breaking news
Palakurthi assembly candidate
-
మరో అవకాశమివ్వండి: ఎర్రబెల్లి దయాకర్‌రావ
సాక్షి, రాయపర్తి: మరోసారి అవకాశమివ్వండి.. మంత్రినై వచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని టీఆర్ఎస్ పాలకుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. మండలంలోని తిర్మలాయపల్లి, కొండూరు, కొలన్‌పల్లి, కేశవా పురం, గన్నారం, కాట్రపల్లి, బురహాన్‌పల్లి, మొరిపిరాల, గన్నారం గ్రామాల్లో దయాకర్‌రావు శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి దయాకర్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయానని రెండేళ్లలో టీఆర్ఎస్లో చేరాక అభివృద్ధి చేశానన్నారు. తల్లిదండ్రులతోపాటు పిల్లలు సైతం తన గెలుపునకు కృషి చేశారని, యువతకు కోచింగ్ సెంటర్లను పెట్టి ఉద్యోగావకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. లేదంటే రూ.10 లక్షల సబ్సిడీ రుణాలను అందించి వారు ఆర్థికాభివృద్దిని సాధించేలా చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ప్రముఖ గాయని మధుప్రియ దయాకర్‌రావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పాటల ద్వారా వివరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జినుగు అనిమిరెడ్డి, అభివృద్ధి కమిటీ చైర్మన్ నర్సింహానాయక్, సురేందర్‌రావు, ఎంపీపీ విజయ, జెడ్పీటీసీ సభ్యురాలు యాకమ్మ, రంగు కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ నేత ఎర్రబెల్లికి అస్వస్థత
ప్రమాదంలేదు: అపోలో వైద్యులు సికింద్రాబాద్/ పాలకుర్తి (వరంగల్ జిల్లా), న్యూస్‌లైన్: టీడీపీ రాష్ట్ర నేత, వరంగల్ జిల్లా పాలకుర్తి తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు అస్వస్థతకు గురయ్యారు. పాలకుర్తిలో సోమవారం సాయంత్రం ఎన్నికల ప్రచార ముగింపు ర్యాలీలో పాల్గొనేందుకు పార్టీ కార్యాలయానికి చేరుకున్న దయాకర్‌రావు... కార్యకర్తలతో మాట్లాడుతూనే అకస్మాత్తుగా పడిపోయారు. దీంతో కార్యకర్తలు ప్రైవేటు ఆసుపత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ అపోలో ఆస్పత్రికి తరలించారు. దయాకర్‌రావు హృద్రోగ సమస్యతో, షుగర్, బీపీ సమస్యలతో బాధపడుతున్నారని అపోలో వైద్యులు చెప్పారు. ప్రస్తుతం ఎటువంటి ప్రమాదం లేదని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. దయాకర్‌రావు వెంట ఆయన సతీమణి ఉష, కుటుంబ సభ్యులు ఉన్నారు.