No.1 rank
-
మస్క్ పతనం మొదలైందా?: లక్షల కోట్లు ఆవిరి
టెస్లా, స్పేస్ఎక్స్, ఎక్స్ (ట్విటర్) వంటి సంస్థలను విజయవంతంగా ముందుకు నడిపిస్తున్న ఎలాన్ మస్క్ సంపద భారీగా ఆవిరవుతోంది. ఇటీవల తన నికర విలువలో 120 బిలియన్ డాలర్లు (రూ. 10లక్షల కోట్ల కంటే ఎక్కువ) తగ్గింది. అయితే.. 330 బిలియన్ డాలర్ల సంపదతో, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్నప్పటికీ.. 2025 ప్రారంభం నుంచి సంపదలో 25 శాతం క్షీణతను పొందారు. ఇది ఇలాగే కొనసాగితే.. నెం.1 స్థానానికే ముప్పు ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.మస్క్ తరువాత స్థానంలో అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ (Jeff Bezos), ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) ఉన్నారు. మస్క్ సంపద ఇలాగే తగ్గుతూ పోతే.. ప్రపంచ కుబేరుడి స్థానాన్ని మరొకరు స్వాధీనం చేసుకుంటారు.మస్క్ సంపద తగ్గడానికి కారణంమస్క్ సంపద తగ్గడానికి ప్రధాన కారణం టెస్లా (Tesla) అని తెలుస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉండటం వల్ల.. టెస్లా అమ్మకాలు 2024 డిసెంబర్ నుంచి 2025 జనవరి వరకు 16 శాతం తగ్గాయి. అంతే కాకుండా గత రెండు నెలల్లో, టెస్లా షేర్ ధర దాదాపు 35% తగ్గింది. దీంతో మస్క్ సంపద గణనీయంగా తగ్గింది.ఇదీ చదవండి: ఎక్స్‌పై సైబర్ ఎటాక్ ఆ దేశం పనే!మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసే సంస్థలు కూడా పెరిగాయి. దీంతో చాలామంది కొత్త కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారు. దెబ్బకు టెస్లా ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు పడిపోయాయి. అమ్మకాల్లో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వాల్సి వచ్చింది. కాగా టెస్లా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు తెలుస్తోంది.రాజకీయ ప్రమేయంప్రపంచ కుబేరుడు, దిగ్గజ వ్యాపారవేత్త మస్క్ సంపద తగ్గడానికి మరో కారణం.. పెరుగుతున్న రాజకీయ ప్రమేయం అని తెలుస్తోంది. ట్రంప్ ఎన్నికల ప్రచారానికి మస్క్ భారీగా ఖర్చు చేశారు. దీంతో అమెరికా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత.. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ (DOGE) అధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తరువాత కొంతమంది పెట్టుబడిదారులతో భయం మొదలైంది. ఇది కూడా మస్క్ కంపెనీ షేర్స్ తగ్గడానికి కారణమైంది. -
క్యూ1 లాభాల కిక్: నెంబర్ వన్‌గా రిలయన్స్
సాక్షి, ముంబై: ముకేష్ అంబానీ సొంతమైన రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా దేశంలో అతిపెద్ద కంపెనీగా నిలిచింది. దేశీయ అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)ను వెనక్కి నెట్టి ఆగ్ర భాగాన నిలిచింది. క్యూ1ల సాధించిన ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆర్ఐల్ కౌంటర్లో కొనుగోళ్లకు మొగ్గు చూపారు. దీంతో ఇంట్రా డేలో 2 శాతానికి పైగా లాభపడింది. మంగళవారం షేరు ధర పెరగడంతో రిలయన్స్ మొత్తం విలువ 7 లక్షల 46 వేల 472 కోట్లకు పెరిగింది. తాజా లాభాలతో దాదాపు 2.7 లక్షల కోట్లను మార్కెట్ క్యాప్‌లో జత చేసుకుంది. జులై 13న తొలిసారి రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ.7 లక్షల కోట్ల మార్క్‌ను దాటింది. టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ. 7.39 లక్షల కోట్లగా ఉంది. కాగా ఈ ఏడాది తొలి త్రైమాసికంలో రిలయన్స్ నికర లాభం రూ.9459 కోట్లకు చేరింది. గతేడాది కంటే 17.9 శాతం లాభాలు పెరిగాయి. సంస్థ ఆదాయం 56.5 శాతం పెరిగి 1,41,699 కోట్లకు చేరింది. -
టీమిండియాకు టాప్ ర్యాంక్
దుబాయ్: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఇంగ్లండ్‌తో రెండు, మూడో వన్డేల్లో నెగ్గిన టీమిండియా.. వన్డే జాబితాలో ఆస్ట్రేలియాతో కలసి నెంబర్ వన్ ర్యాంక్ సొంతం చేసుకుంది. జింబాబ్వే చేతిలో ఆస్ట్రేలియా ఓటమి చవిచూడటంతో ఏకంగా నాలుగో స్థానానికి దిగజారింది. తాజా జాబితాలో భారత్ ఒక్కటే నెంబర్ వన్ ర్యాంక్‌లో ఉండగా, దక్షిణాఫ్రికా, శ్రీలంక వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. -
అశ్విన్ @ నెంబర్‌వన్
కోల్‌కతా టెస్టులో బంతితో పాటు బ్యాట్‌తోనూ విజృంభించిన భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐసీసీ టెస్టు ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో నెంబర్‌వన్ స్థానానికి దూసుకెళ్లాడు. వెస్టిండీస్‌తో తొలి టెస్టులో అశ్విన్ ఐదు వికెట్లు, సెంచరీతో అద్భుత ప్రదర్శన కనబరచడంతో ర్యాంక్ మెరుగుపడింది. తాజా జాబితాలో షకీబల్ హసన్, కలిస్‌ను వెనక్కినెట్టి అశ్విన్ నెంబర్‌వన్ పీఠం అధిరోహించాడు. ఇక బ్యాట్స్‌మెన్, బౌలర్ల జాబితాల్లోనూ అశ్విన్ ర్యాంక్ మెరుగైంది. బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో 18 స్థానాలు ఎగబాకి 45వ ర్యాంక్, బౌలర్ల జాబితాలో రెండు స్థానాలు సంపాదించి ఆరో ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు. వెస్టిండీస్‌తో తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ తేడాతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజా జాబితాలో భారత క్రికెటర్ల ర్యాంక్‌లు మెరుగుపడ్డాయి.