breaking news
patient consult in hospitals
-
అపెండెక్స్ ఆపరేషన్ కోసం వస్తే..
జనగామ: అపెండెక్స్ నొప్పితో ఓ యువకుడు జిల్లా ప్రధాన ఆస్పత్రికి వస్తే.. వైద్యుల నిర్లక్ష్యంతో.. నాలుగు గంటలపాటు బాధితుడు నిరీక్షించిన ఘటన గురువారం రాత్రి జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. లింగాలఘనపురం మండలం కుందారం గ్రామానికి చెందిన ఎం.ఆంజనేయులు, లక్ష్మిల కుమారుడు రాజు(17) అపెండెక్స్ నొప్పితో బాధపడుతుండడంతో మధ్యాహ్నం 3 గంటలకు జనగామలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరిశీలించి అపెండెక్స్‌గా గుర్తించి ఆపరేషన్ చేయాలని తల్లిదండ్రులకు వివరించారు. ఆర్థిక స్థోమత లేకపోవడంతో కుమారున్ని జిల్లా ప్రధాన ఆస్పత్రికి తీసుకు వచ్చారు. అనస్తిషియా(మత్తు డాక్టర్) వైద్యులు లేరు. వరంగల్ తీసుకు వెళ్లండి అంటూ వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సారూ.. పైసా లేదు.. కొడుకు నొప్పి తట్టుకోవడం లేదు..ఇక్కడే ఆపరేషన్ చేయాలని తల్లిదండ్రులు కాళ్లా వేళ్లా పడ్డా కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగడంతో పాటు ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ రఘు, కలెక్టర్ వినయ్‌క్రిష్ణారెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని.. సూపరింటెండెంట్‌ను ఆదేశించడంతో రాత్రి 7.30 గంటలకు ఆపరేషన్ ప్రారంభించారు. పేద కుటుంబాలకు చెందిన రోగులు ఆస్పత్రికి వస్తే.. నిర్లక్ష్యం చేయరాదని కలెక్టర్ మందలించినట్లు తెలిసింది. -
మంచంపై మన్యం
మండలాల వారీగా నమోదైన జ్వరపీడిత కేసులు మండలం పీహెచ్‌సీలు జూలై ఆగస్ట్ పోలవరం 4 480 220 బుట్టాయగూడెం 6 2,800 1,500 జీలుగుమిల్లి 2 484 102 కుకునూరు 2 770 300 వేలేరుపాడు 2 1,000 550 కొయ్యలగూడెం 1 300 450 టి.నరసాపురం 2 489 195 పోలవరం : మన్యసీమ విష జ్వరాలతో వణికిపోతోంది. నిత్యం వందలాది మంది జ్వరాల బారిన పడుతూ చికిత్స కోసం పీహెచ్‌సీలను ఆశ్రయిస్తున్నారు. వైరల్ జ్వరాలతోపాటు టైఫాయిడ్, మలేరియా కేసులు సైతం ప్రమాదకర స్థాయిలో నమోదవుతున్నాయి. అక్కడక్కడా బయటపడుతున్న డెంగీ జాడలు కలవరపెడుతున్నాయి. గిరిజన మండలాలైన పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, కుకునూరు, వేలేరుపాడుతోపాటు ఏజెన్సీని ఆనుకుని ఉన్న జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, టి.నరసాపురం వంటి మైదాన ప్రాంత మండలాల్లోనూ జ్వరాల కేసులు కలవరపెడుతు న్నాయి. పోలవరం నియోజకవర్గంలో 19 పీహెచ్‌సీలు ఉండగా, వేల సంఖ్యలో జ్వరాల కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది జూలైలో 6,023, ఆగస్ట్‌లో ఇప్పటివరకు 3,317 కేసులు నమోదయ్యాయి. వీటిలో 20 నుంచి 30 శాతం టైఫాయిడ్ కేసులు కాగా, పదుల సంఖ్యలో మలేరియా బాధితులు సైతం ఆసుపత్రులకు వస్తున్నారు. వైద్యుల కొరత, రక్త పరీక్ష ఫలితాలు ఆలస్యమవుతుండటంతో ప్రైవే టు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇదిలావుంటే వాతావరణంలో మార్పులతోపాటు పంచాయతీలు రక్షిత మంచినీటి పథకాలను క్లోరినేషన్ చేయకపోవడం, గ్రామాల్లో నీరు నిల్వ ఉన్నచోట పారిశుధ్య పనులు చేపట్టకపోవడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. నీటి నమూనాలు సేకరించి పరీక్షించడం లేదు. నెలకు రెండుసార్లు పరీక్షించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. కాచి చల్లార్చిన నీటి తాగాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రకటనలిస్తూ చేతులు దులిపేసుకుంటున్నారు.