breaking news
occupation of forest land
-
8,208 మంది.. 17,449 ఎకరాల భూమి ఆక్రమణ
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలోని అటవీ భూమిలో పోడు ఆక్రమణ ఎంతో తేలింది. 10 మండలాల్లోని 95 గ్రామ పంచాయతీలకు చెందిన 125 గ్రామాలు, ఆవాసాల్లో ఈ ఆక్రమణ భూమి ఉన్నట్లు అధికార యంత్రాంగం గుర్తించింది. మొత్తంగా 8,208 మంది ఆధీనంలో 17,449 ఎకరాలు ఉందని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి పంపిన నివేదికలో పేర్కొంది. ఈనెల 8 నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. గ్రామసభల ద్వారా ఈ దరఖాస్తుల స్వీకరణ చేపట్టనున్నారు. ఈలోగా ప్రభుత్వం నుంచి వచ్చే గైడ్‌లైన్స్‌తో అధికార యంత్రాంగం దరఖాస్తుల స్వీకరణపై ముందుకెళ్లనుంది. అటవీ భూమి 1.57 లక్షల ఎకరాలు.. జిల్లావ్యాప్తంగా 10.77 లక్షల ఎకరాల్లో భూమి ఉంది. ఇందులో అటవీ విస్తీర్ణం 1,57,888 ఎకరాలు (14.66 శాతం). మొత్తం అటవీ భూమిలో ప్రస్తుతం ఇందులో 17,449 ఎకరాలు ఆక్రమణకు గురైంది. అత్యధికంగా కారేపల్లి (సింగరేణి) మండలంలో 1,510 మంది ఆధీనంలో 4,673.315 ఎకరాలు, ఆ తర్వాత సత్తుపల్లి మండలంలో 2,355మంది చేతిలో 3,208.27 ఎకరాల భూమి ఉంది. 2005 నుంచి ఇప్పటి వరకు 17,861 ఎకరాలకు సంబంధించి అటవీ హక్కు పత్రాలు ఇచ్చారు. ఎఫ్ఆర్సీ కమిటీ పర్యవేక్షణలో.. ఫారెస్ట్ రైట్స్ కమిటీ (ఎఫ్ఆర్సీ) ఆధ్వర్యంలో మొదటిగా గ్రామసభ నిర్వహిస్తారు. ఈ కమిటీకి పోడుదారులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో సంబంధిత అధికార బృందం విచారణ, సర్వే పూర్తి చేస్తుంది. అనంతరం అర్హులు ఎవరన్నది గ్రామసభ తీర్మానం చేసి దరఖాస్తులను సబ్ డివిజన్ లెవెల్ కమిటీకి పంపుతుంది. అక్కడి నుంచి ఈ నివేదిక జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా స్థాయి కమిటీకి చేరుతుంది. ఈ కమిటీ పరిశీలించిన తర్వాత హక్కుపత్రాలను పోడుదారులకు జారీ చేస్తుంది. ఈనెల 8 నుంచి అటవీ భూమి ఆక్రమణకు గురైన 95 గ్రామ పంచాయతీల వారీగా 95 బృందాలు దరఖాస్తులు స్వీకరించనున్నాయి. దరఖాస్తు చేసుకున్న వారిలో ఆర్వోఎఫ్ఆర్ 2005 చట్టం ప్రకారం సాగు చేసుకుంటున్న అర్హులైన పోడుదారులను గుర్తించి హక్కపత్రాలు ఇస్తారు. గిరిజన సంక్షేమ శాఖ ఈ ప్రక్రియను అంతా పర్యవేక్షిస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అటవీ భూమి సంరక్షణకు హద్దులు నిర్ణయిస్తారు. ఈ భూమి సంరక్షణ కోనం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విజిలెన్స్ వింగ్‌ను ఏర్పాటు చేస్తారు. ఎస్టీల ఆధీనంలో 56 శాతం.. జిల్లాలోని 10 మండలాల్లో పోడు భూమి ఉంటే..ఎస్సీ,ఎస్టీ, గొత్తికోయ, ఇతర కేటగిరిలకు చెందిన మొత్తం 8,208 మంది 17,449 ఎకరాలను ఆక్రమించారు. ఇందులో ఎస్టీల చేతిలో అత్యధికంగా 9764 ఎకరాలు ఉండగా.. ఎస్సీలకు 1,602 ఎకరాలు, గొత్తికోయలు ఆధీనంలో 116 ఎకరాలు ఉంది. ఇతర కేటగిరిలకు చెందిన వారు మిగితా అటవీ భూమిని ఆక్రమించుకున్నారు. సుమారు 56 శాతం ఎస్టీల ఆధీనంలోనే ఈ ఆక్రమణకు గురైన భూమి ఉంది. మిగితా 44 శాతం ఎస్సీలు, గొత్తికోయలు, ఇతర కేటగిరిల చేతిలో ఉన్నట్లు అధికారులు ప్రభుత్వానికి పంపిన నివేదికలో పేర్కొన్నారు. గైడ్‌లైన్స్ ప్రకారం చర్యలు.. ప్రభుత్వం పోడు భూములపై దరఖాస్తుల స్వీకరణ, అఖిలపక్ష పార్టీలతో సమావేశంపై జిల్లా యంత్రాంగాలకు గతంలో సూచనలు చేసింది. ఈ ఆదేశాల మేరకు జిల్లాస్థాయిలో కలెక్టర్ నేతృత్వంలో అఖిలపక్ష పార్టీలతో సమీక్ష సమావేశం కూడా పూర్తయింది. అయితే ఈనెల 8 నుంచి దరఖాస్తుల స్వీకరణ, అర్హుల గర్తింపు ప్రక్రియ ఎలా ఉండాలన్న దానిపై ప్రభుత్వం ఇచ్చే గైడ్‌లైన్స్ ప్రకారమే జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోనుంది. పోడుదారులను ఎలా గుర్తించాలన్న దానిపై అఖిలపక్ష పార్టీల నేతలు, ఆదివాసీ సంఘాలు కూడా జిల్లా యంత్రాంగానికి, నేరుగా ప్రభుత్వ పెద్దలకు పలు దఫాలుగా వినతులు అందించారు. ప్రభుత్వ గైడ్‌లైన్స్‌కు అనుగుణంగానే ఎఫ్ఆర్సీ కమిటీలు గ్రామసభ అర్హుల జాబితాను ఫైనల్ చేసి సబ్ డివిజన్ స్థాయి, జిల్లా స్థాయి కమిటీకి పంపనుంది. మండలాల వారీగా ఆక్రమణకు గురైన భూమి (ఎకరాల్లో..), పోడు దారుల సంఖ్య ఇలా ఉంది మండలం పోడుదారులు భూమి సత్తుపల్లి 2,355 3,208.27 కొణిజర్ల 1,575 3,682 సింగరేణి 1,510 4,673.315 పెనుబల్లి 1,182 1,580.8 రఘునాథపాలెం 735 1,795.525 కామేపల్లి 314 988.2275 ఏన్కూరు 282 1,087.975 తల్లాడ 104 270.8 చింతకాని 88 130 వేంసూరు 63 31.75 మొత్తం 8,208 17,448.66 –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– పోడుదారులు భూమి –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– సత్తుపల్లి 3,208.27 కొణిజర్ల సింగరేణి 4,673.315 పెనుబల్లి 1,580.8 రఘునాథపాలెం 1,795.525 కామేపల్లి 988.2275 ఏన్కూరు 1,087.975 తల్లాడ 270.8 చింతకాని 130 వేంసూరు 31.75 ––––––––––––––––––––––––––––––––––––––––––––––– మొత్తం ––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– పొటోరైటప్ 02సీకేఎం01: కొణిజర్ల మండలం గుబ్బగుర్తిలో అటవీ భూమి గూగుల్‌మ్యాప్ -
గూడూరు జెడ్పీటీసీ సభ్యుడి సస్పెన్షన్ !
గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆదేశం అటవీ భూముల ఆక్రమణపై చర్యలు హన్మకొండ అర్బన్ : గూడూరు మండల జెడ్పీటీసీ సభ్యుడు ఎం.డి.ఖాసీంను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఖాసీం అటవీ భూములు ఆక్రమించినట్టు వచ్చిన ఫిర్యాదులపై విచారణ అనంతరం జిల్లా కలెక్టర్ పంపిన నివేదిక ఆధారంగా మంత్రి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గూడూరు మండల పరిధిలో జెడ్పీటీసీ సభ్యుడు ఖాసీం 50ఎకరాల అటవీ భూమి ఆక్రమించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంట్లో 25కరాలు తమ పేరుమీద, మరో 25 ఎకరాలు తన బినామీల పేరుతో ఉన్నట్లు జిల్లా కలెక్టర్ విచారణలో వెల్లడైంది. దీంతో జెడ్పీటీసీ సభ్యత్వం రద్దుతోపాటు కేసుల నమోదుకు జిల్లా కలెక్టర్ సిఫారసు చేశారు. కలెక్టర్ సిఫారసును పరిశీలించిన మంత్రి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. సస్పెన్షన్ అంటే... జెడ్పీటీసీ సభుడిని సస్పెండ్ చేయడం అంటే ఇకపై సదరు సభ్యునికి ప్రొటోకాల్ పాటించరు. అధికారిక కార్యక్రమాలకు మండల స్థాయిలో ఆహ్వానం ఉండదు. జిల్లా పరిషత్ సమావేశాలకు అతనికి ఆహ్వానం, ప్రవేశం ఉండదు. జిల్లాలో ఒక జెడ్పీటీసీ సభ్యుడిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం ఇదే ప్రథమం. ఈ ఘటన రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఖాసీం కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఇటీవల టీఆర్ఎస్లో చేరారు. ఇప్పటికే ఖాసీంపై పలు సెక్షన్ల కింద కేసులు ఉన్నాయి. పార్టీ మారినా ప్రభుత్వ వైఖరి మారకపోవడంతో ఖాసీంకు కష్టాలు తప్పలేదు. -
వాట్ ఎన్ ఐడియా
లింగంపేట, న్యూస్‌లైన్ : అడవులు అంతరించిపోతుండడం, అటవీ భూములు ఆక్రమణలకు గురవుతుండడం, వన్యప్రాణుల సంఖ్య తగ్గిపోతుండడంతో ఆ శాఖ అధికారులపై అనేక విమర్శలు వచ్చాయి. ఎక్కువగా గిరిజనులే అటవీ భూముల ఆక్రమణకు పాల్పడుతున్నారని అధికారులు భావిస్తున్నారు. వారు చెట్లను నరికి, భూములను చదు ను చేసి పంటలు పండిస్తున్నారు. అధికారులు కేసులు పెట్టినా వెనక్కి తగ్గడం లేదు. అటవీ శాఖ అధికారులకు గిరిజనుల భాష రాకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అధికారులు ఏం చెబుతున్నారో.. గిరిజనులు ఏం సమాధానం ఇస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంటోంది. దీంతో గిరిజనులు అధికారులపై దాడులు చేసిన సంఘటనలూ ఉన్నాయి. ఈ పరిస్థితిని నిరోధించడానికి అటవీ శాఖ అధికారులు కసరత్తు చేశారు. వారికి ఓ ఐడియా తట్టింది. అడవులను ఆక్రమిస్తున్న గిరిజనులకే అటవీ భూముల సంరక్షణ బాధ్యత అప్పగిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని భావించారు. వెంటనే బేస్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఒక్కో క్యాంపులో ఐదుగురు నిరుద్యోగ గిరిజనులను ఎంపిక చేసి ఉద్యోగావకాశాలు కల్పించారు. జనవరి నుంచి బేస్ క్యాంపులు పనిచేస్తున్నాయి. గతేడాది అటవీ భూముల ఆక్రమణలు ఎక్కువగా జరిగిన లింగంపేట మండలం ఎక్కపల్లి తండా(ఎల్లారెడ్డి రేంజ్‌లోని బొల్లారం సెక్షన్లో ఉంది)లో అదే తండాకు చెందిన మున్యానాయక్ అనే యువకుడిని టీంలీడర్‌గా నియమించి బేస్ క్యాంపు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇలా జిల్లాలో ఏడు క్యాంపులు పనిచేస్తున్నాయి. అదే విధంగా అటవీ శాఖలో కొత్తగా స్ట్రైకింగ్ ఫోర్స్ పేరిట మరికొన్ని బృందాలను కూడా నియమించారు. ఈ విధానం వల్ల నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంతో పాటు అడవులను, అటవీభూములను, వన్యప్రాణులను సంరక్షించవచ్చన్నది అటవీ అధికారుల ఆలోచన.