breaking news
PCC Minority Cell
-
'ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలిచింది'
హైదరాబాద్: ముస్లింలను ఓటుబ్యాంకుగా కాంగ్రెస్ పార్టీ ఏనాడు చూడలేదని కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ అన్నారు. సెక్యులర్ పార్టీగా కాంగ్రెస్ వ్యవహరించిందని చెప్పారు. పీసీసీ మైనార్టీ సమ్మేళంలో ఆదివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చిందని గుర్తుచేశారు. ముస్లింలకు రిజర్వేషన్ల అంశంలో దేశానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలిచిందని వ్యాఖ్యానించారు. -
'టికెట్లు ఇవ్వకుంటే కాంగ్రెస్కు రాజీనామా'
హైదరాబాద్: త్వరలో జరగనున్న ఎన్నికల్లో మైనార్టీ సెల్ నేతలకు ఒక లోక్సభ, 12 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు పీసీసీ మైనార్టీ సెల్ ఛైర్మన్ సిరాజుద్దీన్ విజ్ఞప్తి చేశారు. తమకు ఎన్నిసీట్లు ఇస్తున్నారో ఈ నెల 5వ తేదీలోగా చెప్పాలంటూ అల్టిమేటం జారీచేశారు. తామిచ్చిన గడువులోగా స్పందించకుంటే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు దూరంగా ఉంటామన్నారు. టికెట్లు ఇవ్వకుంటే మైనార్టీ నేతలమంతా కాంగ్రెస్కు రాజీనామా చేస్తామని హెచ్చరించారు. గెలుపు, సామాజిక కోణంలో అభ్యర్థుల ఎంపిక ఉంటుందని పొన్నాల లక్ష్మయ్య తెలిపారు.