breaking news
One week Extension
-
తెలంగాణ బిల్లుపై చర్చకు మరోవారం గడువు?
-
తెలంగాణ బిల్లుపై చర్చకు మరోవారం గడువు?
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు(తెలంగాణ బిల్లు)పై శాసనసభలో చర్చించేందుకు ఒక వారం మాత్రమే గడువు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వారం గడువు ఇచ్చేందుకే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సుముఖత వ్యక్తం చేశారని సమాచారం. వారం గడువు ఖరారైనట్లు ఢిల్లీ వర్గాలను ఉటంకిస్తూ ఎన్డిటివీ ప్రసారం చేసింది. కేంద్రం 10 రోజులు గడువు పొడిగించమని కోరినా రాష్ట్రపతి వారానికే మొగ్గు చూపారని ఆ టివి తెలిపింది. ఈ ప్రకారం అయితే ఈ నెల 30 లోగా సభలో చర్చ పూర్తి కావాలసి ఉంటుంది. వారం రోజులు గడువు ఇచ్చినట్లు అధికారిక ప్రకటన రేపు వెలువడుతుందని తెలుస్తోంది.