సర్వే నంబర్ 197లో ఉన్న 14.69 ఎకరాలతో పాటు పాణ్యం నియోజకవర్గ పరిధిలోని 94, 95, 96, 97, 98, 99, 100, 103 నుంచి 107 సర్వే నంబర్లలో యార్డు నిర్మాణం చేపట్టేందుకు.. దారి కోసం 101, 111, 141, 142, 143, 147 సర్వే నంబర్లను పరిశీలిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ఎకరా భూమి ధర కోటి రూపాయల పైమాటేనని రైతులు చెబుతున్నారు. ఇక్కడికి సమీపంలోని ఓ ఎకరా పొలం ఇటీవల రూ.35 లక్షలకు రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రజావసరాల నిమిత్తం భూములు సేకరించే సమయంలో నిబంధనల ప్రకారం నోటిఫికేషన్‌కు మూడేళ్ల క్రితం జరిగిన రిజిస్ట్రేషన్ విలువలను భూసేకరణ అధికారి పరిగణనలోకి తీసుకుంటారు. ఆ ప్రకారం భూముల ధర నిర్ణయించాల్సి ఉంది. అయితే ప్రస్తుత వ్యవహారం అందుకు భిన్నంగా సాగుతున్నట్లు సమాచారం. ఒకవేళ గత మూడేళ్లలో రిజిస్ట్రేషన్ విలువ అధికంగా ఉంటే.. బూస్ట్సేల్గా చూపి భూములను వీలైనంత తక్కువ ధరకే కొనుగోలు చేసేందుకు అధికారులు శతవిధాల ప్రయత్నిస్తున్నారనే చర్చ జరుగుతోంది. విషయం తెలుసుకున్న రైతులు కొందరు కోర్టును ఆశ్రయించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో అధికారులు సంబంధిత రైతులతో చర్చలకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. నయానో భయానో వారిని ఒప్పించి ముందుగానే అంగీకార పత్రాలు తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా రైతుల కోసం నిర్మిస్తున్న మార్కెట్‌కు అదే రైతులను బలి పెట్టడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు.