PeddaKothapalli
-
విషాదం..ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి
నాగర్ కర్నూల్: జిల్లాలోని పెద్ద కొత్తపల్లిలో విషాదం చోటు చేసుకుంది పోతినేని చెరువులో ఈతకు దిగిన ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు.సరదాగా స్నానం కోసమని వెళ్లిన ఆ చిన్నారులను పోతినేని చెరువు మింగేసింది. మృతి చెందిన చిన్నారులు గణేష్ రెడ్డి (13) రక్షిత (10) శ్రావణ్ (7) లుగా గుర్తించారు. ముగ్గురు చిన్నారులు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో గ్రామంలో తీవ్ర విషాదచ్చాయలు అలుముకున్నాయి.చిన్నారులు గల్లైంతన తర్వాత సహాయక చర్యలు చేపట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. ముగ్గురు మృతదేహాలను మాత్రమే చెరువు నుంచి బయటకు తీయడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.గతవారం అన్నమయ్య జిల్లాలో తంబళ్లపల్లె నియోజకవర్గంలో మొలకలచెరువు నలుగుర్ని మింగిసేన సంగతి తెలిసిందే. మొలకలచెరువు పెద్దచెరువు వద్ద తల్లిదండ్రులతో కలిసి బట్టలు ఉతకడానికి లావణ్య (12) నందకిషోర్ (10)లు అక్కడికి వచ్చారు. చెరువులో దిగుతుండగా మునిగిపోతున్న సమయంలో చిన్నారులు కేకలు వేశారు.అక్కడే ఉన్న లావణ్య తండ్రి మల్లేష్ చిన్నారులను రక్షించే క్రమంలో మునిగిపోయాడు. చిన్నారులు లావణ్య, నంద కిషోర్ లతో కలిసి పక్కంటి చిన్నారి నందిత(11) కూడా చెరువులో దిగి మునిగిపోయింది. -
ఊరంతా షాక్.. మహిళ మృతి
పెద్దకొత్తపల్లి (కొల్లాపూర్): ఊరంతా షాక్ రావడంతో.. ఓ మహిళ మృతి చెందింది. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కొత్తపేటలో శనివారం ఈ సంఘటన చోటుచేసు కుంది. కొత్తపేటకు చెందిన పెద్ద శంకరయ్య, శంకరమ్మల మూడో కూతురు పద్మజ(38)ను పదేళ్ల క్రితం బిజినేపల్లి మండలం గంగారం గ్రామానికి చెందిన గుంటి నిరంజన్‌కి ఇచ్చి వివాహం చేశారు. అయితే తల్లిగారింటికి వచ్చిన పద్మజ శనివారం ఉదయం దుస్తులు ఉతికి.. ఇంటి ముందున్న తీగపై ఆరబెడుతుండగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. పద్మజకు కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పద్మజ భర్త నిరంజన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు హెడ్‌కానిస్టేబుల్ కుర్మయ్య తెలిపారు. ఇదే సమయంలో ఊరంతా షాక్ వచ్చిందని, కొన్ని రోజులుగా ట్రాన్స్ఫార్మర్ వద్ద ఎర్తింగ్ సమస్యతో షాక్ వస్తోందని గ్రామస్తులు తెలిపారు. -
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
పెద్దకొత్తపల్లి : వాహనాలు నడిపే వారు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఎస్ఐ సైదయ్య సూచించారు. ఆదివారం నాయినిపల్లి మైసమ్మ జాతరకు వెళ్లే వాహనాలను పెద్దకార్పుపాముల రోడ్డు వద్ద ఆయన తనిఖీ చేశారు. డ్రైవింగ్ లైసన్స్, రిజిస్ట్రేషన్, ఇతర పత్రాలు లేకుండా వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని సూచించారు. ఈ సందర్భంగా పలువురికి జరిమానాలు విధించారు. తనిఖీలో సిబ్బంది కష్ణ, వెంకటేశ్వర్లు, డానీ తదితరులు ఉన్నారు.