breaking news
nizam govt
-
ఎగువ మానేరు ఎడారేనా..?
సాక్షి, ముస్తాబాద్(సిరిసిల్ల) : రాజన్న సిరిసిల్ల జిల్లా వరప్రదాయని ఎగువ మానేరు ప్రాజెక్టు. ఇంకా చెప్పాలంటే రాష్ట్రంలోనే మొదటి చిన్నతరహ నీటి ప్రాజెక్టు. నిజాం కాలంలో నిర్మించిన ఈ ప్రాజెక్టు ఆధునీకీకరణ పనులు అటకెక్కాయి. మిషన్ కాకతీయ, నీటి ప్రాజెక్టులకు వేలాది కోట్లు ప్రభుత్వం కేటాయిస్తుండగా.. అధికారుల ఉదాసీనత ఈ ప్రాజెక్టుకు శాపంగా మారింది. వేలాది ఎకరాలకు ప్రత్యక్షంగా.. పరోక్షంగా సాగునీరందిస్తూ.. ప్రజల దాహార్తిని తీరుస్తున్న ఎగువ మానేరుపై పాలకులు శీతకన్ను వీడాలి. ఈ ఏడాది మరమ్మతు పనులకు ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేస్తోందని ఎదురు చూసిన రైతన్నలకు చివరకు నిరాశే మిగిలింది. ఈ వర్షాకాలానికి ముందే పనులు పూర్తవుతాయని భావించారు. మరింత ఆయకట్టు సాగులోకి వస్తుందనకున్న అన్నదాతలకు ఎదురు చూపులే దక్కాయి. కొట్టుకుపోతున్న స్పిల్‌వే.. చివరి నిజాం మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ 1945లో కూడవెళ్లి, పల్వంచ వాగులపై నర్మాల వద్ద ఎగువ మానేరు ప్రాజెక్టును నిర్మించారు. 1948లో పనులు పూర్తయ్యాయి. 2టీఎంసీలతో 17వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించే పనులకు శ్రీకారం చుట్టారు. కుడికాలువ ద్వారా అంటే ఇప్పటి ముస్తాబాద్ మండలానికి 10వేల ఎకరాలకు, ఎడమ కాలువ ద్వారా గంభీరావుపేట మండలానికి 7వేల ఎకరాలకు సాగునీటిని అందించారు. కాలక్రమంలో ప్రాజెక్టును అధికారులు పట్టించుకోలేదు. దీంతో సిల్ట్ పేరుకుపోయి నీటి సామర్థ్యం తగ్గింది. అలాగే కుడి, ఎడమ కా లువలు మట్టిలో కూరుకుపోయి చెట్లు మొలిచి నీ రు ముందుకు సాగని విధంగా తయారైంది. ఇక కుడి కాల్వలోని డిస్ట్రిబ్యూటరీ 17 వరకు షట్టర్లు ధ్వంసం అయ్యాయి. ఎడమ కాల్వలోని డీ–10 వ రకు శిథిలం అయ్యాయి. స్పిల్‌వే పై మొక్కలు మొ లిచి నెర్రెలు పెట్టింది. కొంత భాగం వరదకు కొ ట్టుకుపోయింది. చివరకు 5వేల ఎకరాలకు మాత్ర మే సాగునీరందించే ప్రాజెక్టుగా మిగిలిపోయింది. ప్రతిపాదనలకు మోక్షం కలిగేనా.. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో నీటిపారుదల శాఖ అ« దికారులు ఎట్టకేలకు కుడి, ఎడమ తూముల మరమ్మతు, షట్టర్ల మరమ్మతు, కుడికాలువ పది కిలో మీటర్లు, షట్టర్లు, ఎడమ కాలువ 5 కిలోమిటర్ల కా ల్వ లైనింగ్, ముఖ్యంగా యాభై ఏళ్లుగా నిండుకు న్న సిల్ట్ తొలగింపు తదితర పనులు చేపట్టేందుకు రూ. 49 కోట్ల ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆరునెలల క్రితం పంపించిన ప్రతిపాదనలు ఈఎస్సీ వరకు వెళ్లి ఆగినట్లు తెలుస్తోంది. ఈ వేసవిలోనే సిల్ట్ తొలగించి కనీసం 13వేల ఎకరాలకు నీరందించాలనుకున్న ప్రతిపాదనలు దాటలేదు. మళ్లీ వర్షాలు మొదలైతే ఇక సిల్ట్పనులు చేయరాదు. భారీ వర్షాలు పడితే వచ్చే వెసవి నాటికి కూడా పూడిక తీసే అవకాశాలు తక్కువే. ష ట్టర్ మరమ్మతు చేయరాదు. మరోసారి రబీలో 5వేల ఎకరాలకు మాత్రమే నీరందించే అవకాశాలున్నాయి. 9వ ప్యాకేజీలోకి గెస్ట్‌హౌస్, బోటింగ్ నిజాం నిర్మించిన గెస్ట్‌హౌజ్ శిథిలావస్థలో ఉండగా.. ఉద్యానవనం రూపు కోల్పోయింది. దీంతో అధికారులు రూ.2 కోట్లతో ఆధునిక హంగులతో గెస్ట్‌హౌస్ నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తి చేశారు. టూరిజం శాఖ ఉద్యానవనం, గెస్ట్‌హౌస్ నిర్మాణం చేపట్టనుండగా.. దీనిని కాళేశ్వరం ప్రాజెక్టు 9వ ప్యాకేజీ కింద చేపట్టనున్నారు. -
ఒక గానమూ - కొన్ని పలవరింతలు
రాయలసీమా! నువ్వు శాప దత్త భూమివి. ఆంగ్లేయులముందు నిజాం విసిరిన పాచికవి. భాష ఒక మిష. సోదరత్వం ఒక సాకు. భాషోద్యమం ఒక కుట్ర. ఏ చారిత్రక మలుపులో ఎవరితో ఎటువంటి రచనలు రాయించుకోవాలో సమాజానికి తెలుసు. తెలంగాణ విడిపోయింది. సమైక్యాంధ్ర బద్దలైంది. నవ్యాంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ అస్తిత్వం ప్రశ్నార్థకమైంది. రాయలసీమ కరువూ, భాషా, సంస్కృతి, చరిత్రా వెరసి స్థానిక ప్రత్యేకత ఒక చర్చనీయ సందర్భమైంది. ఈ సామాజిక సందర్భమే హంద్రీగానానికి గొంతు సవరించుకుంది. రాయలసీమ నేలగీతం క్రిష్ణానది. రాయలసీమకు చెందిన ముఖ్యమంత్రులు కోస్తాకు వనరులై ఉపయోగపడుతుంటే, మా క్రిష్ణానది ఒక పరాధీనగీతమే! రాయలసీమ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కేంద్ర ప్రణాళికాసంఘం ఆమోదంకూడా పొందిన క్రిష్ణా పెన్నార్ ప్రాజెక్టు ఏమైంది? ఆ ప్రాజెక్టునుంచి రాయలసీమకు రావాల్సిన 400 టీఎంసీలు ఎక్కడకు పోయినాయి. మనది ఒకే భాష ఒకే జాతి అనే నెపం మీద రాయలసీమను ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోంచి బైటికి తీసుకువచ్చి మోసం చేసిందెవరు? క్రిష్ణా పెన్నార్‌ను నాగార్జునసాగర్ అనే బానపొట్టగా మార్చి హైజాక్ చేసిందెవరు? వాడే! బ్రిటన్ హయాంలోనే నీటి రుచి మరిగినవాడు! రాయలసీమ నీళ్ళకోసం భాషను కూడా పాచికగా విసరగలిగిన వాడు! వాడే!! రాయలసీమా! నువ్వు శాప దత్త భూమివి. ఆంగ్లేయులముందు నిజాం విసిరిన పాచికవి. లాభంలేనివాన్ని చివరకు నెట్టే కుట్రను దొరలపాలనే కనిపెట్టింది. రెళైై్ల, నీళ్లై కోస్తాకు ఆధునిక వికాసమైన ఆంగ్లపాలన నీ దేహం మీద కరువుల పర్వమే రచించింది. భాష ఒక మిష. సోదరత్వం ఒక సాకు. భాషోద్యమం ఒక కుట్ర. సర్కారు సోదరులమీద సీమ హృదయప్రేమ అనుమానపు తెరలుగా ఊగింది. చరిత్రలో పెద్దన్న బుద్ధి ద్రోహ ఉదాహరణలుగానే నమోదయ్యింది. సియామిస్ కవలల కల అట్లా భగ్నమైంది. అలిగిన కోటి రతనాల వీణ తీగలు తెంచుకు వెళ్ళిపోయింది. కానీ, ఆ పొరపాటు అతుకు కోసం నువ్వు కోల్పోయిన బళ్ళారి మాటేమిటి? భద్ర నీటి హక్కు మాటేమిటి? కొండారెడ్డి ఋరుజు ముందు చెదరిన గుడారాలు చార్మినార్ ఎదుట రాజధానిగా మారిన మాటేమిటి? ఆంధ్రా బూర్జువాలకేం? తమ పెట్టుబడి గుడ్లను పొదుగుతూనే ఉంటారు, ఎక్కడైనా ఎప్పుడైనా! కోస్తాకు స్తన్యమిచ్చిన నా రాయలసీమ తల్లీ! శ్రీబాగ్ ఒడంబడికను సమాధి చేసిన నా సోదరుల నేర చరిత్ర మాటేమిటి? వారు మాట్లాడినదే భాషంట! వారు జీవించినదే నాగరికతంట! అట్లయితే, మైసూరు నుండీ శ్రీలంక దాకా మాది దుఃఖ తెనుగు స్వగతమేకదా! కానీ, ప్రతి అస్తిత్వ హననమూ చివరికి పునరుజ్జీవనాన్నే వాగ్దానం చేస్తుంది కదా! అదిగో ఫినిక్స్ గానం! రాయలసీమా! నీ కావ్యజగత్తును ఏమని వర్ణించను? పెద్దనకు హిమవన్నగమై, తిమ్మనకు దివ్యలోక పారిజాతమై, ధూర్జటికి భక్తి నేర్పిన మూగప్రాణాలై, సూరనకు కళాపూర్ణో దయ వైభవమై... అంతేనా? ఈస్తటిక్సును కాస్సేపు పక్కకు పెట్టు. అన్నమయ్యకు మాత్రమే జీర్ణమైన నీ తెనుగు పదం మాటేమిటి? వేమన పలికిన సమాజ నిష్టూరాల్నీ, వీరబ్రహ్మం తెచ్చిన అపండిత భాషా విప్లవాన్నీ, సూఫీ గురువుల సామరస్య మార్గాన్నీ సాంస్కృతిక జిగిబిగిగా అల్లుకున్నది నువ్వేకదా రాయలసీమా! జనసమూహాల ఆశలపై జీమూతంలా వాలే రాజకీయ పాలేగాళ్ళకు నీ చరిత్రా, సంస్కృతి ఏం అక్కరకు వస్తాయిలే! అధికారపు నిచ్చెన మెట్లకు ఒక్కొక్క సహోదరుణ్ణీ బలి ఇచ్చేవాళ్ళేకదా నేటి రాయలసీమ రాజకీయ విభులు! రాయలసీమా! నీవు జలదాహాల దేహార్తివి. కరువు మాత్రమే పండే పంటపొలానివి. చరిత్ర చిల్లర దేవుళ్ళకు చించి చుట్టబెట్టిన వస్త్రానివి. నీ బాధ్యతల్ని భుజానికెత్తుకునే దాహపు వీలునామా ఎక్కడ? ఇదంతా చూస్తూ కూడా నీ లేపాక్షి బసవడో, యాగంటి బసవడో తోక తొక్కిన త్రాచుపామై ఎందుకు లేవడు? నువ్వెవరని ఎవరైనా ఎందుకంటారు రాయలసీమా! బతుకుతెరువు కోసం యుద్ధమైనావు. చరిత్ర నేర్పిన గుణపాఠాల జ్ఞాపకమైనావు. అనాదిక్రోధపు సంకేతమైన దేవరగుట్ట కర్రల సమర శబ్దానివయినావు. రాగిముద్దా ఊరుమింటిని సద్ది కట్టుకో రాయలసీమా! రాజధానిని చూడవద్దువు గానీ. గుట్టల మీదా కొండల కిందా వెలసిన అవధూతల దర్గాతాతల ఆశీర్వాదాలు తీసుకోవడం మరిచిపొయేవు సుమా. అదిగో నీ దారి. ఊరి బొడ్రాయి గడ్డన వెలసిన మారెమ్మ గుడి సందులనుంచీ, బీరప్ప పరసల జాతర్లనుంచీ రా! సూఫీ దర్గాలనుంచీ, ఆదోని మాదిగ లక్ష్మమ్మ కరుణా ప్రసాదంతో రా! దుఃఖాన్ని పండించే పంటపొలాలనుంచీ, పెన్నా క్రిష్ణలు కలిసే కలను ఛిద్రం చేసిన ఆ తీరప్రాంతానికి రా! మూన్నాళ్ళ ముచ్చటైన రాజధానిని చూసి నా ఎద మీద ప్రశ్నగా మొలుచుకొస్తావేమో! చిట్లిపోయిన కన్నీటి చుక్కల మట్టి కేకనవుతాను. ఉరి పేనిన బతుకుపంటనవుతాను. కోడెగిత్తలు కాడి తప్పిపోతుంటే, నదీ మూలాలు నడకలు మరిచిపోతుంటే, నెర్రెలు చీలిన పగుళ్ళలోంచి ఆత్మశ్వాసనవుతాను. కానీ, రాయలసీమ ఫీనిక్స్ గానంలో ఉన్నానున్నానేనున్నాను కవీ! అనంతపురం గూగూడుకుళ్ళాయి స్వామి సూఫీతత్వపు మంత్ర కణికనై, చిత్తూరు గంగ జాతరలో అనాది చిందునై, కడప అమీర్ పీరా దర్గాలో సామరస్య ప్రార్థననై, ఒంగోలు గిత్త చర్మపు డప్పు జనక జనక జజ్జనకనై, గుండ్లకమ్మ నుండీ పెన్న దాకా, కొండారెడ్డి బురుజు నుంచీ హోసూరు దాకా ఉన్నానున్నానేనున్నాను రాయలసీమ కవీ! రాయలసీమ భూమిపుత్రులను మేల్కొలిపే శబ్దశరంకదా నీ హంద్రీగానం! ఉపసంహారం: వెంకటక్రిష్ణ హంద్రీగానంలో కాలం పేజీలు వెనక్కితిప్పి చరిత్రను తడిమే స్పర్శ జ్ఞానముంది. సాంస్కృతిక పునరుజ్జీవన భవిష్యద్దర్శనముంది. ఐతిహాసిక చిత్రణ ఉంది. జీసస్ వెప్ట్ అన్నట్లు రాయలసీమ కోసం ఇతనిది ప్రవక్త దుఃఖం. ఇతనిలో దున్నేకొద్దీ దుఃఖముంది. మండే కొద్దీ ధర్మాగ్రహముంది. చరిత్ర వైపు వేలెత్తి చూపే సాహసముంది. ఇతడు రాయలసీమ జనహృదయ గానాన్ని సాధన చేసినవాడు. ఈ కవికి అభినందనలు. ఇతని కవిత్వానికి జేజేలు. - బండి నారాయణస్వామి 8886540990