breaking news
Nova institutions
-
న్యాయం చేయాలంటూ విద్యార్థుల ఫిర్యాదు
జంగారెడ్డిగూడెం రూరల్ : తమకు న్యాయం చేయాలంటూ మండలంలోని వేగవరం నోవా కళాశాలలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులు శుక్రవారం జంగారెడ్డిగూడెం డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణకు విన్నవించుకున్నారు. ప్రాక్టికల్ పరీక్షల్లో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల తమకు అన్యాయం జరిగిందని, దీని వల్ల తాము ఏడాది చదువు నష్టపోవాల్సి వచ్చిందని విద్యార్ధులు డీఎస్పీకి వివరించారు. డిగ్రీలో 80 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన తాము ప్రాక్టీకల్స్‌లో ఫెయిల్ కావడం ఏమిటని కావాలనే తమను ఫెయిల్ చేశారంటూ డీఎస్పీ వద్ద విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జరిగిన అన్యాయాన్ని కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా పీజీ కోర్సులో చేర్చేలా చూస్తామని హామీ ఇచ్చారని డీఎస్పీకి వివరించారు. దీంతో నెల రోజుల పాటు తాము కళాశాల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో మిమ్మల్ని ఆశ్రయించాల్సి వచ్చిందని డీఎస్పీ వద్ద వాపోయారు. విద్యార్థులు పోలీసులను ఆశ్రయించారని తెలుసుకుని కళాశాల సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులను నచ్చజెప్పె ప్రయత్నాలు చేశారు. దీనిపై కళాశాల సిబ్బంది మాట్లాడుతూ ప్రాక్టికల్ మార్కులు యూనివర్సిటీ పరిధిలో ఇస్తారని, తమ విద్యార్థులకు అన్యాయం జరిగిందని, యూనివర్సిటీకి ఫిర్యాదు చేసి న్యాయం చేస్తామని చెబుతున్నారు. -
చంద్రబాబుది నయవంచన
నూజివీడు, న్యూస్‌లైన్ : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎవరినైనా సరే వాడుకుని మోసం చేయడంలో దిట్ట అని నోవా విద్యాసంస్థల అధినేత ముత్తంశెట్టి కృష్ణారావు ధ్వజమెత్తారు. నూజివీడులోని నోవా విద్యాసంస్థల కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అవనిగడ్డ వెళ్లి డాక్టర్ చంద్రశేఖర్, అంబటి హరిప్రసాద్‌లను ఒప్పించుకుంటే టిక్కెట్ ఇస్తానని చంద్రబాబు చెప్పారని, దీంతో ఎంతో కృషిచేసి మార్గాన్ని సుగమం చేసుకుంటే తీరా పార్టీకి సంబంధంలేని, నిన్నటివరకు పార్టీకి వ్యతిరేకి అయిన వ్యక్తికి టిక్కెట్ ఇచ్చి తనను నిట్టనిలువునా మోసం చేశారని మండిపడ్డారు. అవనిగడ్డ వెళ్లిన దగ్గర నుంచి పార్టీ అభివృద్ధికి లక్షలాది రూపాయలు ఖర్చుచేశానని, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎంతో కృషిచేస్తే చంద్రబాబు వేరొకరికి సీటు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం తాను ఏవిధంగా కష్టపడిందీ కొనకళ్ల నారాయణకు, సుజనాచౌదరికి తెలుసునని, దీనిపై చంద్రబాబుతోనే తేల్చుకుంటానని స్పష్టం చేశారు. పక్క పార్టీ జిల్లాలో ఏవిధంగా తన సామాజిక వర్గానికి చెందినవారికి టిక్కెట్లు ఇస్తోందో చూసి నేర్చుకోవాలన్నారు. జిల్లాలో 29 శాతం తన సామాజిక వర్గం ఉందని, ఈ నేపథ్యంలో జిల్లాస్థాయిలో సమావేశం ఏర్పాటుచేసి తేల్చుకుంటానని చెప్పారు. మరో కార్యకర్తకు ఇలాంటి అన్యాయం జరగకుండా చూస్తానని తెలిపారు.