breaking news
OBC certificates
-
ఒంటరి తల్లుల సంతానానికి ఓబీసీ సర్టిఫికెట్
న్యూఢిల్లీ: ఒంటరి తల్లుల పిల్లలకు ఓబీసీ(ఇతర వెనుకబడిన కులాల)సర్టిఫికెట్ల జారీకి సుప్రీంకోర్టు అంగీకరించింది. ఇందుకు సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు తెలిపింది. తద్వారా తండ్రి వైపు నుంచి ధ్రువీకరణ పత్రాల అవ సరం లేకుండానే వీటిని మంజూరు చేసేందుకు అవ కాశం ఏర్పడనుంది. ‘ఒంటరి తల్లుల పిల్లలకు ఓబీసీ సర్టిఫికెట్ జారీకి సంబంధించిన చాలా ముఖ్యమైన అంశమిది. ఒంటరి తల్లి ఓబీసీకి చెందిన వారైతే ఆమె కుల ధ్రువీకరణ ఆధారంగా ఆమె పిల్లలకూ ఓబీసీ సర్టిఫికెట్ జారీ చేయాలని పిటిషనర్ కోరుతు న్నారు. ప్రస్తుతమున్న మార్గదర్శకాల ప్రకా రం తండ్రి, లేదా రక్త సంబంధీకులు ఓబీసీకి చెందిన వారైతేనే ఆ పిల్లలకు ఓబీసీ సర్టిఫికెట్ అందజేస్తున్నా రు. దీని వల్ల ఒంటరి తల్లులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు’అని సోమవారం విచారణ సందర్భంగా జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం పేర్కొంది. ‘ఈ అంశం చాలా ముఖ్యమైంది. కొన్ని అంశాలను పరిష్కరించిన తర్వాత మార్గదర్శకాలను జారీ చేస్తాం’అని జస్టిస్ విశ్వనాథన్ వాదనల సందర్భంగా పేర్కొన్నారు. ‘విడాకులు తీసుకున్న ఒక మహిళ పిల్లల ఓబీసీ కులధ్రువీకరణ పత్రం కోసం మాజీ భర్త వద్దకు ఎలా వెళ్లగలదు?’అని ఆయన ప్రశ్నించారు. ఈ పిటిషన్‌పై ఈ ఏడాది ఫ్రిబవరిలో విచారణ చేపట్టిన ధర్మాసనం కేంద్రానికి, ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సోమవారం విచారణ సందర్భంగా అదనపు సొలిసిటర్ జనరల్ సంజయ్ జైన్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున వాదనలు వినిపించారు. 2012 నాటి రమేశ్‌భాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఉదహరించారు. ఒంటరి తల్లుల పిల్లలకు ఓబీసీ సర్టిఫికెట్ల జారీకి సంబంధించిన మార్గదర్శకాలను వెలువ రించాలని విన్నవించారు. ధర్మాసనం ఈ కేసు తదుపరి విచారణను జూలై 22వ తేదీకి వాయిదా వేసింది. -
ఓబీసీ సర్టిఫికెట్ దుమారం: శరద్ పవార్ కౌంటర్
Sharad Pawar నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) వర్గానికి చెందిన వ్యక్తి అంటూ ఒక సర్టిఫికెట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో శరద్‌పవార్ స్పందించారు. కులాన్ని దాచుకోవాల్సిన అవసరం తనకు లేదని, కులాన్ని అడ్డం పెట్టుకుని తాను ఏనాడూ రాజకీయాలు చేయలేదని మంగళవారం ప్రకటించారు. తన కులం ఏంటో ప్రపంచం మొత్తానికి తెలుసు. తాను ఏనాడూ కులం ఆధారంగా రాజకీయాలు చేయలేదు.. చేయను కూడా అని పవార్ ప్రకటించారు. కానీ సమాజంలోని సమస్యలను పరిష్కారం తాను చేయాల్సింది చేస్తానని పవార్ వెల్లడించారు. ఓబీసీ సామాజికవర్గం పట్ల తనకు పూర్తి గౌరవం ఉందని, అయితే తాను పుట్టిన కులాన్ని దాచిపెట్టడం తనకు ఇష్టం ఉండదన్నారు. అయితే మరాఠా కమ్యూనిటీ కోటాపై మాట్లాడుతూ, రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పరిధిలోని దన్నారు. మరాఠాలకు రిజర్వేషన్లపై యువత సెంటిమెంట్ చాలా తీవ్రంగా ఉందని కానీ ఈ విషయంలో నిర్ణయాధికారం మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనన్నారు. ఎన్సీపీ ఎంపీ, పవార్ కుమార్తె సుప్రియా సూలే ఇది నకిలీదని ఇప్పటికే దీన్ని కొట్టిపారేశారు. శరద్ పవార్ 10వ తరగతి చదువుతున్నప్పుడు ఇంగ్లీషు మీడియం స్కూళ్లు ఉండేవా ప్రజలు ఆలోచించాలని ఆమె కోరారు. ఇది ఫేక్ సర్టిఫికెట్ అని శరద్ పవార్ మద్దతుదారు వికాస్ పసల్కర్ గట్టిగా వాదించారు. అసలు శరద్ పవార్ అలాంటి సర్టిఫికెట్ ఏదీ తీసుకోలేదని ఆయన పరువు తీసేందుకు జరుగుతున్న కుట్ర అని మండిపడ్డారు. నాగ్ పూర్ కేంద్రంగా ఇలా జరుగుతోందని పరోక్షంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు. మహారాష్ట్రలో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ ఇటీవల రాష్ట్రమంతటా తీవ్ర హింసకు దారితీసింది. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా మరాఠా సంఘం పెద్దఎత్తున నిరసనలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం వివాదానికి దారి తీసింది. -
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అన్యాయం!
♦ తెలంగాణ ఓబీసీ సర్టిఫికెట్లకు వర్తించని నాన్ క్రీమీలేయర్ కోటా ♦ రాష్ట్ర సర్టిఫికెట్లతో రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఇవ్వని గౌహతి ఐఐటీ ♦ ఐఐటీల్లో ఓబీసీ కోటాలోమన విద్యార్థులు సీట్లు కోల్పోయే ప్రమాదం ♦ రాష్ట్ర బీసీ కులాలకు కేంద్ర జాబితాలో దక్కని చోటు ♦ నేషనల్ బీసీ కమిషన్‌తో సంప్రదించని రాష్ట్ర సర్కారు ♦ తెలంగాణ ఓబీసీ సర్టిఫికెట్లతో అడ్వాన్స్డ్ రాసే వారంతా జనరల్ కోటాలోకే! ♦ ఈనెల 22న అడ్వాన్స్డ్ పరీక్ష సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల (బీసీ) విద్యార్థులు అన్యాయానికి గురయ్యారు! అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్-నాన్ క్రీమీలేయర్ (ఓబీసీ-ఎన్సీఎల్) కోటాలో జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసే అర్హతను వేల మంది బీసీ విద్యార్థులు కోల్పోయారు. రాష్ట్రంలోని బీసీ కులాలపై గతేడాది మార్చి 11న ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం కేంద్ర జాబితాలో చేర్చేలా నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ (ఎన్సీబీసీ) ద్వారా చర్యలు చేపట్టడంలో విఫలమైంది. దీంతో జేఈఈ అడ్వాన్స్డ్ కోసం రిజిస్ట్రేషన్ చేసే సమయంలో తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఓబీసీ నాన్ క్రీమీలేయర్ సర్టిఫికెట్లతో ఓబీసీ-ఎన్సీఎల్ కోటాను ఎంచుకునేందుకు గౌహతి ఐఐటీ విద్యార్థులకు అవకాశం ఇవ్వలేదు. తెలంగాణలోని బీసీ కులాలను కేంద్ర జాబితాలో చేర్చకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. ఓబీసీ కులాలను కేంద్ర జాబితాలో చేర్చితేనే రాష్ట్రాలు జారీ చేసిన ఓబీసీ నాన్ క్రీమీలేయర్ సర్టిఫికెట్లు వర్తింపజేస్తున్నామని పేర్కొంది. అలాంటి వారికే ఓబీసీ-ఎన్సీఎల్ కోటా కింద జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు, అందులో వచ్చే ర్యాంకు ఆధారంగా ఓబీసీ-ఎన్సీఎల్ కోటాలో సీట్లు కేటాయించేందుకు చర్యలు చేపడతామని గౌహతి ఐఐటీ స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రం నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించిన దాదాపు 8 వేల మంది ఓబీసీల్లో 5 వేల మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను ఓబీసీ-నాన్ క్రీమీలేయర్ కోటా లో పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోతున్నారు. అనేక మంది ఓబీసీ-ఎన్సీఎల్ కోటాలో ఐఐటీల్లో వచ్చే సీట్లను కోల్పోవాల్సి పరిస్థితి ఏర్పడింది. జనరల్ కేటగిరీ విద్యార్థులుగా అడ్వాన్స్‌డ్‌కు ఈ నెల 22న జరగనున్న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు రాష్ట్రంలోని ఓబీసీ విద్యార్థులంతా ఓబీసీ-ఎన్సీఎల్ రిజర్వేషన్‌ను కోల్పోయి జనరల్ కేటగిరీలోనే పరీక్షకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఓబీసీ నాన్ క్రీమీలేయర్ సర్టిఫికెట్లు అప్లోడ్ (ఏపీ ఆప్షన్‌ను ఎంచుకున్నవారికే) చేసేందుకు గౌహతి ఐఐటీ అవకాశం కల్పించింది. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 3న ఆఫ్‌లైన్‌లో.. 9, 10 తేదీల్లో ఆన్లైన్లో నిర్వహించిన జేఈఈ మెయిన్ పరీక్షకు 11,94,938 మంది హాజరయ్యారు. తెలంగాణ నుంచి 59,622 మంది, ఏపీ నుంచి 73,026 మంది (మొత్తంగా 1,32,648) పరీక్ష రాశారు. వారి ఫలితాలను (స్కోర్) సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఈ నెల 27న ప్రకటించింది. ఇందులో జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నుంచి 28,951 మందిని ఎంపిక చేసింది. తెలంగాణ విద్యార్థులు దాదాపు 12 వేల మంది ఉన్నట్లు అంచనా. వారిలో బీసీ విద్యార్థులే 8 వేల మంది ఉండగా, ఓబీసీ నాన్ క్రీమీలేయర్ కోటాలో ఐఐటీ సీటు కోసం దరఖాస్తు చేసేవారు 8 వేల మంది వరకు ఉన్నట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. ఎన్సీబీసీకి పంపించాం..: బీసీ కులాల జాబితాను ఎన్సీబీసీకి పంపించామని, వారు వచ్చి రాష్ట్రంలో విచారణ చేసి వెళ్లారని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పేర్కొంటున్నారు. ఎన్సీబీసీ ఇంతవరకు రాష్ట్రంలోని బీసీ కులాలను కేంద్ర జాబితాలో చేర్చలేదు. ఎన్సీబీసీ వెబ్సైట్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఎన్సీబీసీ వెబ్సైట్లో కేంద్ర జాబితాలో చేర్చిన రాష్ట్రాల వారీగా బీసీ కులాల వివరాలను పొందుపరిచింది. ఏపీలోని కులాలు కూడా అందులో ఉన్నాయి. కానీ అదే వెబ్‌ైసైట్‌లో 31వ రాష్ట్రంగా తెలంగాణను పొందుపరిచినా... దాన్ని ఓపెన్ చేస్తే రాష్ట్రంలోని కులాల జాబితా లేదు. దీంతో ఐఐటీల్లో ఓబీసీ-నాన్ క్రీమీలేయర్ విద్యార్థులు సీట్లు కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ అంశంపై తల్లిదండ్రులు గౌహతి ఐఐటీ అధికారులను సంప్రదించగా.. తామేం చేయలేమని, కేంద్ర ఓబీసీ కులాల జాబితాలో (సెంట్రల్ లిస్టు ఆఫ్ ఓబీసీస్) చేర్చిన రాష్ట్రాలకు చెందిన విద్యార్థులను మాత్రమే ఓబీసీ-ఎన్సీఎల్ కేటగిరీలో జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అవకాశం కల్పించామని పేర్కొన్నారు. దీనిపై పలువురు తల్లిదండ్రులు సీఎం కేసీఆర్‌కు, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరికి మెయిల్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఎన్సీబీసీతో మాట్లాడి రాష్ట్రంలోని ఓబీసీల జాబితాను కేంద్ర జాబితాలో చేర్చేలా చర్యలు చేపట్టాలని, అలాగే గౌహతి ఐఐటీ అధికారులతో మాట్లాడి రాష్ట్ర విద్యార్థులు ఓబీసీ నాన్ క్రీమీలేయర్ కోటా కింద జేఈఈ అడాన్స్డ్కు దరఖాస్తు చేసుకునేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.