breaking news
OBC list
-
జాట్లకు మీరు ద్రోహం చేశారు..
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఢిల్లీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఢిల్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల వేడి పెరుగుతోంది. తాజాగా మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్ అర్వింద్ కేజ్రీవాల్ ‘జాట్’అ్రస్తాన్ని ప్రయోగించారు. ఆ సామాజికవర్గాన్ని కేంద్రం ఓబీసీ జాబితాలో చేర్చాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గురువారం కేజ్రీవాల్ లేఖ రాశారు. ఢిల్లీలోని జాట్లకు ద్రోహం చేశారంటూ ఆ లేఖలో ఆరోపించారు. బీజేపీ ఓటరు జాబితాను తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. అలాగే, ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్న బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మపై చర్యలు తీసుకోవాంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి కేజ్రీవాల్ ఫిర్యాదు చేశారు. మరోవైపు.. ఎన్నికల ముందు కేజ్రీవాల్‌కు జాట్లు గుర్తుకొచ్చారా? అంటూ పర్వేశ్ వర్మ విరుచుకుపడ్డారు. ఢిల్లీలోని జాట్ సామాజిక వర్గం వారిని కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలని ప్రధాని మోదీకి రాసిన లేఖలో కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. రెండు పేజీల లేఖలో జాట్లకు సంబం«ధించి పలు అంశాలను ఆయన పేర్కొన్నారు. ‘ఢిల్లీలోని జాట్లకు మీరు ద్రోహం చేశారు. ఓబీసీ రిజర్వేషన్ల పేరుతో జాట్ వర్గాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదేళ్లుగా మోసం చేస్తోంది. 2015 మార్చి 26న జాట్ నాయకులను ఇంటికి పిలిచి ఢిల్లీలోని జాట్లను ఓబీసీ జాబితాలో చేర్చుతామని మీరు హామీ ఇచ్చారు. 2019 ఫిబ్రవరి 8న హోం మంత్రి అమిత్ షా కూడా జాట్లను కేంద్ర ఓబీసీ జాబితాలోకి తీసుకువస్తానని హామీ ఇచ్చారు. రాజస్థాన్‌లోని జాట్ కమ్యూనిటీ విద్యార్థులు ఢిల్లీ వర్సిటీలో రిజర్వేషన్ పొందుతున్నారు. కానీ, ఢిల్లీలోని జాట్లకు రిజర్వేషన్లు ఎందుకు లభించడంలేదు? ఢిల్లీలోని జాట్ సామాజిక వర్గానికి చెందిన వేలాది మంది పిల్లలు కేంద్ర ఓబీసీ జాబితాలో లేకపోవడంవల్ల ఢిల్లీ యూనివర్సిటీలో ప్రవేశం పొందలేకపోతున్నారు. ఢిల్లీ ప్రభుత్వం రాష్ట్ర ఓబీసీ జాబితాలో వారు ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో జాట్లు ప్రయోజనాలు పొందేందుకు మీ ప్రభుత్వం అనుమతించడం లేదు. మీ ప్రభుత్వ పక్షపాత వైఖరితో ఢిల్లీలోని జాట్లతోపాటు. మరో ఐదు సామాజికివర్గాలకు చెందిన వారు విద్యా, ఉపాధి, ఉద్యోగాల్లో తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు. ఓబీసీ జాబితాలో మార్పులు చేసి ఓబీసీ హోదా ఉన్న ఆయా వర్గాలకు న్యాయం చేయండి. మీ సమాధానం కోసం ఎదురుచూస్తూ ఉంటా’అని లేఖలో కేజ్రీవాల్ పేర్కొన్నారు. పర్వేశ్ వర్మపై చర్యలు తీసుకోండి.. ఈసీకి ఆప్ ఫిర్యాదు న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మపై చర్యలు తీసుకోవాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. గురువారం ఢిల్లీ సీఎం ఆతిశీ, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్ సింగ్, ఎంపీ సంజయ్ సింగ్‌లతో కలిసి కేజ్రీవాల్ ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్‌ను కలిసి రెండు పేజీల ఫిర్యాదును అందజేశారు. హర్ ఘర్ నౌకరీ (ఇంటికో ఉద్యోగం) పేరుతో ఓట్లు అడుగుతూ.. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్న పర్వేశ్‌పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా వర్మ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, ఎన్నికల జాబితాలో బీజేపీ అవకతవకలకు పాల్పడుతోందని సీఎం ఆతిశీ మరో ఫిర్యాదు చేశారు. ‘నేను పోటీ చేస్తున్న న్యూఢిల్లీ నియోజకవర్గంలో గత 15 రోజుల్లోనే కొత్తగా 13 వేల మంది ఓటర్లు చేరారు. అదేవిధంగా, ఓటర్లను జాబితా నుంచి తొలగించాలని 5,500 దరఖాస్తులు ఈసీకి అందాయి. ఇదో భారీ కుట్ర’అని అనంతరం కేజ్రీవాల్ విలేకరులతో అన్నారు. పరేŠవ్శ్ వర్మ ఇంటిపై తక్షణమే ఎన్నికల నిఘా అధికారులు దాడి చేయాలని డిమాండ్ చేశారు. పర్వేశ్ వర్మ మహిళలకు రూ.1,100 బహిరంగంగానే పంచుతున్నారని ఆరోపించారు. ఓటరు జాబితాలో అవకతవలకు పాల్పడుతున్న స్థానిక ఎలక్టోరల్ అధికారులను సస్పెండ్ చేయాలి లేదా బదిలీ చేయాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.ఆప్ సర్కారు పడిపోవాలని వారు కోరుకుంటున్నారు: పర్వేశ్ వర్మ ఎన్నికల ముందు కేజ్రీవాల్‌కు జాట్లు గుర్తుకువచ్చారా? అంటూ బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ మండిపడ్డారు. జాట్లను ఓబీసీ జాబితాలో చేర్చాలన్న కేజ్రీవాల్ డిమాండ్‌పై ఆయనకు కౌంటర్ ఇచ్చారు. ‘ఈసారి ఢిల్లీలో మా ప్రభుత్వం ఏర్పడుతుంది. జాట్ల కోసం కేజ్రీవాల్ ఏమైనా చేసి ఉంటే.. ఎన్నికలకు 25 రోజుల ముందు జాట్లు గుర్తుకువచ్చేవారు కాదు. ఢిల్లీలోని గ్రామీణ ప్రాంతాల్లో జాట్లు మాత్రమే కాదు.. గుజ్జర్లు, యాదవులు, త్యాగులు, రాజ్‌పుత్‌లు కూడా ఉన్నారు. వీరంతా కేజ్రీవాల్ ప్రభుత్వం పడిపోవాలని కోరుకుంటున్నారు’అని పర్వేశ్ వర్మ అన్నారు. -
ఆర్య మరాఠా కులాన్ని ఓబీసీలో చేర్చాలి
- వైఎస్ జగన్‌ను కలసిన ఆర్య మరాఠా సంఘం నేతలు - కేంద్ర బీసీ కమిషన్‌కు సిఫార్సు చేయాలని వినతిపత్రం సాక్షి, హైదరాబాద్: ఆర్య మరాఠా కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చేలా కేంద్ర బీసీ కమిషన్‌కు సిఫార్సు చేయాలని ఆ సంఘం నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆర్య మరాఠా సంఘం నేత జాదవ్ నాగేశ్వరరావు ప్రతినిధి బృందం జగన్‌ను కలసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. ఇప్పటి వరకు బీసీ-డి జాబితాలో కొనసాగుతున్న తమ కులాన్ని ఓబీసీ జాబితాలోకి మార్పించేందుకు కృషి చేయాలని కోరారు. తమ సమస్యపై ప్రతిపక్ష నేత సానుకూలంగా స్పందించారని ఆ సంఘ నేత ఎలోజి నాని జాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ ఖడ్గం, తలపాగాతో జగన్మోహన్రెడ్డిని సత్కరించారు. కార్యక్రమంలో ఆర్య మరాఠా సంఘం నేతలు పద్మశ్రీ సురభి నాగేశ్వరరావు, ముజ్జి శివరామ్, డొలె అంజాబి, ఎల్.చిన్న, ఆర్య మరాఠా కులం కృష్ణాజిల్లా అధ్యక్షుడు పకిడె ధర్మారావు, వైఎస్సార్సీపీ కృష్ణాజిల్లా కార్యదర్శి మోరె వినోద్ పాల్గొన్నారు. -
ఓబీసీ జాబితాలో మరికొన్ని కులాలు
న్యూఢిల్లీ : ఓబీసీ జాబితాలో నూతనంగా మరో 121 కులాలను చేర్చేందుకు కేంద్రమంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన 35 కులాలు, తెలంగాణ ప్రతిపాదించిన 86 కులాలను ఓబీసీ జాబితాలో చేర్చేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓబీసీ జాబితాలో చేర్చడం వల్ల ఆయా కులాల వారు కేంద్ర ప్రభుత్వ విద్యా, ఉద్యోగాలకు సంబంధించిన 27 శాతం రిజర్వేషన్ సౌకర్యం పొందే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం బీసీలుగా గుర్తించిన కులాలలో కొన్ని కులాలు ఒబీసీ కులాల జాబితాలో గుర్తింపు పొందకపోవటంతో కేంద్ర ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్లు ఆయా కులాలకు వర్తించట్లేదు. ఫలితంగా వారు కేంద్ర ప్రభుత్వం ద్వారా అందాల్సిన విద్యా, ఉద్యోగ రిజర్వేషన్ల సౌకర్యాలను కోల్పోతున్నారు. కాగా కేంద్ర ప్రభుత్వ పథకాల కుదింపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నీతి ఆయోగ్ కింద ఏర్పడిన ముఖ్యమంత్రుల బృందం కేంద్ర ప్రభుత్వ పథకాలను పరిశీలించి 30కి తగ్గించాలని సిఫార్సు చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వ పథకాలు 66 నుంచి 30కి తగ్గింపుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది.