జైల్లో గ్యాంగ్‌వార్:  ఖైదీ మృతి
                  
	న్యూఢిల్లీ:   తీహార్  సెంట్రల్ జైల్లో గ్యాంగ్‌వార్ మరోసారి బహిర్గతమైంది.   బుధవారం  రాత్రి  ఖైదీల ఘర్షణలో  ఒక ఖైదీ హతమయ్యాడు.    పోలీసుల సమాచారం ప్రకారం   జైలు నం. 1 లో  రెండు గ్రూపుల మధ్య తగదాలో  తీవ్రంగా గాయపడిన రవీంద్ర అనే ఖైదీ  డీడీయూ ఆసుపత్రిలో చికిత్స  పొందుతూ చనిపోయాడు.  
	 
	వినోద్, రిహాజ్, అజయ్, సుశీల్, కిరణ్ అనే అయిదుగురు ఖైదీలో   రవీంద్రపై  దాడికి దిగి, పదునైన స్పూన్‌తో  ఎటాక్ చేసినట్టుగా  తెలుస్తోంది. దీంతో జైలు ఆవరణలో ఉద్రిక్తత నెలకొంది. భయోత్సాతం సృష్టించిన ఈ ఘటనపై  తీహార్ జైలు అధికారులు విచారణకు  ఆదేశించారు.