మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డి మంగళవారం హైదరాబాద్లో గుండెపోటుతో మరణించారు. ఎస్సార్నగర్లోని స్వగృహంలో నిద్రలో ఉన్న ఆయనకు తీవ్ర గుండె పోటు వచ్చింది. దీంతో ఆయన కన్నుమూశారు. ఆయన వయస్సు 67 సంవత్సరాలు. కిష్టారెడ్డికి భార్య, నలుగురు కుమారులు ఉన్నారు. నారాయణఖేడ్ మండలం పంచగావ్లో కిష్టారెడ్డి జన్మించారు.