breaking news
Patlolla Kista Reddy
-
అసెంబ్లీ కమిటీ హాల్లో తెలంగాణ సీఎల్పీ భేటీ
హైదరాబాద్: అసెంబ్లీ కమిటీ హాల్లో గురువారం తెలంగాణ సీఎల్పీ భేటీ అయింది. దివంగత ఎమ్మెల్యే పట్లోళ్ల కిష్టారెడ్డికి తెలంగాణ సీఎల్పీ నివాళులర్పించింది. అనంతరం తాజా రాజకీయ పరిస్థితులపై తెలంగాణ సీఎల్పీ చర్చిస్తుస్తోంది. అయితే కిష్టారెడ్డి మరణంతో నారాణయ్ఖేడ్ ఉప ఎన్నిక ఏకగ్రీవానికి పార్టీలను కాంగ్రెస్ కోరనున్నట్టు సమాచారం. -
నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే కన్నుమూత
-
నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే కన్నుమూత
మెదక్ : మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో గుండెపోటుతో మరణించారు. ఎస్సార్‌నగర్‌లోని స్వగృహంలో నిద్రలో ఉన్న ఆయనకు తీవ్ర గుండె పోటు వచ్చింది. దీంతో ఆయన కన్నుమూశారు. ఆయన వయస్సు 67 సంవత్సరాలు. కిష్టారెడ్డికి భార్య, నలుగురు కుమారులు ఉన్నారు. నారాయణఖేడ్ మండలం పంచగావ్లో కిష్టారెడ్డి జన్మించారు. 1989, 1999, 2009, 2014లో కిష్టారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ పీఏసీ ఛైర్మన్‌గా పటోళ్ల కిష్టారెడ్డి వ్యవహరిస్తున్నారు. గ్రామ సర్పంచ్‌గా రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన ఎమ్మెల్యేగా ఎదిగారు. ఎమ్మెల్యే కిష్టారెడ్డి మృతి పట్ల పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కిష్టారెడ్డి కుటుంబ సభ్యులకు ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతాపం తెలిపారు.