breaking news
nine lakh
-
9 లక్షలు దాటిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మరింత పెరిగింది. పాజిటివ్ కేసుల సంఖ్య చూస్తుండగానే 9 లక్షల మార్కును దాటేసింది. గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 28,498 కేసులు బయటపడ్డాయి. 553 మంది కరోనా బాధితులు మృతిచెందారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. దేశంలో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ కేసులు 9,06,752కు, మరణాలు 23,727కు ఎగబాకాయి. 5,71,459 మంది బాధితులు చికిత్సతో కోలుకున్నారు. ప్రస్తుతం 3,11,565 మంది చికిత్స పొందుతున్నారు. దేశంలో 86 శాతం కరోనా పాజిటివ్ కేసులు కేవలం 10 రాష్ట్రాల్లోనే నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 50 శాతం కేసులు మహారాష్ట్ర, తమిళనాడులోనే బయటపడ్డాయని అన్నారు. దేశంలో మరణాల రేటు క్రమంగా తగ్గుముఖం పడుతోందన్నారు. ఇలా ఉండగా, బిహార్‌లో ఈ నెల 16 నుంచి 31వ తేదీ వరకు పూర్తిస్థాయిలో లాక్డౌన్ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది సెల్ఫ్ క్వారంటైన్లో రాంమాధవ్ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లారు. కాగా.. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఈ వారంలోనే 10 లక్షల మార్కును దాటనుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్లో పేర్కొన్నారు. కరోనా నియంత్రణకు ఇకనైనా కఠినమైన చర్యలు చేపట్టకపోతే ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి అదుపు తప్పుతుందంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ చేసిన హెచ్చరికకు సంబంధించిన వార్తను ఈ ట్వీట్‌తో జత చేశారు. -
డబ్బుతో పట్టుబడ్డ హీరో
ట్యుటికొరిన్: తమిళ నటుడు, రాజకీయ నాయకుడు శరత్ కుమార్ శనివారం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా తరలిస్తున్న డబ్బుతో పట్టుబడ్డారు. 'ఆల్ ఇండియా సమతువ మక్కల్ కచ్చి' అధ్యక్షుడిగా ఉన్న ఆయన.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాఏడీఎంకేతో పొత్తుతో తిరుచెందూర్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. తాను పోటీచేస్తున్న నియోజకవర్గానికి సమీపంలోనే ఎన్నికల అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఆయన కారులో 9 లక్షల రూపాయలతో పట్టుబడ్డారు. ఈ డబ్బుకు సంబంధించిన సరైన ఆధారాలు చూపించడంలో శరత్ కుమార్ విఫలమయ్యారని పోలీసు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న నగదును ట్రెజరీలో డిపాజిట్ చేసినట్లు వారు వెల్లడించారు. మే 16న జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో ఇప్పటివరకు 80 కోట్ల రూపాయలను సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు నేరుగా ఇలా డబ్బుతో పట్టుబడటం మాత్రం ఇదే తొలిసారి. హీరోయిన్ రాధిక భర్త అయిన శరత్ కుమార్.. ఇలా పట్టుబడ్డారు గానీ, తమిళనాడు ఎన్నికల్లో భారీ మొత్తంలో ధన ప్రవాహం సాగుతోందని జాతీయ మీడియా గగ్గోలు పెడుతోంది. పట్టుబడింది ఆవగింజలో ఆరోవంతేనని, ఇంకా చాలా కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయని చెబుతున్నారు.