breaking news
Ninagupta
-
ఇది ఎప్పటికీ మారదు
దాదాపు మూడు దశాబ్దాలుగా హిందీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు నీనా గుప్తా. కేవలం సినిమాల్లోనే కాదు బుల్లితెరపై కూడా సత్తా చాటారు. అంతేకాదు.. ‘వో చోక్రి (1994)’ అనే సినిమాకు ఉత్తమ సహాయనటిగా జాతీయ అవార్డును గెలుచుకున్నారు. ఇటీవల ‘బదాయీ హో’ అనే సినిమాలో నటించారు. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాలో తాను చేసిన పాత్ర గురించి నీనా మాట్లాడుతూ– ‘‘నా వయసులో ఉన్నవారు చేయలేని ఓ డిఫరెంట్ పాత్రను ఈ సినిమాలో చేశాను’’ అన్నారు. అలాగే హీరోలు, హీరోయిన్లకు లభిస్తున్న పాత్రల గురించి ఆమె మాట్లాడుతూ– ‘‘నా వయసులో ఉన్న హీరోలు ఇప్పుడు పాతికేళ్ల వయసు ఉన్న హీరోయిన్లతో నటిస్తున్నారు. నాలాంటి వారినేమో నాన్నమ్మ, అమ్మమ్మ పాత్రలు చేయమంటున్నారు. ఇది చాలా బాధాకరం. సమాజంలో మహిళల పరిస్థితి ఎలా ఉంది అనడానికి ఇదొక ఊదాహరణ. ఈ విషయంలో ఎప్పటికైనా మార్పు వస్తుందని నేను అనుకోవడం లేదు’’ అన్నారు. -
జూలై 4న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: నీనాగుప్తా (నటి), ఎస్.గోపాల్‌రెడ్డి (సినిమాటోగ్రాఫర్) ఈ రోజు పుట్టిన వారి సంవత్సర సంఖ్య 1 కావడం వల్ల ఈ సంవత్సరం మీ జీవితం కొత్త మలుపు తిరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. అవివాహితులకు వివాహ యోగం, జీవితంలో ఉన్నతికి చేరుకుంటారు. కొత్త స్నేహాలు, కొత్త బంధుత్వాలు ఏర్పడతాయి. పిల్లలకు పెళ్లి చేస్తారు. ఆశావహ దృక్పథంతో, దృఢవిశ్వాసంతో తమ రంగాలలో కీలక స్థానానికి చేరుకుంటారు. కంప్యూటర్ రంగంలోని వారికి, ఎంబీఏ; సి.ఎ, ఎల్.ఎల్.బి వారికి మంచి అవకాశాలు ఏర్పడతాయి. సంతానం లేనివారికి సంతాన ప్రాప్తి. రియల్ ఎస్టేట్, మైన్స్ రంగాలవారు లాభాలు ఆర్జిస్తారు. అహంభావంతో ప్రవర్తించి, అయిన వారిని దూరం చేసుకునే ప్రమాదం ఉంది కాబట్టి, అహాన్ని తగ్గించుకోవడం మంచిది. లక్కీ నంబర్స్: 1,4,5, 6; లక్కీ కలర్స్: వయొలెట్, రోజ్, ఆరంజ్, క్రీమ్, గోల్డెన్, శాండల్; లక్కీ డేస్: శుక్ర, శని, ఆదివారాలు. సూచనలు: తండ్రిని, తండ్రి తరఫు వారిని ఆదరించాలి. పేదవారికి గోధుమలు, మినుములు దానం చేయడం, మూగజీవాలకు ఆహారం తినిపించడం, అనాథలకు అన్నదానం చేయడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్, సంఖ్య, జ్యోతిష శాస్త్ర నిపుణులు