breaking news
Paidithalli ammavaru
-
అంబరాన్నంటిన పైడితల్లి సిరిమానోత్సవం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోర్కెలు తీర్చే కల్పవల్లి విజయనగరంలోని పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం మంగళవారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగింది. తొలుత మంగళవారం ఉదయం పైడితల్లి అమ్మవారికి మంత్రి బొత్స సత్యనారాయణ దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వ్రస్తాలు సమర్పించారు. మధ్యాహ్నం 12 గంటలకే సిరిమాను హుకుంపేట నుంచి ఆలయానికి చేరుకుంది. సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు సిరిమానును అధిరోహించారు. మధ్యాహ్నం 3 గంటలకు సిరిమాను కట్టడాలు పూర్తి చేసి, పూజలు చేశారు. 4:30 గంటలకు మూడు లాంతర్లు వద్దనున్న చదురుగుడి నుంచి సిరిమాను రథం బయల్దేరింది. మూడుసార్లు ఆలయం నుంచి కోట వరకూ వెళ్లింది. సిరిమానుపై ఆశీనులైన పూజారి రూపంలో ఉన్న అమ్మవారు పైనుంచి అక్షితలను చల్లి భక్తులను ఆశీర్వదించారు. ఉత్సవం సాయంత్రం 5.56 గంటలకు పూర్తయింది. సిరిమాను తిరుగుతున్నంతసేపూ ఆలయంలోని అమ్మవారికి వేదపండితులు లక్ష పుష్పార్చన చేశారు. సుమారు మూడున్నర లక్షల మంది సిరిమాను ఉత్సవాన్ని వీక్షించినట్లు అధికారులు అంచనావేశారు. విజయనగరం కోటపై నుంచి అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు, జిల్లా సహకార బ్యాంకు ప్రాంగణంలోనుంచి మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సిరిమానును వీక్షించారు. జిల్లా పోలీస్ యంత్రాంగం కమాండ్ కంట్రోల్ ద్వారా నిరంతర నిఘా పెట్టడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సిరిమానోత్సవాన్ని ఆద్యంతం పర్యవేక్షించారు. సిరిమానోత్సవం సందర్భంగా నిర్వహించిన విజయనగరం సాంస్కృతిక ఉత్సవాలు ఆకట్టుకున్నాయి. అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు సిరిమానోత్సవం సందర్భంగా తెల్లవారుజాము నుంచే పలువురు ప్రముఖులు, భక్తులు అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. మంత్రి బొత్స సత్యనారాయణ దంపతులతో పాటు మంత్రి గుడివాడ అమర్నాథ్, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య, కంబాల జోగులు, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్‌బాబు, సినీ నటుడు సాయికుమార్ తదితరులు దర్శించుకున్నారు. -
అక్టోబర్ 31న పైడితల్లి సిరిమానోత్సవం
సాక్షి, విజయనగరం: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, ఇలవేల్పు అయిన శ్రీపైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అక్టోబర్ 31న నిర్వహించనున్నారు. ఈ మేరకు అసిస్టెంట్ కమిషనర్, ఆలయ ఈవో కె.ఎల్. సుధారాణి పూర్తి వివరాలను గురువారం మీడియాకు తెలియజేశారు. అక్టోబర్ 4వ తేదీ ఉదయం 11.00 గంటలకు పందిర రాట వేయటంతో ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుందని పేర్కొన్నారు. స్థానిక వెంకటేశ్వర స్వామి కల్యాణ మండపంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో పైడితల్లి ఉత్సవ తేదీలను ఆమె ప్రకటించారు. తిథి, వార నక్షత్రాలను అనుసరించి నిర్ణయించిన ముహుర్తం ప్రకారం అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15వ తేదీ వరకు నెల రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయని ఈవో సుధారాణి వివరించారు. అక్టోబర్ 30న తొలేళ్ల ఉత్సవం ఉంటుందని, మరుసటి రోజు అక్టోబర్ 31న అంగరంగ వైభవంగా సిరిమానోత్సవం జరుగుతుందన్నారు. అలాగే నవంబర్ 7వ తేదీన పెద్దచెరువు వద్ద తెప్పోత్సవం, 14వ తేదీన ఉయ్యాల కంబాల ఉత్సవం ఉంటుందని వివరించారు. అక్టోబర్ 4వ తేదీ ఉదయం 8.00 గంటలకు చదురుగుడి వద్ద మండల దీక్షలు, అక్టోబర్ 25న అర్ధమండలి దీక్షలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. నవంబర్ 11వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు వనం గుడి నుంచి కలశ జ్యోతి ఊరేగింపు ఉంటుందని వివరించారు. నవంబర్ 15న ఛండీహోమం, పూర్ణాహుతితో వనంగుడి వద్ద దీక్ష విరమణతో ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ అసిస్టెంట్ కమిషనర్, ఆలయ ఈవో కె.ఎల్. సుధారాణి పేర్కొన్నారు. సిరిమాను పూజారి బి. వెంటకరావు, వేదపండితులు రాజేశ్ బాబు, ఆలయ కమిటీ సభ్యులు ఉత్సవాల నిర్వహణ, ఇతర ఏర్పాట్ల గురించి వివరాలు వెల్లడించారు. అనంతరం అందరూ కలిసి ఉత్సవ తేదీలతో కూడిన గోడపత్రికను ఆవిష్కరించారు. సమావేశంలో సిరిమాను పూజారి బి. వెంకటరావు, వేద పండితులు తాతా రాజేశ్ బాబు, దూసి శివప్రసాద్, వి. నర్శింహమూర్తి, ట్రస్టు బోర్డు సభ్యులు పతివాడ వెంకటరావు, వెత్సా శ్రీనివాసరావు, గొర్లె ఉమ, ప్రత్యేక ఆహ్వానితులు ఎస్. అచ్చిరెడ్డి, గంధం లావణ్య, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: తిరుమల: పెరిగిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 7 గంటల సమయం -
విజయనగరం : వైభవంగా పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం
-
విజయనగరం జిల్లాలో ఘనంగా పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు (తెప్పోత్సవం)
-
కన్నులపండువగా శ్రీ పైడితల్లమ్మ సిరిమానోత్సవం
-
విజయనగరం : పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం.. లక్షలాదిగా తరలివస్తున్న భక్తులు
-
అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని ప్రార్థించాను: బొత్స
సాక్షి, విజయనగరం: పైడితల్లి అమ్మవారి ఆశిస్సులు ప్రజలపై ఉండాలని తల్లిని ప్రార్థించినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఉదయం ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు అయిన పైడితల్లి అమ్మవారిని మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం బొత్స మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని తల్లిని ప్రార్థించాను. కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడాలని కోరుకున్నాను. ఒరిస్సా, తెలంగాణ రాష్ట్రాలు నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పైడితల్లి అమ్మవారి పండగను నిర్వహిస్తున్నాము' అని మంత్రి బొత్స అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రాజధానుల కోరిక నెరవేరాలని అమ్మవారిని కోరుకున్నట్లు దేవాదయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. 'పైడితల్లి అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. విజయనగరంలో పండుగ వాతావరణం నెలకొంది. దేవాదాయ శాఖ తరుపున ప్రజలకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు జరిగాయి. రాష్ట్ర ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. సంక్షేమ పథకాల అమలులో ఎటువంటి అడ్డంకులు కలగకూడదని అమ్మవారిని వేడుకున్నట్లు మంత్రి వెల్లంపల్లి తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పైడితల్లి అమ్మవారి తొలేళ్ల ఉత్సవానికి సర్వం సిద్ధం..
సిరుల తల్లి పండగంటేనే ఆనందం. ఉత్తరాంధ్ర ప్రజల ఇష్ట దైవం, భక్తుల కొంగు బంగారం పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాల్లో కీలక ఘట్టమైన తొలేళ్ల ఉత్సవానికి తెర లేచింది. సోమవారం జరగనున్న తొలేళ్ల ఉత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సాక్షి, విజయనగరం టౌన్: భక్తుల కొర్కెలు తీర్చే పైడితల్లి అమ్మవారి తొలేళ్ల ఉత్సవానికి సర్వం సిద్ధమైంది. అమ్మవారి అనుగ్రహంతో వచ్చిన విత్తనాలను వేసి నాగలి(ఏరు)తో తొలిత దున్నాలి. దానినే తొలి ఏరు అని... తొలేళ్లనీ పిలుస్తారు. అమ్మవారి సిరిమానోత్సవానికి ముందు రోజు దీన్ని సంప్రదాయబద్దంగా నిర్వహిస్తారు. పంటకు ఎలాంటి విపత్తులూ, చీడపీడల బాధలూ.. దరి చేరకూడదనేది రైతు కోరిక. వారి కోసం నిర్వహించేదే తొలేళ్ల ఉత్సవం. తొలేళ్ల రోజు రాత్రి చదురు గుడి నుంచి అమ్మవారి ఘటాలను కోటలోకి తీసుకువెళ్లారు. అక్కడ కోటకి పూజలు చేసి, అమ్మవారి ఆశీర్వచనం పొందిన విత్తనాలను బస్తాలతో ఉంచుతారు. సిరిమాను పూజారి చేతుల తో ఆ విత్తనాలను అందించి అమ్మ ఆశీర్వదిస్తుంది. ఆ విత్తనాలను రైతులు తమ బస్తాలలో కలిపి పొలా ల్లో చల్లుతారు, మంచి దిగుబడులు సాధిస్తారు. పండగ శోభ విజయాలకు ప్రతీకగా నిలిచిన విద్యల నగరమైన విజయనగరంలో ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారికి పండగ రోజుల్లో మొక్కుబడులు చెల్లించేందుకు వచ్చే భక్తులతో పండగ శోభ సంతరించుకుంది. రైల్వేస్టేషన్ వద్ద ఉన్న వనంగుడి ప్రదేశం, మూడు లాంతర్లు వద్ద ఉన్న చదురుగుడి ప్రాంతమంతా విద్యుత్ శోభతో అలరాడుతోంది. భక్తులు అమ్మవారికి ఘటాలు సమర్పించడంతో పాటూ పసుపు, కుంకుమలతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. కోవిడ్ నేపథ్యంలో ఆన్లైన్లో సచివాలయ వ్యవస్థ ద్వారా టికెట్లను అందుబాటులో ఉంచారు. ఆలయం వద్దనే రెండు ఆన్లైన్ కౌంటర్లు పెట్టి టికెట్లు అందజేస్తున్నారు. అమ్మవారి ఆలయాన్ని వివిధ రకాల పుష్పజాతులతో సర్వాంగ సుందరంగా అలంకరణ చేసే పనిలో కొంతమంది ఉంటే, ప్రసాదాల తయారీలో మరికొందరు, సేవలకు సిద్ధంగా ఇంకొందరు ఇలా తలా బాధ్యత అమ్మ సేవలో నిమగ్నమయ్యారు. చల్లని తల్లి జాతర అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు జిల్లా ప్రజలు, అధికారులు, నాయకులు సన్నద్ధమయ్యారు. తొలేళ్ల రోజు ప్రధాన ఘట్టాలు ►వేకువ జామున 3 గంటల నుంచి అమ్మ వారికి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు. ఉదయం రాజవంశీకులు, మంత్రులు అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారు. ►రాత్రి 10.30 గంటలకు భాజా భజంత్రీలతో అమ్మవారి ఘటాలకు పూజలు చేసేందుకు కోటలోకి పూజారులు వెళ్తారు. కోటశక్తికి, అమ్మవారి ఘటాలకు పూజాధికాలు నిర్వహిస్తారు. ►ఘటాలను తిరిగి చదురుగుడి వద్దకు తీసుకువచ్చి గుడి ఎదురుగా ఉన్న బడ్డీలా ఏర్పాటు చేసిన వాటిపై ఉంచుతారు. అమ్మవారి దర్శనానికి అవకాశం లేని వారందరూ అక్కడే పసుపు, కుంకుమలను సమర్పించి, మొక్కులు చెల్లిస్తారు. ►ఘటాలను తీసుకువచ్చిన తర్వాత పూజారి అమ్మవారి చరిత్ర చెప్పి రైతులకు ధాన్యాన్ని పంచుతారు. రైతులు ఆ విత్తనాల కోసం బారులు తీరుతారు. నేడు, రేపు మద్యం దుకాణాల బంద్ విజయనగరం అర్బన్: పైడితల్లమ్మ సిరిమాను ఉత్సవం నేపథ్యంలో సోమ, మంగళవారాల్లో విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న సమీపంలోని మద్యం దుకాణాలు మూసి వేయించాలని ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ అధికారులను కలెక్టర్ సూర్యకుమారి ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశా రు. ఉత్సవాలు జరిగే రెండు రోజుల్లో మున్సిపల్ కార్పొరేషన్ పరిధి, నగరాని కి సమీపంలో ఉన్న మద్యం దుకాణాలు, బార్లు, కళ్లు దుకాణాలు తెరవరాదని సూచించారు. శాంతి భద్రత ల కాపాడేందుకు, ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉత్సవ ఏర్పాట్లు పూర్తి అమ్మవారి తొలేళ్లు, పైడితల్లి సిరిమాను ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశాం. జాతర రెండు రోజులు ప్రత్యేక ఆంక్షలు ఉండడం వలన సచివాలయాల్లో అమ్మవారి దర్శనం టికెట్లను అందిస్తున్నాం. పది వేల లడ్డూ ప్రసాదాలను, పులిహోర ప్యాకెట్లను అందుబాటులో ఉంచు తున్నాం. మాస్క్‌లు, శానిౖటైజర్లు అందుబాటులో ఉంచుతున్నాం. – బిహెచ్విఎస్ఎన్.కిశోర్‌కుమార్, ఈఓ, పైడితల్లి అమ్మవారి దేవస్ధానం మూడంచెల పోలీస్ భద్రత సాక్షి, విజయనగరం: పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాల్లో కీలక ఘట్టమైన తొలేళ్లు, సిరిమానోత్సవానికి సంబంధించి మూడంచెల పోలీస్ భద్రత కల్పిస్తున్నట్లు ఎస్పీ ఎం.దీపిక స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ఉత్సవాన్ని శాంతియుతంగా నిర్వహించేందుకు బందోబస్తును 20 సెక్టార్లుగా విభజించి, సుమారు 2,500 మంది పోలీసులను రెండు షిప్టులుగా విధులు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. బందోబస్తులో ఇద్దరు అదనపు ఎస్పీలు, 11 మంది డీఎస్పీలు, 55 మంది సీఐలు/ఆర్ఐలు, 136 మంది ఎస్ఐ/ఆర్ఎస్ఐలు, 414 మంది ఏఎస్ఐ/హెచ్‌సీలు, 652 మంది కానిస్టేబుళ్లు, 144 మంది మహిళా కానిస్టేబుళ్లు, 365 మంది హోంగార్డులు, 105 మంది ఎస్టీఎఫ్ పోలీసు సిబ్బంది, 155 మంది ఆర్మ్డ్ రిజర్వు పోలీసు, 25 మంది పీఎస్ఓలు, 10 మంది బాంబ్ డిస్పోజల్ బృందాలు, 25 మంది కమ్యూనికేషన్ సిబ్బందితో సహా సుమారు 2,500 మంది పోలీస్ అధికారులను, సిబ్బందిని బందోబస్తు నిమిత్తం వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. మొత్తం బందోబస్తును పర్యవేక్షించేందుకు పార్వతీపురం ఓఎస్డీ ఎన్.సూర్యచంద్రరావును నియమించామన్నారు. అదనపు ఎస్పీ (పరిపాలన) పి.సత్యనారాయణరావును కమాండ్ కంట్రోల్ పర్యవేక్షణకు నియమించామని పేర్కొన్నారు. అమ్మవారి సిరిమానోత్సవ బందోబస్తు విధులను నిర్వహించేందుకు విశాఖ సిటీ, రూరల్, శ్రీకాకుళం జిల్లాల నుంచి కూడా పోలీస్ అధికారులు, సిబ్బంది వస్తున్నట్లు తెలిపారు. ప్రజలంద రూ ప్రస్తుత పరిస్థితులను అర్ధం చేసుకుని పోలీసు శాఖకు, ఇతర శాఖలకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. 19న దర్శనాల నిలిపివేత ఈ నెల 19న ఉదయం 11 గంటల నుంచి సిరిమానోత్సవం ముగిసే వరకూ శ్రీ పైడితల్లి అమ్మవారి దేవాలయంలో దర్శనాలు నిలిపివేస్తున్నందున, భక్తులెవరూ ఆ సమయంలో దర్శనాల కోసం ప్రధా న దేవాలయానికి రావద్దని ఎస్పీ సూచించారు. చెక్‌పోస్టుల ఏర్పాటు కోవిడ్ 19 వైరస్ వ్యాప్తి దృష్ట్యా అంతర్ రాష్ట్ర, జిల్లా సరిహద్దుల్లోనూ, అంతర్ మండలాల్లోనూ చెక్‌పోస్టులను ఏర్పాటుచేసి, తనిఖీలు చేపట్టి, వాహనాల రాకపోకలను నియంత్రిస్తామన్నారు. పైడితల్లి సిరిమానోత్సవం రోజున ఎటువంటి వాహనాలను పట్టణంలోకి అనుమతించబోమన్నారు. అమ్మవారి ఆలయం ఎదురుగా తాత్కాలికంగా కమాండ్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. సిరిమాను తిరిగే ప్రాంతాలను, సిరిమాను తీసుకువచ్చే మార్గంలోనూ, ఇతర ముఖ్య కూడళ్లలోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. బందోబస్తు నిర్వహించే పోలీసు సిబ్బందికి బాడీ వార్న్ కెమెరాలను ధరింపజేస్తున్నామన్నారు. భద్రతను నిరంతరం పర్యవేక్షించే విధంగా డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నామన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా ఏర్పాటు చేసి భద్రతను పర్యవేక్షిస్తామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఫాల్కన్ మొబైల్ కమాండ్ కంట్రోల్ వాహనాన్ని కూడా వినియోగిస్తున్నామన్నారు. రూఫ్ టాప్‌లు ఏర్పాటు సిరిమాను తిరిగే మార్గంలో ముందుగా గుర్తించిన 20 ప్రాంతాల్లో రూఫ్ టాప్లలో పోలీసులను నియమించి, నిఘా ఏర్పాటు చేశామని, ఇక్కడ విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది బైనాక్యులర్స్‌తో సిరిమాను తిరిగే ప్రాంతాలను పరిశీలిస్తూ, అవసరమైన సమాచారాన్ని కమాండ్ కంట్రోల్ రూంకు తెలియజేసి పోలీసులను అప్రమత్తం చేస్తారన్నారు. నేరాలను నియంత్రించేందుకు, నేరస్తులను గుర్తించడంలో అనుభవజ్ఞులైన 200 మంది క్రైం సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసినట్లు స్పష్టం చేశారు. అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించేందుకు పోలీసు జాగిలాలతో పాటూ, ప్రత్యేక బాంబ్ స్క్వాడ్ బృందాలను రంగంలోకి దింపుతున్నామన్నారు. భక్తులకు సహాయ, సహకారాలందించేందుకు పోలీసు సేవాదళ్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఏడు ప్రత్యేక బృందాలు అత్యవసర సమయాల్లో తక్షణమే స్పందించేందుకు ఏడు ప్రత్యేక పోలీసు బృందాలను కమాండ్ కంట్రోల్ వద్ద సిద్ధంగా ఉంచుతున్నామని, సిబ్బందికి ఎక్కడ ఏ అత్యవసర పరిస్థితి ఎదురైనా, వేరే పోలీసు సిబ్బంది కోసం వేచి చూడకుండా వీరిని వినియోగిస్తామన్నారు. వాహనాల పార్కింగ్ ప్రాంతాలు అయోధ్య మైదానం, రాజీవ్ స్టేడియం, రామానాయుడు రోడ్డు ట్రాఫిక్ డైవర్షన్ రేపు ►పట్టణంలోని వాహనాలను ఎత్తుబ్రి డ్జి, సీఎంఆర్ జంక్షన్, గూడ్స్‌షెడ్ మీదుగా పట్టణం బయటకు తరలిస్తారు. బాలాజీ జంక్షన్, రామానాయుడు రోడ్డు, సీఎంఆర్ జంక్షన్, గూడ్స్‌షెడ్ మీదుగా పట్టణం వెలుపలకు పంపిస్తారు. ►ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్, బాలాజీ, ఆర్టీసీ కాంప్లెక్స్, ఎత్తుబ్రిడ్జి మీదుగా, కొత్తపేట జంక్షన్, దాసన్నపేట, ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్, ధర్మపురి రోడ్డు మీదుగా బయటకు వెళ్లేందుకు అనుమతిస్తారు. ►జేఎన్టీయూ, కలెక్టరేట్, ఆర్అండ్బీ, ఎత్తుబ్రిడ్జి, ప్రదీప్‌నగర్ మీదుగా, ప్రదీప్‌నగర్ జంక్షన్, ధర్మపురి రోడ్డు, ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్, దాసన్నపేట మీదుగా అనుమతిస్తారు. అమ్మ దర్శనం కోసం... విజయనగరం పూల్‌బాగ్: పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవానికి అంతా సిద్ధమవుతోంది. భక్తులెవరూ సిరిమానోత్సవాన్ని నేరుగా దర్శించే అవకాశం లేకుండా టీవీలు, ఎల్ఈడీలు ద్వారా వీక్షించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవం వరకూ ఆగకుండా ముందుగానే అమ్మవారిని దర్శించుకోవాలన్న పిలుపు మేరకు ఇప్పటికే ఘటాలతో ముందస్తుగానే అమ్మకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. పైడితల్లికి పుష్పార్చన పైడితల్లి అమ్మవారు ఆదివారం ప్రత్యేకాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధానార్చకులు దూసి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో అర్చకులు బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్, మూలా పాపారావు, ఏడిద రమణ ప్రత్యేక కుంకుమార్చన నిర్వహించారు. ఘటాలతో భక్తులు విచ్చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కిశోర్‌కుమార్ పర్యవేక్షించారు. భక్తజనం అమ్మవారి దర్శనానికి ఆదివారం భక్తులు భారీ సంఖ్యలో బారులు తీరారు. చదురుగుడి నుంచి కోట వరకూ, అటు గంటస్థంభం వరకూ భక్తులు బారులు తీరారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, అత్యంత భద్రంగా... భౌతిక దూరం పాటిస్తూనే అమ్మను దర్శించుకుంటున్నారు. మాస్కులు విధిగా ధరిస్తున్నారు. -
సిరిమానోత్సవ ఏర్పాట్లపై మంత్రి బొత్స సమీక్ష
సాక్షి, విజయనగరం: పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవ ఏర్పాట్లపై విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ సమీక్ష జరిపారు. విజయనగర సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉత్సవాలు నిర్వహించాలన్నారు. అక్టోబర్ 12 నుంచి 14 వరకు మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో సాంస్కృతిక, సాహిత్య,క్రీడా కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. అన్నిశాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, బడుకొండ అప్పలనాయుడు పాల్గొన్నారు. చంద్రబాబుకు మతి భ్రమించింది.. చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఆయన ఆదివారం విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ.. గ్రామ సచివాలయం, వాలంటీర్ల ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా నిర్వహించామన్నారు. గోదావరి బోటు ప్రమాదం గురించి ప్రస్తావిస్తూ..బోటు 300 అడుగుల లోతులో ఉండటం వలన వెలికితీత కష్టంగా మారిందని.. జరిగిన దురదృష్ట ఘటనను చంద్రబాబు రాజకీయాలకు వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై అనేక మంది ఇతర పార్టీ నేతలు వైఎస్సార్సీపీలోకి చేరడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. -
కన్నుల పండువగా పైడితల్లమ్మ సిరిమానోత్సవం
-
కన్నుల పండువగా పైడితల్లమ్మ సిరిమానోత్సవం
♦ జై పైడిమాంబ నినాదాలతో మార్మోగిన విజయనగరం ♦ దాదాపు 3 లక్షల మంది హాజరు సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం వాసుల కల్పవల్లి పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం మంగళవారం కన్నుల పండువగా జరిగింది. జై పైడిమాంబ నినాదాలతో విజయనగరం పట్టణం మార్మోగింది. రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన లక్షలాది మంది భక్తుల జయజయధ్వానాల మధ్య అంగరంగ వైభవంగా సిరిమానుపై పూజారి రూపంలో ఉన్న అమ్మవారు ఊరేగారు. ఆలయ ప్రధాన పూజారి తాళ్లపూడి భాస్కరరావు అధిరోహించిన సిరిమాను.. సాయంత్రం 4.28 గంటలకు విజయనగరంలోని అమ్మవారి ప్రధాన ఆలయం నుంచి ప్రారంభమైంది. అంజలిరథం, పాలధార, తెల్ల ఏనుగు, జాలరి వల తదితర ఆధ్యాత్మిక ఘట్టాల వెంట సిరిమానోత్సవం సాగింది. మహరాజ కోట వరకు సిరిమాను మూడుసార్లు తిరిగింది. మధ్యాహ్నం 3.35గంటలకు ప్రారంభం కావల్సిన సిరిమానోత్సవం.. ఆలస్యంగా 4.28గంటలకు ప్రారంభమై సాయంత్రం 6గంటల సమయంలో ముగిసింది. మహరాజ కోట బురుజుపై నుంచి కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు దంపతులు ఉత్సవాన్ని వీక్షించారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులతో విజయనగరం జనసంద్రమైంది. అడుగు వేయడానికి అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది. సిరిమానోత్సవానికి సుమారు మూడు లక్షల మంది భక్తులు హాజరై ఉంటారని అధికారులు అభిప్రాయపడుతున్నారు.