breaking news
Over Dozen Injured
-
భవనం కుప్పకూలి ఆరుగురి కార్మికుల మృతి
-
భవనం కుప్పకూలి ఆరుగురి కార్మికుల మృతి
చండీగఢ్ : భవనం కుప్పకూలిన ఘటన చండీగఢ్‌లో విషాదాన్ని నింపింది. సోమవారం జరిగిన ఈ దుర్ఘటనలో ఆరుగురు కార్మికులు మరణించగా మరో పన్నెండు మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారికి ఆసుపత్రికి తరలించిన పోలీసులు సహాయ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఓ భవన నిర్మాణం కోసం కార్మికులు తవ్వుతుండగా తవ్వకాల ధాటికి పక్కనే ఉన్న మరో భవనం హఠాత్తుగా కుప్పుకూలింది. భవనం కుప్పకూలి కార్మికులపై పడటంతో ఆరుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. భవనం కింద చిక్కుకున్న 14 మందిని వెలికి తీయగా, మరో ఆరుగురు ఇంకా శిథిలాల కిందే ఉన్నట్టు సమాచారం . ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.