breaking news
Open Source Technology
-
భారత్ దిశగా చైనా గూఢచార నౌక
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్ర ఘటన అనంతరం భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ డ్రాగన్ దేశం కపటబుద్ధి మరోసారి బయట పెట్టుకుంది. ఆ దేశానికి చెందిన గూఢచార నౌక ‘ద యాంగ్ యి హవో’ భారత్ దిశగా వస్తోంది. ఈ విషయాన్ని డామియెన్ సిమోన్ అనే ఓపెన్‌సోర్స్ ఇంటెలిజెన్స్ నిపుణుడు తెలిపారు. చైనాకున్న గూఢచార నౌకల్లో ఇదొకటి. వీటిని పరిశోధన నౌకలని చైనా చెప్పుకుంటున్నప్పటికీ, వీటిని నిఘా నౌకలుగానే భారత్ తదితర దేశాలు పరిగణిస్తున్నాయి. శాస్త్రీయ పరిశోధనలతో పాటు పౌర, సైనిక అవసరాలను తీర్చేలా వీటిని రూపొందించారు. సముద్ర జలాల్లో పరిశోధనలు, సముద్ర గర్భం మ్యాపింగ్, ఖనిజ, జీవ వనరుల అన్వేషణ పేరుతో సంచరించే ఈ నౌకలు క్షిపణుల గమనాన్ని ట్రాక్ చేయగలవు, సబ్మెరీన్ల కదలికలను పసిగట్టడం వంటివి చేయగలవు. తాజాగా, మలక్కా నుంచి బయలుదేరిన ఈ నౌక శ్రీలంక దక్షిణ తీరం దిశగా సాగుతున్నట్లు మ్యాప్‌ను బట్టి సిమోన్ విశ్లేషించారు. ఈ నౌకతో ప్రమాదమేమంటే.. ఇందులో మనుషులతో అవసరం లేకుండా సముద్రం అడుగున సంచరిస్తూ నిఘా కార్యకలాపాలను నిర్వహించే వాహనాలుంటాయి. సముద్రం అడుగున మందుపాతరలు, ఇతర సైనిక కార్యకలాపాలను కనిపెట్టి మ్యాపింగ్ చేస్తాయి. భారత్‌లో క్షిపణి పరీక్షలు, ఇతర సైనిక కార్యకలాపాల సమయంలో చైనా నిఘా నౌకలు పొరుగుదేశాలకు చేరుకుని గూఛచర్యం చేయడం ఇటీవలి కాలంలో మామూలై పోయింది. గతేడాది ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అగ్ని–5ను ప్రయోగించిన సమయంలో చైనాకే చెందిన జియాంగ్ యాంగ్ హాంగ్ 01 అనే గూఢచర్య మన దేశ సమీపానికి వచ్చింది. ఒడిశాలోని బాలాసోర్ తీరం వెంబడి క్షిపణి పరీక్షలప్పుడు సైతం చైనా నిఘా నౌకలు తూర్పు తీరానికి సమీపంలోకి వచ్చినట్లు తెలిసింది. విశాఖ తీరంలోని సబ్మెరీన్లలోని అణు క్షిపణుల సిగ్నళ్లను సైతం ఇవి కనిపెట్టే అవకాశముందని సమాచారం. -
టెక్ ఇంద్రజాలం.. టచ్‌లెస్ స్క్రీన్!
స్మార్ట్‌ఫోన్ తనంతట తానే కాల్ చేస్తుంది. రేడియో దానంతట అదే ట్యూన్ అవుతుంది. సౌండ్ మనం కోరుకున్నట్లుగా అడ్జస్ట్ అయిపోతుంది. స్మార్ట్‌వాచ్ నుంచి కంప్యూటర్ వరకూ ఎన్నో పరికరాలను ముట్టుకోవాల్సిన అవసరమే ఉండదు. ఇవన్నీ వాటంతట అవే మనకు కావల్సినట్లే పనిచేస్తాయి! జస్ట్.. మనం చేయవల్సిందల్లా చేతివేళ్లతో గాలిలో సైగలు చేయడమే!! ఒకప్పుడు ఫోన్లు, కంప్యూటర్లు వాడాలంటే టకటకమంటూ బటన్లు నొక్కాల్సిందే. తర్వాత ఇలా ముట్టుకుంటే అలా స్పందించే టచ్స్క్రీన్లు వచ్చేశాయి. అయితే, ఇకపై టచ్స్క్రీన్లపై చేతి వేలితో నొక్కడం, స్వైప్ చేయాల్సిన అవసరం కూడా ఉండబోదు! ఎందుకంటే.. చేతివేళ్లతో సైగలు చేస్తేచాలు.. టచ్ చేసినట్లు స్పందించే టచ్‌లెస్ స్క్రీన్లు త్వరలోనే రాబోతున్నాయి! ఈ టచ్‌లెస్ టెక్నాలజీని సాకారం చేసేందుకు గాను గూగుల్ కంపెనీ ‘ప్రాజెక్ట్ సోలి’ పేరుతో చేపట్టిన ప్రాజెక్టు ఇప్పుడు తుది దశకు చేరుకుంది. ప్రాజెక్ట్ సోలి బృందం ఈ టెక్నాలజీ ప్రాథమిక ఉపయోగాలను కాలిఫోర్నియాలో ఇటీవల జరిగిన సదస్సులో ప్రదర్శించింది. రేడియో స్టేషన్లను మార్చడం, సౌండ్ వాల్యూమ్‌ను పెంచడం, తగ్గించడం, స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ ను పనిచేయించడం వంటివి చేసి చూపింది. ముట్టుకోకుండా ఎలా పనిచేస్తుంది? కెమెరాలు, సెన్సర్ల సాయంతో కదలికలను గుర్తించి పనిచేసే పరికరాలు ఇదివరకే ఉన్నాయి. కానీ వీటిని ఉపయోగించాలంటే ఇతర హార్డ్‌వేర్ పరికరాలు కూడా అవసరం. అందుకే రాడార్‌తో కదలికలను గుర్తించి పనిచేసే మైక్రోచిప్‌ను ప్రాజెక్టు సోలి బృందం తయారు చేసింది. ఈ మైక్రోచిప్‌తో అతిచిన్న పరికరాలకు సైతం టచ్లెస్గా పనిచేసే స్క్రీన్‌ను అమర్చుకోవచ్చు. షూ బాక్స్ అంత సైజులో ఉండే చిన్న రాడార్‌ను ఒక మైక్రోచిప్‌లో అమర్చేంత స్థాయికి వీరు కుదించి తయారు చేశారు. దీంతో బయటికి కనిపించకుండా లోపల ఉంటూనే ఈ రాడర్ ఒక మీటరు పరిధిలో స్పెక్ట్రమ్‌ను ఏర్పర్చి చేతివేళ్ల కదలికలను కచ్చితత్వంతో గుర్తిస్తుంది. స్మార్ట్ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, కంప్యూటర్లు, వేరబుల్ గ్యాడ్జెట్స్, కారు భాగాలు, ఆటబొమ్మల వంటి ఎన్నో పరికరాలకు ఈ టెక్నాలజీని ఉపయోగించవ చ్చని చెబుతున్నారు. ఈ ఓపెన్ సోర్స్ టెక్నాలజీని వివిధ పరికరాలకు ఉపయోగించేందుకు వీలుగా మార్చేందుకు గాను ఈ ఏడాదిలోనే డెవలపర్లకు అప్పగించనున్నారు.